Tag Archives: lpg

గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ ఎంత ఉందో తెలుసుకోవాలా.. పాటించాల్సిన చిట్కా ఇదే..?

దేశంలో కోట్ల సంఖ్యలో కుటుంబాలు వంట కోసం గ్యాస్ సిలిండర్ ను ఉపయోగిస్తున్నాయి. ధరలు పెరుగుతున్నప్పటికీ సిలిండర్ ద్వారా సులభంగా వంట చేసే అవకాశం ఉండటంతో చాలామంది గ్యాస్ సిలిండర్ వినియోగించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే గ్యాస్ సిలిండర్ లో ఎంత గ్యాస్ ఉందనే విషయం గురించి మనకు తప్పనిసరిగా అవగాహన ఉండాలి. అకస్మాత్తుగా గ్యాస్ అయిపోతే ఇబ్బందులు పడక తప్పదు.

సింగిల్ సిలిండర్ ను వినియోగించే వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా ఒకటి కంటే ఎక్కువ గ్యాస్ సిలిండర్లను వినియోగించే వాళ్లకు మాత్రం ఇబ్బందులు తప్పవు. అయితే చిన్న చిట్కాను పాటించడం ద్వారా సులువుగా సిలిండర్ లో గ్యాస్ ఎంత ఉందో సులభంగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం గ్యాస్ సిలిండర్ ను తడిగుడ్డతో తుడవాలి. గ్యాస్ సిలిండర్ ను తుడిచిన చోట ఎక్కడివరకు తడి వేగంగా ఆరిపోతుందో అక్కడివరకు సిలిండర్ లో గ్యాస్ అయిపోయిందని భావించాలి.

అలా కాకుండా తడి త్వరగా మొత్తం ఆరిపోతే గ్యాస్ సిలిండర్ అయిపోయే అవకాశం ఉందని భావించాలి. ఉదాహరణకు గ్యాస్ సిలిండర్ లో సగం గ్యాస్ ఉంటే గ్యాస్ ఉన్న భాగం కాకుండా మిగిలిన భాగంలో తడి వేగంగా ఆరుతుంది. ఈ విధంగా ఎంత గ్యాస్ ఉందో సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చేయడం ద్వారా గ్యాస్ సిలిండర్ కోసం ముందుజాగ్రత్త పడే అవకాశం ఉంటుంది.

గ్యాస్ సిలిండర్ ను ఎత్తి బరువు చూసి గ్యాస్ ఎంత ఉందో తెలుసుకునే అవకాశం ఉన్నా అలా చేస్తే కచ్చితంగా గ్యాస్ ఎంత ఉందో తెలుసుకునే అవకాశం ఉండదు. అలా కాకుండా ఈ చిట్కాను పాటించడం ద్వారా సులభంగా గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు.