Tag Archives: maa building

Manchu Vishnu: ఆరు నెలలో మా బిల్డింగ్ భూమి పూజ.. మంచు విష్ణు కీలక ప్రకటన!

Manchu Vishnu: మంచు విష్ణు సినీనటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఈయన మా అధ్యక్షుడిగా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. మంచు విష్ణు మా అధ్యక్షుడు అయిన తర్వాత ఎక్కువగా మా సభ్యుల ఆరోగ్యం గురించి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే మా సభ్యులకు ఉచితంగా హెల్త్ చెకప్ క్యాంపు నిర్వహించారు.

Manchu Vishnu: ఆరు నెలలో మా బిల్డింగ్ భూమి పూజ.. మంచు విష్ణు కీలక ప్రకటన!

ఈ క్రమంలోనే హైదరాబాద్ ఏఐజి హాస్పిటల్ లో మా సభ్యులందరూ ఉచితంగా చెకప్ చేయించుకున్నారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మీడియా సమావేశంలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే హాస్పిటల్ సేవలను కొనియాడారు. ఇకపోతే మా బిల్డింగ్ ప్రస్తావన కూడా తీసుకువచ్చారు.

Manchu Vishnu: ఆరు నెలలో మా బిల్డింగ్ భూమి పూజ.. మంచు విష్ణు కీలక ప్రకటన!

ఇప్పటివరకు మా అసోసియేషన్ కు బిల్డింగ్ లేదు. ఈ క్రమంలోనే ఎన్నికల సమయంలో మంచు విష్ణు మా బిల్డింగ్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అది కూడా తన సొంత డబ్బులతో మా బిల్డింగ్ నిర్మిస్తానని చెప్పినప్పటికీ ఇప్పటివరకు మా బిల్డింగ్ ఏ మాత్రం కార్యరూపం దాల్చలేదు.తాజాగా మా బిల్లింగ్ గురించి మంచు విష్ణు కీలక ప్రకటన చేశారు.

అందరి నిర్ణయం అవసరం…

మరో ఆరు నెలలు మా బిల్డింగ్ పూజా కార్యక్రమాలను ప్రారంభిస్తామని ఈ సందర్భంగా మంచు విష్ణు తెలిపారు.తాను అధ్యక్షుడిగా ఎన్నికైన ఆరు నెలలలో 75 శాతం తన మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను పూర్తి చేశానని మరోఆరునెలలు మా బిల్డింగ్ పూజా కార్యక్రమాలను కూడా జరుపుకుంటుందని వెల్లడించారు. ఇక ఈ సమావేశంలో భాగంగా సినిమా టికెట్ల రేట్లు గురించి కూడా ఆయన ప్రస్తావించారు. సినిమా టికెట్ల రేట్లు ఒక్కరే తీసుకోవలసిన నిర్ణయం కాదు. ఈ విషయంపై అందరూ కలిసి కూర్చొని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని విష్ణు వెల్లడించారు.

“మా” కోసం.. కావలసిన డబ్బు మొత్తం ప్రభాస్ ఇస్తానన్నాడు : శివాజీ రాజా

తెలుగు సినిమా టీవీ నటుడిగా శివాజీ రాజా 1985లో చిత్రరంగ ప్రవేశం చేశారు. దాదాపు అతడు 260కి పైగా చిత్రాల్లో నటించారు. ఎం.వి.రఘు దర్శకత్వంలో గొల్లపూడి రాసిన కళ్ళు అనే నాటిక ఆధారంగా రూపొందిన అదే పేరుగల చిత్రంలో నటుడిగా గుర్తింపు పొందిన శివాజీ రాజా ఈ ప్రయోగాత్మక చిత్రం ద్వారా ఉత్తమ నూతన నటుడుగా నంది అవార్డు స్వీకరించాడు.పెళ్ళిసందడి, సిసింద్రీ, ఘటోత్కచుడు, మురారి, శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి సినిమాలలో చెప్పుకోదగ్గ పాత్రలలో నటించాడు.

ప్రస్తుతం శివాజీరాజా గురించి ‘మా’ అధ్యక్ష ఎన్నికలసందర్భంగా ఎక్కువగా వినిపిస్తోంది. మా భవనం అమ్మకానికి సంబంధించి ఆయన మాట్లాడుతూ.. మాకు సంబంధించిన ఫ్లాట్ అమ్మ‌కంలో నేను, న‌రేశ్ పార‌ద‌ర్శ‌కంగానే వ్య‌వ‌హ‌రించాం. ఎవ‌రికైనా వివ‌రాలు కావాలంటే అసోసియేష‌న్‌లో నిజాలు తెలుసుకోవాలి. ఎన్నిక‌ల ముందు ఇలాంటి విష‌యాల గురించి మాట్లాడ‌టం అంత గౌర‌వం అనిపించుకోదంటూ అతడు ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడారు. ఒక ఆఫీస్ అనేది ఉండాలనే డ్రీమ్ ఫుల్ ఫిల్ కాలేదు కదా.. అని అడగ్గా.. దాని గురించి అడిగేవాడు లేక ఇలా అయిందన్నారు. టాలీవుడ్ లో ఎంతోమంది కొన్ని కోట్లు రెమ్యూరేషన్ తీసుకుంటున్నారు.. కానీ ఆర్టిస్టులకు ఆఫీస్ కట్టలేరా అన్న అనుమానం తనకు కూడా వచ్చిందని.. కానీ ఇలా వెళ్లి వాళ్లను అడిగేవారు లేరు కదా అన్నారు. ఇలా జరుగుతుంది ఆఫీస్ కట్టండి అంటూ అడిగితే కడతారాని.. చిరంజీవి రావడానికి గల కారణం మేము వెళ్లి అడగడం వల్లనే అని అతడు సమాధానం ఇచ్చాడు.

దీనికి సబంధించి ప్రభాస్ ఓ ప్రోగ్రాంలో ఉన్నప్పుడు అతడి దగ్గరకు తాను వెళ్లి మా భవనానికి సంబంధించి సమస్యను చెప్పానన్నారు. ‘మా’ కు ఈ ప్రోగ్రాంకు వచ్చే డబ్బులు ఇవ్వనా అని అన్నారట. ఇలా వెళ్లి అడిగి.. దగ్గరుండి చేస్తే.. బిల్డింగ్ కట్టడం పెద్ద సమస్య కాదు అంటూ చెప్పాడు.

మా బిల్డింగ్ వ్యవహారంపై మరో రగడ.. అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు..

టాలీవుడ్ మూవీ అసోసియేషన్(మా) ఎన్నికలు నేషనల్ పాలిటిక్స్‌కు ఏ మాత్రం తగ్గకుండా నడుస్తున్నాయి. మా ఎన్నికల సందడి మొదలైన దగ్గర నుంచి ప్రతీ రోజు ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంది. హీరో విష్ణు కొత్త బిల్డింగ్ ప్రస్తావన తీసుకు వచ్చిన దగ్గర నుంచి వ్యవహారం మొత్తం దాని చుట్టే తిరుగుతోంది. అయితే పాత మా బిల్డింగ్ అమ్మకంపై ప్రస్తుతం రచ్చ జరుగుతోంది.

నాగబాబు, మోహన్ బాబు వీటిపై తీవ్రంగా ఆరోపణలు చేసుకుంటున్నారు. రూ. 90 లక్షలు విలువ చేసే బిల్డింగ్ ను కేవలం రూ. 30 లక్ష్లల ఎలా విక్రయించారని హీరో మోహన్ బాబు ప్రశ్నించగా.. దానికి కౌంటర్ గా నాగబాబు.. దానికి సంబంధించి నరేశ్, శివాజీ రాజాను అడగాలని చెప్పిన విషయం తెలిసిందే. అయితే దీనిపై స్పష్టంగా వివరణ ఇస్తూ.. బిల్డింగ్ కొనుగోలు చేసిన సమయంలో తానే అధ్యక్షుడిగా ఉన్నానన్న నాగబాబు సినీ పెద్దల సూచనలు, అప్పటి అవసరాలను దృష్టిలో ఉంచుకొనే 71 లక్షల 73వేలతో భవనాన్ని కొనుగోలు చేశామన్నారు.

అలాగే, ఇంటీరియర్ డిజైన్ కోసం మరో మూడు లక్షలు వెచ్చించినట్లు వివరించారు. 2006 నుంచి 2008 వరకూ తానే అధ్యక్షుడిగా ఉన్నానన్న నాగబాబు అధ్యక్ష పీఠం నుంచి దిగిన తర్వాత ‘మా’ వ్యవహారాల్లో ప్రత్యక్షంగా భాగస్వామిని కాలేదని దానికి కావాల్సిన సలహాలు మాత్రమే ఇచ్చానన్నారు. బిల్డింగ్ అమ్మకం గురించి మళ్లీ తనపై వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా రియాక్ట్ అవ్వాల్సి వస్తుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. అయితే, నాగబాబు వ్యాఖ్యలపై 24 గంటలు గడవక ముందే శివాజీరాజా రియాక్ట్ అయ్యారు. నాగబాబు హయాంలో ఎంత నిజాయతీతో ఆ ఫ్లాట్ కొన్నారో, తాను అధ్యక్షుడిగా, నరేశ్ కార్యదర్శిగా ఉన్న సమయంలో అంతే నిజాయతీతో అమ్మేశామని కౌంటర్ ఇచ్చారు.

అధ్యక్షుడిగా ఉన్న నరేష్ కూడా దీనిపై స్పందించారు.. స్పందించారు. అమ్మింది బిల్డింగ్ కాదని, కేవలం ప్లాట్ మాత్రమే అన్నారు. అక్కడ ఉన్న బిల్డింగ్ కు ఎలాంటి అద్దెలు రావడం లేదు. సింగిల్ వాల్ హౌస్, అలాగే పక్కనే మురుగు కాలువ కావడంతో ఆర్టిస్ట్స్ ఇబ్బంది పడేవారు. దీనితో ఆ ఫ్లాట్ అమ్మివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పేపర్లలో ప్రకటనను ఇచ్చినా ఎవరూ ముందుకు రాలేదు కావునా రూ. 30 లక్షలకకు అమ్మినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఆ బిల్డింగ్ కొన్న రేటుకు.. అమ్మిన రేటుకు ఇంత వ్యత్యాసం ఉండటంతో దాదాపు రూ.60 లక్షల వరకు అవకతవకలు జరిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా మా ఎన్నికల వ్యవహారంలో అసోసియేషన్ బిల్డింగ్ ఎపిసోడ్ కీలకంగా మారినట్లు కనిపిస్తోంది. ఇది చివరకు ఎటు దారి తీస్తుందో చూడాలి.