Tag Archives: movie tickets

Sreeleela: హీరోలను చూడటం కోసమే టికెట్లను కొనుగోలు చేస్తున్నారు… నటి శ్రీ లీల కామెంట్స్ వైరల్!

Sreeleela: పెళ్లి సందD సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు యంగ్ బ్యూటీ శ్రీ లీల. మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమె అనంతరం తెలుగులో వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్నారు. ప్రస్తుతం ఈమె తెలుగులో సుమారు అరడజనుకు పైగా సినిమా అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ విధంగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి శ్రీ లీల తనకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.ఇక యంగ్ హీరోల నుంచి మొదలుకొని సీనియర్ హీరోల సినిమాలలో కూడా ఈమె నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె ప్రేక్షకులను ఉద్దేశిస్తూ పలు విషయాలను తెలియజేశారు.

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారని అయితే ఇప్పటికీ ప్రేక్షకులు సినిమా టికెట్లు కొనుగోలు చేసి థియేటర్ కు వస్తున్నారు అంటే అది కేవలం హీరోలను చూడటానికి మాత్రమేనని తెలియజేశారు.ఇక తాను ఇండస్ట్రీకి కొత్తగా వచ్చాను తనకు మంచి పాత్రలలో నటించే అవకాశం వస్తే చాలు కానీ సినిమా మొత్తం తానే కనిపించాలని అసలు అనుకోనని తెలిపారు.

Sreeleela: హీరోల కోసమే ప్రేక్షకులు వస్తున్నారు…


అయితే శ్రీ లీల ఉన్నఫలంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని వస్తే తాజాగా ఈమె రవితేజతో కలిసి ధమాకా సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా మొత్తం పూర్తిగా శ్రీ లీల కనపడుతోందని, ఈ సినిమా విజయం మొత్తం తనకే చెందుతుంది అంటూ కామెంట్స్ వినిపించిన తరుణంలో ఈమె ఇలాంటి వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.

Teja: పాప్ కార్న్‌ రేటు థియేటర్లలో సినిమాని చంపేస్తుంది… డైరెక్టర్ తేజ కామెంట్స్ వైరల్!

Teja: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా గుర్తింపు పొందిన వారిలో ప్రముఖ దర్శకుడు తేజ కూడా ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించి దర్శకుడుగా గుర్తింపు పొందిన తేజ ప్రస్తుతం దగ్గుబాటి అభిరామ్ హీరోగా రూపొందుతున్న సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. దగ్గుబాటి సురేష్ బాబు చిన్న కుమారుడు అభిరామ్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యత తేజ తీసుకున్నారు.

ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ పాప్ కార్న్ రేటు థియేటర్లలో సినిమాని చంపేస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం తేజ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
కరోనా సమయంలో ఓటిటిలలో సినిమాలు చూడటానికి అలవాటు పడిన ప్రేక్షకులు ఇప్పటికీ ఓటీటీ లో సినిమా చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఓటీటీల వల్ల థియేటర్లలో సినిమా చూసేవారి సంఖ్య తగ్గిపోతుంది అని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

తాజాగా దర్శకుడు తేజ ఈ వ్యాఖ్యలపై స్పందించాడు. ఈ క్రమంలో డైరెక్టర్ తేజ మాట్లాడుతూ.. “సినిమాలు రాకముందు ప్రజలు వీధి నాటకాలు చూసేవాళ్లు. ఆ తర్వాత సినిమా థియేటర్లు వచ్చాయి. అప్పుడు థియేటర్లలో సినిమాలు చూడటం ప్రారంభించారు. ఆ తర్వాత టీవి, యూట్యూబ్ వంటివి అందుబాటులోకి వచ్చాయి. అయినా ప్రేక్షకులు థియేటర్లో సినిమా చూడటం ఆపలేదు.ఎందుకంటే అక్కడ అయితేనే స్క్రీన్‌ చాలా పెద్దగా ఉంటుంది.

Teja: టికెట్ రేట్ కన్నా పాప్ కార్న్ రేటు అధికం…

ఇక ప్రస్తుతం మల్టీప్లెక్సుల్లో స్క్రీన్లు అన్నీ చిన్నగా చేస్తున్నారు. అంతే కాకుండా మల్టీప్లెక్సుల్లో పాప్ కార్న్ రేటు టికెట్ కన్నా ఎక్కువగా ఉంది. పాప్ కార్న్, కోక్‌ రేట్లు విపరీతంగా ఉంటున్నాయి. నిజానకి టీవి, యూట్యూబ్, ఓటీటీలు సినిమాని చంపలేవు. కానీ, పాప్ కార్న్‌ రేటు మాత్రం థియేటర్లలో సినిమాని చంపగలదు. ముంబయిలో సినిమా చచ్చిపోయింది అంటే దానికి ఇదే కారణం. మల్టీప్లెక్సులకు వెళ్లి సినిమా చూడటం కన్నా సింగిల్ స్క్రీన్ లో సినిమాలు చూడటం చాలా ఉత్తమం. సినిమాలను ఏదీ చంపలేదు. ఒక్క పాప్ కార్న్‌ రేటు మాత్రం చంపగలదు” అంటూ డైరెక్టర్‌ తేజ వ్యాఖ్యానించారు.

Mahesh Babu: సాధారణ వ్యక్తిలా సినిమా టికెట్ కోసం క్యూలో నిలబడిన మహేష్.. వీడియో వైరల్!

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆయన స్టార్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగడమే కాకుండా నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇలాంటి సూపర్ స్టార్ డమ్ ఉన్న మహేష్ బాబు తన స్టార్ డమ్ పక్కన పెట్టి ఒక సాధారణ వ్యక్తిలా సినిమా టికెట్ల కోసం క్యూలో నిలబడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Mahesh Babu: సాధారణ వ్యక్తిలా సినిమా టికెట్ కోసం క్యూలో నిలబడిన మహేష్.. వీడియో వైరల్!

మహేష్ బాబు ఏంటి క్యూలో నిలబడడం ఏంటి అనీ ఆశ్చర్యపోతున్నారా..ఆయనకు సొంతంగా మల్టీప్లెక్స్ ఉన్నప్పటికీ ఇలా నిలబడటానికి కూడా ఒక కారణం ఉంది. మహేష్ బాబు నిర్మాతగా మేజర్ సినిమా నిర్మించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మహేష్ బాబు రంగంలోకి దిగారు.

Mahesh Babu: సాధారణ వ్యక్తిలా సినిమా టికెట్ కోసం క్యూలో నిలబడిన మహేష్.. వీడియో వైరల్!

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా యూట్యూబర్,
డిజిటల్ క్రియేటర్ అయిన నిహారిక ఎన్ఎమ్‌ కలిసి ఒక వీడియోని చేశారు. ఈ వీడియోలో భాగంగా నిహారిక థియేటర్ వద్ద క్యూలో ఉన్న వారి దగ్గరకు వెళ్లి ఇది మేజర్ సినిమా లైనేనా అని ప్రశ్నిస్తుంది. అవునని చెప్పడంతో ఆమె టికెట్ల కోసం క్యూలో నిలబడి ఉంది. అనంతరం అడవి శేషు వచ్చి తన ముందు నిలబడగా నిహారిక తనతో గొడవ పడుతుంది. తాను లైన్లో నిలబడ్డానని తనని తోసుకుంటూ వెళ్లడం ఏంటి అని ప్రశ్నించగా అడవి శేష్ వెనక్కి వెళ్లి నిలబడతాడు.

ప్రమోషన్ కార్యక్రమాలలో మహేష్…

ఆ సమయంలోనే మరొక వ్యక్తి తన ముందు వచ్చి నిలబడ్డాడు. ఆమె తనని కూడా తిట్టడానికి ప్రయత్నించగా, అక్కడ మహేష్ బాబు ఉండటం చూసి ఆశ్చర్య పోయి సైలెంట్ అవుతుంది.అదే సమయంలోనే మహేష్ బాబు తన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు పిలవచ్చా అని అడగగా అందుకు నిహారిక పిలవండి అంటూ సమాధానం చెబుతుంది.ఈ క్రమంలోనే నిహారిక తన ఫోన్ నెంబర్ అడగాలని ప్రయత్నిస్తే మహేష్ బాబు అక్కడి నుంచి టిక్కెట్ కౌంటర్ వద్దకు వెళతారు. అది చూసిన అడవి శేష్ నా నెంబర్ కావాలా తీసుకో అంటూ తన ఫోన్ నెంబర్ ఇస్తాడు. మొత్తానికి ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా వీరు చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Thammareddy Bharadwaja: టిక్కెట్ల రేట్లు పెంచి జనాల డబ్బు మొత్తం దోచుకోవాలనుకుంటున్నారా… తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్!

Thammareddy Bharadwaja: గత కొన్ని నెలల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఈ టికెట్ల వ్యవహారం కొనసాగుతూనే ఉంది.ఇప్పటికీ ఏపీ ముఖ్యమంత్రితో పలుమార్లు సినీ ప్రముఖులు చర్చలు జరిపిన ఈ విషయం కొలిక్కి రాలేదు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత త్వరలోనే కొత్త జీవో విడుదల చేస్తారని అందరూ శుభవార్త వింటారని తెలిపారు.

Thammareddy Bharadwaja: టిక్కెట్ల రేట్లు పెంచి జనాల డబ్బు మొత్తం దోచుకోవాలనుకుంటున్నారా… తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్!

అయితే తాజాగా ఈ విషయంపై తమ్మారెడ్డి భరద్వాజ్ స్పందించారు. అసలు సినీ పెద్దలు ముఖ్యమంత్రి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు అంటే వారికి ఏదైనా వ్యక్తిగత సమస్య ఉండటం వల్ల వెళ్తున్నారో ఏమో కానీ సినిమా పరిశ్రమలో ఏ విధమైనటువంటి సమస్య లేదని ఆయన తెలియచేశారు. అవును సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సమస్య లేదని… సినిమా టికెట్ల రేట్లు తగ్గించడం వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం లేదని తెలిపారు.

Thammareddy Bharadwaja: టిక్కెట్ల రేట్లు పెంచి జనాల డబ్బు మొత్తం దోచుకోవాలనుకుంటున్నారా… తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్!

సినిమా టికెట్ల రేట్లు తగ్గించడం వల్ల భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతలు నష్టపోతారు కదా అనే ప్రశ్న ఆయనకు ఎదురవగా….భారీ బడ్జెట్ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయితే దేశ వ్యాప్తంగా కొన్ని వేల థియేటర్లలో ఈ సినిమా విడుదల అవుతుంది. అలాంటప్పుడు ఆ సినిమాకు పెట్టిన బడ్జెట్ మొత్తం వస్తుంది.

ఆ సినిమాలకు లేని సమస్య మీకెందుకు….

ఇలా ఎక్కువ థియేటర్లలో ఈ సినిమా విడుదల చేయడం వల్ల పెద్ద సినిమాలకు కూడా ఎలాంటి నష్టం రాదని తమ్మారెడ్డి వెల్లడించారు. ఇలా భారీ బడ్జెట్ చిత్రాలు అధిక థియేటర్లలో విడుదల చేస్తూ సినిమా టికెట్లు రేట్లు పెంచి జనాల డబ్బులు మొత్తం దోచుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? దోపిడీని మీరు సపోర్ట్ చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. భారీ బడ్జెట్ చిత్రాలు అంటే ఊర్లో ఉన్న థియేటర్లు మొత్తం వాళ్ళు తీసుకుంటారు అలాంటప్పుడు సినిమా టికెట్ల రేట్లను పెంచి జనాల నుంచి దోపిడీకి పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు విడుదలైన అఖండ, పుష్ప, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలకు లేని సమస్య మీకెందుకు అంటూ సినిమా టిక్కెట్ల రేట్లపై తమ్మారెడ్డి భరద్వాజ్ తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Movie Tickets : ఏపీలో రిక్వెస్ట్.. తెలంగాణలో డిమాండ్..! అందితే జట్టు.. అందకపోతే కాళ్లు.. ఇది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పరిస్థితి.

Movie Tickets : అందితే జట్టు.. అందకపోతే కాళ్లు ఇది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పరిస్థితి. ఏపీలో టికెట్ రేట్లు తక్కవ చేయడంతో పెంచాలని ప్రభుత్వాన్ని కోరతున్నాయి. మరో వైపు తెలంగాణలో టికెట్ రేట్లను విపరీతంగా పెంచడం పలు వివాదాలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల టికెట్ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వానికి, టాలీవుడ్ కు మధ్య కోల్డ్ వార్ జరగుతోంది.

థియేటర్ల ధరలను ప్రభుత్వం తగ్గించడంతో వివాదం చెలరేగింది. టికెట్ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయంటూ.. పలువురు సిని ప్రముఖులు కూడా ప్రభుత్వం నిర్ణయంపై బహిరంగంగానే తమ అసంత్రుప్తిని వెల్లడించారు. హీరో నాని ఇటీవల థియేటర్ల కలెక్షన్లపై కూడా ప్రభుత్వానికి వ్యతిరేఖంగా వ్యాఖ్యాలు చేశాడు.

థియేటర్ల కలెక్షన్లు కిరాణా కొట్టు కలెక్షన్ల కన్నా తక్కువగా ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు కూడా ఇదే స్థాయిలో స్పందించారు. ఏపీలో టికెట్ రేట్లను రూ. 200, రూ. 150, రూ. 100కు పెంచాలని టాలీవుడ్ ఏపీ ప్రభుత్వాన్ని కోరకుంటుంది. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం టికెట్ రేట్లను విపరీతంగా పెంచుతుంది.

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లను..

ఇక్కడ టికెట్ రేట్లను రూ.350, 290,175 పెంచాలని డిమాండ్ చేస్తోంది. దీనికి అనుగుణంగానే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లను విపరీతంగా పెంచింది. దీంతో చిన్న సినిమాకు పెద్ద చిక్కువచ్చిపడింది. ఇదిలా ఉంటే చిన్న సినిమాలను థియేటర్లలో చూసేందుకు ఎవరూ వచ్చే పరిస్థితి ఉండదని పలువురు చిన్న నిర్మాతలు అంటున్నారు. దీనిని బట్టి చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో టాలీవుడ్ వ్యవహరిస్తున్న తీరు అందితే జుట్టు… అందకపోతే కాళ్లు అన్న రీతిలో ఉంది. ఏపీలో టికెట్ రేట్లు ఒక వేళ పెంచినా.. టాలీవుడ్ అడుగుతున్న రేట్లు తెలంగాణ.. రేట్ల కన్నా తక్కువగానే రిజనబుల్ గానే ఉంటున్నాయి. తెలంగాణలో విపరీతంగా పెరిగిన రేట్లపై సాధారణ ప్రజానీకం భరించేలా లేవు. ఒక్కసారి థియేటర్లలో సినిమాకు వెళ్తే ఒక్కో ఫ్యామిలీకి రూ. 2000 వరకు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది.

RRR Ticket Rates: ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ రేట్స్ ఇవే..వెల్లడించిన ఫిల్మ్ ఛాంబర్..!

RRR Ticket Rates: మొన్నటి వరకు ఏపీలో సినిమా టికెట్ల లొల్లి నడిచింది. అయితే ఎవరు ఏం చెప్పినా ప్రభుత్వం మాత్రం.. వాళ్లు నిర్ణయించిన ధరకే సినిమా టికెట్లను అమ్మాలని మొండి పట్టు పట్టారు. థియేటర్లు కూడా అలానే నడిచాయి. దీంతో నానీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.

RRR Ticket Rates: ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ రేట్స్ ఇవే..వెల్లడించిన ఫిల్మ్ ఛాంబర్..!

ఇదే విషయంలో ఏపీ కంటే.. తెలంగాణ కాస్త బెటర్ అనే చెప్పాలి. టికెట్ రేట్ల విషయంలో సీఎం కేసీఆర్.. సినీ ప్రముఖలకే వదిలేయడం.. అంతే కాకుండా.. పుష్ప సినిమాకు ఐదు షోల వరకు అనుమతి ఇవ్వడం చెప్పుకోదగిన విషయమే. దీని కారణంగా నిర్మాతలు కాస్త లాభ పడ్డారని చెప్పుకోవచ్చు. అయితే ఇదే విషయంపై ఫిల్మ్ ఛాంబర్ లో సమావేశం జరిగింది.

RRR Ticket Rates: ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ రేట్స్ ఇవే..వెల్లడించిన ఫిల్మ్ ఛాంబర్..!

తెలంగాణ ప్రభుత్వం జీవో నెం 120 గురించి చర్చించారు. సినిమాల టికెట్ ధరలు ఎలా ఉండాలని విషయాలపై విపులంగా చర్చించుకున్నారు. జీవో నెంబర్ 120 ప్రకారం.. చిన్న సినిమా టికెట్‌ ధరలు.. కనిష్ఠ ధర కంటే ఎక్కువగా గరిష్ఠ ధర కంటే తక్కువగా అమ్మాలని ప్రభుత్వం తెలిపింది.

ఇక చిన్న సినిమా కాకుండా.. పెద్ద సినిమా కాకుండా.. మధ్య స్థాయి సినిమా విడుదలైన రెండు వారాల పాటు గరిష్ఠ ధరకు టికెట్‌లు అమ్మాలని.. ఆ తర్వాత దాన్ని కొంతవరకూ తగ్గించాలని సూచించింది. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బడ్జెట్ చిత్రాలైతే.. గరిష్ఠ ధరతో మూడువారాల పాటు టికెట్‌లు అమ్మి.. ఆ తర్వాత దాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ నిబంధనలు ప్రతీ ఒక్కరు పాటించాలి..

అయితే ప్రభుత్వం చెప్పిన ఈ నిబంధనలను బేఖాతరు చేసి.. కొంతమంది దుర్వినియోగం చేసుకుంటున్నవారు కూడా ఉన్నారు. అలాంటి వారు కూడా నిర్ణయించిన టికెట్ ధరలనే పాటించాలని ఫిల్మ్ ఛాంబర్ తెలిపింది. ఇక దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకు టికెట్ ధరలను కూడా నిర్ణయించింది ఫిల్మ్ ఛాంబర్. ఈ సినిమాకు సింగిల్ స్క్రీన్ పై రూ. 175, మల్టీప్లెక్స్‌లో అయితే రూ.295 టికెట్‌ ధర ఉంటుందని ఫిల్మ్ ఛాంబర్ తెలిపింది. ఇదే విషయంపై ఏషియన్ సునీల్ మాట్లాడుతూ.. కరోనా వల్ల గత రెండు సంవత్సరాలుగా ఎగ్జిబిటర్లే ఎక్కువగా నష్టపోయారని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందుకు రావడం ఆనందించదగ్గ విషయమన్నారు. ప్రతీ ఒక్కరూ ఈ నిబంధనలు పాటించాలని కోరాడు.

RGV: సినిమా టికెట్లపైనే కాదు.. అన్నింటిపై నియంత్రణ పెట్టండి..రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు.. !

RGV: ఏపీలో సినిమా టికెట్ల లొల్లి తారాస్థాయికి చేరుకుంది. టాలీవుడ్ లో ఉన్న ప్రతీ ఒక్కరూ దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. వీళ్ల ఆరోపణలకు ధీటుగా అధికార పార్టీ నాయకులు కూడా సమాధానం ఇస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై తాజాగా ఆర్జీవీ స్పందించాడు. తనదైన శైలిలో అతడు ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించాడు.

RGV: సినిమా టికెట్లపైనే కాదు.. అన్నింటిపై నియంత్రణ పెట్టండి..రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు.. !

మొదటి నుంచి కూడా ఆర్జీవీ వైసీపీ సానుభూతిపరుడిగా పేరు ఉంది. టీడీపీ, జనసేన నాయకులపై సెటైరికల్ సినిమాలు తీసే వర్మ.. టికెట్ రేట్ల ఇష్యూలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. అతడు ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడాడు. నిత్యావరసర సరుకులకు లేని ఫిక్స్ డ్ రేట్లు.. సినిమా టికెట్లకు ఎందుకుని ప్రశ్నించాడు.

RGV: సినిమా టికెట్లపైనే కాదు.. అన్నింటిపై నియంత్రణ పెట్టండి..రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు.. !

టికెట్ రేట్ల వ్యవహారాన్ని ప్రభుత్వం నియంత్రించూకుంటూ పోతే.. ఎవరికి వాళ్లు సొంతంగా సినిమాలు తీసుకుంటూ.. ఓటీటీలు.. యూట్యూబ్ లో రిలీజ్ చేసుకుంటాడరని.. చూడాలనుకున్నోడు చూస్తాడని.. ఇష్టం లేనోడు చూడడు అని అన్నాడు. ఈ ఇష్యూలో ప్రభుత్వం ఎందుకు ఇన్వాల్వ్ అవుతుందంటూ ప్రశ్నించాడు. ఇడ్లీ, బొండా అమ్ముకునే వారి దగ్గరకు వెళ్లి.. నువ్వు ఇదే రేటుకు అమ్మాలి అని హుకుం జారీ చేస్తే.. ఎలా.. రెండో రోజు అతడు ఆ వ్యాపారం చేయలేడు అంటూ చెప్పకొచ్చాడు. బట్టల కొట్టు పెట్టేవాడి దగ్గరకు వెళ్లి.. షర్ట్ అడిగినప్పుడు.. అతడు దానికి వాడిన ముడి సరకును బట్టి… షర్ట్‌ ఐదొందలు .. ఐదువేలు.. యాభై వేలు చెబితే.. కొనేవాడు కంఫర్ట్‌ని బట్టి దాన్ని కొనుక్కుంటాడు.

నా సినిమాలను ఏపీ ప్రభుత్వం అడ్డుకోదు..

కొనుగోలు అమ్మకాలు జరిగినందుకు గవర్నమెంట్‌కి టాక్స్ వస్తుంది కదా.. యాభై వేలు పెట్టి షర్ట్ కొంటుంటే.. మీరు ఐదురూపాయిలకే షర్ట్ అమ్మాలంటూ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వడం ఏంటో నాకు అర్ధం కావడం లేదు అంటూ లాజికల్ గా మాట్లాడాడు ఆర్జీవీ. ఒక్క సినిమాలపైనే రేట్లు ఎందుకు పెడుతున్నారు.. జనం కొనే అన్నింటిపైనా పెట్టాలి కదా.. ఉప్మా మీద.. ఇడ్లీ మీద.. చీరల మీద అన్నింటి మీద పెట్టాలి. ఒక్క సినిమాలపైనే ఈ ఫిక్స్డ్ రేట్లు ఎందుకు పెడుతున్నారు అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం ఆర్జీవీ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇక చివరగా తన సినిమాలకు ఏపీలో కూడా రిలీజ్ చేస్తానని.. నా సినిమాలను ప్రభుత్వం అడ్డుకోదు అంటూ చెప్పుకొచ్చాడు.

Movie Tickets: స్టార్ హీరోలకు సినిమా కష్టాలు కనపడటం లేదా.. టికెట్ల విషయంపై రియల్ హీరోలుగా స్పందించండి!

Movie Tickets: ఏపీలో టికెట్ల రేట్ల విషయంలో టాలీవుడ్, ఏపీ ప్రభుత్వానికి పరోక్ష యుద్దం నడుస్తోంది. ఏపీ ప్రభుత్వ టికెట్ రేట్ల తగ్గింపు అంశంపై వెనక్కి తగ్గకపోవడంతో టాలీవుడ్ ప్రముఖుల్లో అసహనం వ్యక్తం అవుతోంది. అయితే ఎవరూ బయటపడటం లేదు. పవన్ కళ్యాన్, నాని, సిద్ధార్ధ్, నితిన్ , కార్తికేయ వంటి కొంతమంది మాత్రం స్పందిస్తున్నారు. మిగతా హీరోలు ఈ అంశం మనది కాదన్న రీతిలో ఉన్నారు.

Movie Tickets: సినిమాలోనే కాదు.. రియల్ గా కూడా హీరోలవ్వండి..సినిమా కష్టాలు కనిపించడం లేదా..?

పవన్ కళ్యాన్ టికెట్ ధరల విషయంలో స్పందించినప్పుడు ఒక్క హీరో కూడా మద్దతు నిలవలేదు.. అప్పుడే సినీ పరిశ్రమ మద్దతు ఇస్తే ఇంత దూరం వచ్చేది కాదని చాలా మంది అనుకుంటున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ లో కొన్న పెద్ద ఫ్యామిలీలుగా చెబుతున్న వారు కూడా టికెట్ తగ్గింపు విషయంపై స్పందించడం లేదు. వారి రెమ్యునరేషన్ లో నిర్మాతలు కోత విధిస్తామంటే.. ఏమైనా ముందుకు వస్తారో చూడాలి. ముఖ్యంగా బాలక్రిష్ణ ఈ అంశంపై దూరంగా ఉంటున్నారు.

Movie Ticekts: సినిమాలోనే కాదు.. రియల్ గా కూడా హీరోలవ్వండి..సినిమా కష్టాలు కనిపించడం లేదా..?

ఏపీలో ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న బాలక్రిష్ణ మరింతగా ప్రభుత్వంపై ఫైట్ చేయాల్సి ఉన్నా అసలు ఏం స్పందించడం లేదని వాదన వస్తోంది. మరో వైపు పాన్ ఇండియా మూవీల కోసం ఎగబడుతున్న కుర్ర హీరోలు తమ సంపాదన.. తన ఇమేజ్ గురించి పట్టించుకుంటున్నారు తప్పితే.. పరిశ్రమ మంచి కోసం పాటు పడటం లేదు. మరోవైపు ’మా‘ అధ్యక్ష ఎన్నికల సమయంలో భారీ డైలాగులు చెప్పిన మంచు విష్ణు ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. మోహన్ బాబుకు సీఎం జగన్ తో  చుట్టరికం కూడా ఉంది. అయినా కూడా మోహన్ బాబు టికెట్ల ధరల విషయంపై కనీసం సీఎంతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు.  కేవలం పవన్ కళ్యాణ్, నాని వంటి హీరోల సొంత సమస్యగా భావిస్తున్నారు.

Movie Tickets : గతంతో విమర్శలు.. దాడులు..


గతంలో పవన్ కళ్యాన్ టికెట్ ధరల తగ్గింపు అంశంపై మాట్లాడితే.. ఏపీ మంత్రులు పవన్ కళ్యాన్ పై విమర్శల దాడి చేశారు. ఆసయంలో టాలీవుడ్ నుంచి ఏ ఒక్కరూ కూడా సపోర్ట్ గా నిలబడలేదు. తాజాగా శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా నాని ఏపీ సర్కార్ ను విమర్శించారు. సినిమా థియేటర్ల కలెక్షన్… కిరాణా దుకాణాల కలెక్షన్ల కన్నా తక్కువగా ఉంటుందని వ్యాఖ్యలు చేశారు. ఇలా వ్యాఖ్యలు చేశాడో.. తెల్లవారి నుంచి ఏపీలోని థియేటర్ల మీద పెద్ద ఎత్తున రైడ్లు ప్రారంభం అయ్యాయి. ఇది చూస్తే సినిమా ఇండస్ట్రీ పై సర్కార్ ప్రతీకారానికి పాల్పడుతుందా.. అనే అనుమానం కలుగుతోంది.

Megastar Chiranjeevi: సినిమా టికెట్ల వ్యవహారంపై చిరంజీవి ట్వీట్..!

Megastar Chiranjeevi: ఏపీలో టికెట్ ధరల రచ్చ సద్దుమనగడం లేదు. ఈ టికెట్ల ధరల తగ్గింపు వ్యవహారం వైసీపీ ప్రభుత్వానికి, టాలీవుడ్ కు మధ్య గ్యాప్ పెంచుతోంది. అయినా కూడా టికెట్ల ధరల తగ్గింపు విషయంలో వెనక్కి తగ్గదేలే అంటూ వ్యవహరిస్తుంది జగన్ సర్కార్. గతంలో పవన్ కళ్యాణ్ నేరుగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శించారు. తాజాగా నాని శ్యాం సింగరాయ్ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ప్రెస్ మీట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు.

Megastar Chiranjeevi: సినిమా టికెట్ల వ్యవహారంపై చిరంజీవి ట్వీట్..!

కిరాణా కొట్టు కలెక్షన్ల కన్నా తక్కువగా ఉన్నాయంటూనే.. టికెట్ ధరలు తగ్గించి ప్రేక్షకులను అవమాన పరిచారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైసీపీ మంత్రులు కూడా తీవ్రంగానే స్పందించారు. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం తాజాగా సినిమా టికెట్లు పెంచుకునేందకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై టాలీవుడ్ పెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Megastar Chiranjeevi: సినిమా టికెట్ల వ్యవహారంపై చిరంజీవి ట్వీట్..!

తాజాగా తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ‘తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు,థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్‌కి  కృతఙ్ఞతలు.

ఏపీలో థియేటర్ల కలెక్షన్లు..

సినిమా థియేటర్ల  మనుగడకు,వేలాదిమంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది’ అని చిరంజీవి ట్విట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు టికెట్ ధరలపై పూర్తి వ్యతిరేఖంగా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణ సర్కార్ టాలీవుడ్ కు పూర్తి ప్రెండ్లీగా వ్యవహరిస్తుంటే… జగన్ సర్కార్ తో టాలీవుడ్ కు గ్యాప్ క్రియేట్ అవుతోంది.

Movie Tickets: ఆ రోజు పవర్ స్టార్ కు సపోర్డు చేసి ఉంటే..ఈ రోజు అలా అయ్యేది కాదు కదా..!

Movie Tickets: టికెట్ల రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం.. టాలీవుడ్ మధ్య గ్యాప్ పెరుగుతోంది. విమర్శలు, కౌంటర్లతో ఇటు సినిమా యాక్టర్లు, అటు ఏపీ మంత్రుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఏపీ థియేటర్లో సినిమా టికెట్ ధరలు భారీగా తగ్గించడంతో వివాదం ఏర్పడింది.

Movie Tickets: ఆ రోజు పవర్ స్టార్ కు సపోర్డు చేసి ఉంటే..ఈ రోజు అలా అయ్యేది కాదు కదా..!

అయితే గతంలో పవన్ కళ్యాన్ చేసిన వ్యాఖ్యలు మద్దుతు ఇచ్చి ఉంటే మరింతగా నిలిస్తే బాగుండేది కదా.. అనే వాదనలు వినిపిస్తున్నాయి. సాయిధరమ్ తేజ్ ’రిపబ్లిక్‘ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు ప్రత్యేక అతిథిగా పవన్ కళ్యాణ్ వచ్చారు. అయితే ఆ కార్యక్రమంలో జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శించారు. తనను దెబ్బ కొట్టేందుకు సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తున్నారని… జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు.

Movie Tickets: ఆ రోజు పవర్ స్టార్ కు సపోర్డు చేసి ఉంటే..ఈ రోజు అలా అయ్యేది కాదు కదా..!

నా మీద కోపంతో సిని ఇండస్ట్రీని దెబ్బతీయద్దని కోరారు. అయితే ఈ వ్యాఖ్యలకు ధీటుగానే ఏపీ మంత్రి నాని కూడా పవన్ కళ్యాన్ పై విరుచుకు పడ్డారు. ఆ సమయంలో సినీ ఇండస్ట్రీ నుంచి పవన్ కు అనుకున్నంతగా మద్దతు లభించలేదు. కేవలం నితిన్, కార్తికేయ వంటి హీరోలు ఏదో స్పందించారు. ఇండస్ట్రీ పెద్దల్లో ఒకరుగా ఉన్న దిల్ రాజు ప్రభుత్వంతో చర్చించి ఆ వివాదం అక్కడికే సద్దుమనిగేలా చేశారు.


ఏపీ ప్రభుత్వ దయాదాక్షణ్యాలపై ..

తాజాగా నాని వైసీపీ సర్కార్ పై విమర్శలు ఎక్కు పెట్టారు. ఏపీలో సినిమా థియేటర్ల కలెక్షన్లు.. కిరాణా కొట్టు కలెక్షన్ల కన్నా తక్కువగానే ఉన్నాయంటూ విమర్శించారు. తాజాగా ఈవ్యాఖ్యలు ఏపీలో మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి. గతంలో పవన్ కళ్యాన్ కు మద్దతు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటూ కొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ, ఓవర్సీస్ లో కలెక్షన్లు బాగున్నా.. ఏపీలో టికెట్ రేట్లు తగ్గించడంతో కలెక్షన్లు లేకపోవడంతో ఇప్పుడు అందరూ బాధపడుతున్నారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వ దయాదాక్షణ్యాలపై సినిమా ఇండస్ట్రీ భవిష్యత్తు ఆధారపడేలా అయింది.