Featured

Movie Tickets: స్టార్ హీరోలకు సినిమా కష్టాలు కనపడటం లేదా.. టికెట్ల విషయంపై రియల్ హీరోలుగా స్పందించండి!

Movie Tickets: ఏపీలో టికెట్ల రేట్ల విషయంలో టాలీవుడ్, ఏపీ ప్రభుత్వానికి పరోక్ష యుద్దం నడుస్తోంది. ఏపీ ప్రభుత్వ టికెట్ రేట్ల తగ్గింపు అంశంపై వెనక్కి తగ్గకపోవడంతో టాలీవుడ్ ప్రముఖుల్లో అసహనం వ్యక్తం అవుతోంది. అయితే ఎవరూ బయటపడటం లేదు. పవన్ కళ్యాన్, నాని, సిద్ధార్ధ్, నితిన్ , కార్తికేయ వంటి కొంతమంది మాత్రం స్పందిస్తున్నారు. మిగతా హీరోలు ఈ అంశం మనది కాదన్న రీతిలో ఉన్నారు.

Movie Tickets: సినిమాలోనే కాదు.. రియల్ గా కూడా హీరోలవ్వండి..సినిమా కష్టాలు కనిపించడం లేదా..?

పవన్ కళ్యాన్ టికెట్ ధరల విషయంలో స్పందించినప్పుడు ఒక్క హీరో కూడా మద్దతు నిలవలేదు.. అప్పుడే సినీ పరిశ్రమ మద్దతు ఇస్తే ఇంత దూరం వచ్చేది కాదని చాలా మంది అనుకుంటున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ లో కొన్న పెద్ద ఫ్యామిలీలుగా చెబుతున్న వారు కూడా టికెట్ తగ్గింపు విషయంపై స్పందించడం లేదు. వారి రెమ్యునరేషన్ లో నిర్మాతలు కోత విధిస్తామంటే.. ఏమైనా ముందుకు వస్తారో చూడాలి. ముఖ్యంగా బాలక్రిష్ణ ఈ అంశంపై దూరంగా ఉంటున్నారు.

Movie Ticekts: సినిమాలోనే కాదు.. రియల్ గా కూడా హీరోలవ్వండి..సినిమా కష్టాలు కనిపించడం లేదా..?

ఏపీలో ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న బాలక్రిష్ణ మరింతగా ప్రభుత్వంపై ఫైట్ చేయాల్సి ఉన్నా అసలు ఏం స్పందించడం లేదని వాదన వస్తోంది. మరో వైపు పాన్ ఇండియా మూవీల కోసం ఎగబడుతున్న కుర్ర హీరోలు తమ సంపాదన.. తన ఇమేజ్ గురించి పట్టించుకుంటున్నారు తప్పితే.. పరిశ్రమ మంచి కోసం పాటు పడటం లేదు. మరోవైపు ’మా‘ అధ్యక్ష ఎన్నికల సమయంలో భారీ డైలాగులు చెప్పిన మంచు విష్ణు ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. మోహన్ బాబుకు సీఎం జగన్ తో  చుట్టరికం కూడా ఉంది. అయినా కూడా మోహన్ బాబు టికెట్ల ధరల విషయంపై కనీసం సీఎంతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు.  కేవలం పవన్ కళ్యాణ్, నాని వంటి హీరోల సొంత సమస్యగా భావిస్తున్నారు.

Movie Tickets : గతంతో విమర్శలు.. దాడులు..


గతంలో పవన్ కళ్యాన్ టికెట్ ధరల తగ్గింపు అంశంపై మాట్లాడితే.. ఏపీ మంత్రులు పవన్ కళ్యాన్ పై విమర్శల దాడి చేశారు. ఆసయంలో టాలీవుడ్ నుంచి ఏ ఒక్కరూ కూడా సపోర్ట్ గా నిలబడలేదు. తాజాగా శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా నాని ఏపీ సర్కార్ ను విమర్శించారు. సినిమా థియేటర్ల కలెక్షన్… కిరాణా దుకాణాల కలెక్షన్ల కన్నా తక్కువగా ఉంటుందని వ్యాఖ్యలు చేశారు. ఇలా వ్యాఖ్యలు చేశాడో.. తెల్లవారి నుంచి ఏపీలోని థియేటర్ల మీద పెద్ద ఎత్తున రైడ్లు ప్రారంభం అయ్యాయి. ఇది చూస్తే సినిమా ఇండస్ట్రీ పై సర్కార్ ప్రతీకారానికి పాల్పడుతుందా.. అనే అనుమానం కలుగుతోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago