Sonia Agarwal: ‘డిటెక్టివ్ సత్యభామ’గా సోనియా అగర్వాల్..! సస్పెన్స్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు..!
Sonia Agarwal: ‘7బై జీ బృందావన్ కాలనీ’లో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన హీరోయిన సోనియా అగర్వాల్ పేరు అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. మొదట ‘నీ ప్రేమకై’ మూవీతో హీరోయిన్ గా పరిచయం అయి.. 7/జితో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. కానీ తర్వత ఆమెకు అంత పెద్దగా పేరు తెచ్చిన సినిమాలు లేవు. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ సినిమా ఈ నెల డిసెంబర్ 31 న థియేటర్లలో సందడి చేయనుంది.
అదేంటంటే.. సిన్మా ఎంటర్టైన్మెంట్ పతాకంపై శ్రీశైలం పోలెమోని నిర్మాతగా నవనీత్ చారి దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న చిత్రం‘డిటెక్టివ్ సత్యభామ’. ఈ సందర్భంగా సోనీ అగర్వాల్ మాట్లాడుతూ ‘7బై జీ బృందావన్ కాలనీ’ తర్వాత తనకు ఎక్కువగా పేరు తెచ్చిన సినిమాలు లేవు కానీ.. సెకండ్ ఇన్నింగ్స్ లో అంత క్రేజ్ తెచ్చే మూవీ ఈ ‘డిటెక్టివ్ సత్యభామ’ అవుతుందని ఆమె చెప్పుకొచ్చింది. ఎందుకంటే మూవీ పోస్ట్ ప్రొడక్షన్ అంతా ముంబైలో పూర్తి చేసి ఫస్ట్ కాపీ తనకు ముంబాయిలో చూపించారని.. తనకు బాగా నచ్చిందన్నారు.
ఇక ఈ నెల 28 నుంచి హైదరాబాద్ లో ఉండి చిత్ర యూనిట్ తో ప్రమోషన్స్ లో పాల్గొంటానని చెప్పారు. దీనిలో ప్రతీ జోనర్ వాళ్లకు నచ్చేవిధంగా తీశామని.. అన్ని హంగులతో.. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని నిర్మాత శ్రీశైలం తెలిపాడు. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిందని.. యాక్షన్ సీన్లతో కూడా నాలుగు పాటు ఉన్నాయని.. అందరికీ ఈ చిత్రం నచ్చుతుందని దర్శకుడు నవనీత్ చారి అన్నారు. ఈ చిత్రంతోనే తాను దర్శకుడికి పరిచయం అవుతున్నాని కూడా తెలిపాడు. మంచి టెక్నీషియన్స్ టీంతో పనిచేశాం.
సోనియా అగర్వాల్ మా స్క్రిప్ట్ విన్న వెంటనే ఓకే చేయటం చాలా సంతోషం. ఒక స్టార్ హీరోయిన్ ఈ కథను సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేయటాన్ని బట్టి ఈ కథలో ఉన్న విషయం అర్ధం చేసుకోవచ్చని అన్నారు. నిర్మాత ఎప్పుడూ టెన్షన్ పడలేదు. కొత్తవారైనా అనుభవం ఉన్న నిర్మాతలా ప్లాన్ చేసి షూటింగ్ సమయానికి అన్నీ అరేంజ్ చేశారన్నారు. ఇలాంటి ప్యాషన్ ఉన్న నిర్మాతలు పరిశ్రమకు చాలా అవసరమన్నారు. ఈ చిత్రంలో సాయి పంపన, రవివర్మ, సునీత పాండే, రోబో గణేష్, సోనాక్షివర్మ, సంజన, పూజ, బాలు, రెహాన్, భరత్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…