Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా.. డబ్బులను టైంకి చెల్లించడం లేదా.. అయితే ఇది మీకోసమే..!
Credit Card: క్రెడిట్ కార్డులు అవసరానికి డబ్బులు లేకపోతే.. ఆ అవసరాన్ని తీర్చడానికి ఎక్కువగా ఉపయోగపడతాయి. అంతే కాకుండా.. ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ.. మరేదైనా పెద్ద వస్తువుల తీసుకున్నప్పుడు ఈఎంఐ రూపంలో వాటికి డబ్బులు చెల్లించడానికి కూడా ఉపయోగపడుతాయి. అయితే క్రెడిట్ కార్డు అనేది బ్యాంకులు అందరికీ ఇవ్వవు.
సెలెక్టెడ్ పర్సన్స్ కు మాత్రమే ఇస్తుంది. అతడి ఉద్యోగం ..హోదా చూసి ఇచ్చేస్తాయి బ్యాంకులు. అయితే డెబిట్ కార్డులు మాత్రం అకౌంట్ ఉన్న ప్రతీ ఒక్కరికీ ఇస్తుంటాయి. ఇక క్రెడిట్ కార్డులో డబ్బులను వాడుకున్న తర్వాత దాదాపు 45 రోజుల వరకు ఎలాంటి రుసుము వసూలు చేయకుండా.. ఆ డబ్బులను చెల్లించేందుకు అవకాశం ఉంటుంది.
క్రెడిట్ కార్డు బిల్లు జనరేట్ అయిన తర్వాత దానిలో సూచించిన డేట్ లోగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొంతమందికి ఆ డబ్బులు చెల్లించకపోవడంతో.. వచ్చే నెలలో మొత్తం ఒక్కసారే కట్టేయొచ్చు అనుకుంటారు. కానీ అలా చేస్తే తీవ్రంగా నష్టపోతారు. ఎందుకంటే.. క్రెడిట్ కార్డు వాడే వారికి క్రెడిట్ స్టోర్ అనేది చాలా ఉపయోగం పడుతుంది. క్రెడిట్ స్కోర్ అనేది రుణగ్రహిత క్రెడిట్ విలువను సూచిస్తుంది. మనం చెల్లించే వాయిదా డబ్బులను సరిగ్గా చెల్లిస్తుంటే ఆ స్కోర్ అనేది పెరుగుతుంది. ఎక్కువ స్కోర్ ఉంటే.. భవిష్యత్తులో తక్కువ రేట్లతో రుణం పొందే అవకాశం ఉంటుంది.
క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే మాత్రం..బ్యాంకులు రుణాలు ఇస్తాయి కానీ.. తక్కువ మొత్తంలో ఇస్తూ.. ఎక్కువ మొత్తంలో వడ్డీని వసూలు చేస్తారు. కొన్ని బ్యాంకులు అయితే రుణాలు ఇచ్చేందుకు అంగీకరించకపోవచ్చు. ఇలా క్రెడిట్ స్కోర్‌ను బట్టి ఆయా బ్యాంకులు రుణాలు ఇస్తుంటాయి. అందుకే క్రెడిట్ కార్డు వాడే వారు తమ కోసం వాడుకుంటూ.. ఇతరులకు హామీగా నిలబడకుండా.. టైంకి చెల్లిస్తే.. ఎటువంటి నష్టం ఉండదు. టైం దాటిపోయిందంటే.. వడ్డీలతో పాటు.. ఆ ఎఫెక్ట్ క్రెడిట్ స్కోర్ పై కూడా పడుతుంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…