RRR Ticket Rates: ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ రేట్స్ ఇవే..వెల్లడించిన ఫిల్మ్ ఛాంబర్..!
RRR Ticket Rates: మొన్నటి వరకు ఏపీలో సినిమా టికెట్ల లొల్లి నడిచింది. అయితే ఎవరు ఏం చెప్పినా ప్రభుత్వం మాత్రం.. వాళ్లు నిర్ణయించిన ధరకే సినిమా టికెట్లను అమ్మాలని మొండి పట్టు పట్టారు. థియేటర్లు కూడా అలానే నడిచాయి. దీంతో నానీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.
ఇదే విషయంలో ఏపీ కంటే.. తెలంగాణ కాస్త బెటర్ అనే చెప్పాలి. టికెట్ రేట్ల విషయంలో సీఎం కేసీఆర్.. సినీ ప్రముఖలకే వదిలేయడం.. అంతే కాకుండా.. పుష్ప సినిమాకు ఐదు షోల వరకు అనుమతి ఇవ్వడం చెప్పుకోదగిన విషయమే. దీని కారణంగా నిర్మాతలు కాస్త లాభ పడ్డారని చెప్పుకోవచ్చు. అయితే ఇదే విషయంపై ఫిల్మ్ ఛాంబర్ లో సమావేశం జరిగింది.
తెలంగాణ ప్రభుత్వం జీవో నెం 120 గురించి చర్చించారు. సినిమాల టికెట్ ధరలు ఎలా ఉండాలని విషయాలపై విపులంగా చర్చించుకున్నారు. జీవో నెంబర్ 120 ప్రకారం.. చిన్న సినిమా టికెట్ ధరలు.. కనిష్ఠ ధర కంటే ఎక్కువగా గరిష్ఠ ధర కంటే తక్కువగా అమ్మాలని ప్రభుత్వం తెలిపింది.
ఇక చిన్న సినిమా కాకుండా.. పెద్ద సినిమా కాకుండా.. మధ్య స్థాయి సినిమా విడుదలైన రెండు వారాల పాటు గరిష్ఠ ధరకు టికెట్‌లు అమ్మాలని.. ఆ తర్వాత దాన్ని కొంతవరకూ తగ్గించాలని సూచించింది. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బడ్జెట్ చిత్రాలైతే.. గరిష్ఠ ధరతో మూడువారాల పాటు టికెట్‌లు అమ్మి.. ఆ తర్వాత దాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే ప్రభుత్వం చెప్పిన ఈ నిబంధనలను బేఖాతరు చేసి.. కొంతమంది దుర్వినియోగం చేసుకుంటున్నవారు కూడా ఉన్నారు. అలాంటి వారు కూడా నిర్ణయించిన టికెట్ ధరలనే పాటించాలని ఫిల్మ్ ఛాంబర్ తెలిపింది. ఇక దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకు టికెట్ ధరలను కూడా నిర్ణయించింది ఫిల్మ్ ఛాంబర్. ఈ సినిమాకు సింగిల్ స్క్రీన్ పై రూ. 175, మల్టీప్లెక్స్‌లో అయితే రూ.295 టికెట్ ధర ఉంటుందని ఫిల్మ్ ఛాంబర్ తెలిపింది. ఇదే విషయంపై ఏషియన్ సునీల్ మాట్లాడుతూ.. కరోనా వల్ల గత రెండు సంవత్సరాలుగా ఎగ్జిబిటర్లే ఎక్కువగా నష్టపోయారని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందుకు రావడం ఆనందించదగ్గ విషయమన్నారు. ప్రతీ ఒక్కరూ ఈ నిబంధనలు పాటించాలని కోరాడు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…