Connect with us

Featured

RRR Ticket Rates: ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ రేట్స్ ఇవే..వెల్లడించిన ఫిల్మ్ ఛాంబర్..!

RRR Ticket Rates: మొన్నటి వరకు ఏపీలో సినిమా టికెట్ల లొల్లి నడిచింది. అయితే ఎవరు ఏం చెప్పినా ప్రభుత్వం మాత్రం.. వాళ్లు నిర్ణయించిన ధరకే సినిమా

Published

on

RRR Ticket Rates: మొన్నటి వరకు ఏపీలో సినిమా టికెట్ల లొల్లి నడిచింది. అయితే ఎవరు ఏం చెప్పినా ప్రభుత్వం మాత్రం.. వాళ్లు నిర్ణయించిన ధరకే సినిమా టికెట్లను అమ్మాలని మొండి పట్టు పట్టారు. థియేటర్లు కూడా అలానే నడిచాయి. దీంతో నానీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.

RRR Ticket Rates: ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ రేట్స్ ఇవే..వెల్లడించిన ఫిల్మ్ ఛాంబర్..!
RRR Ticket Rates: ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ రేట్స్ ఇవే..వెల్లడించిన ఫిల్మ్ ఛాంబర్..!

ఇదే విషయంలో ఏపీ కంటే.. తెలంగాణ కాస్త బెటర్ అనే చెప్పాలి. టికెట్ రేట్ల విషయంలో సీఎం కేసీఆర్.. సినీ ప్రముఖలకే వదిలేయడం.. అంతే కాకుండా.. పుష్ప సినిమాకు ఐదు షోల వరకు అనుమతి ఇవ్వడం చెప్పుకోదగిన విషయమే. దీని కారణంగా నిర్మాతలు కాస్త లాభ పడ్డారని చెప్పుకోవచ్చు. అయితే ఇదే విషయంపై ఫిల్మ్ ఛాంబర్ లో సమావేశం జరిగింది.

RRR Ticket Rates: ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ రేట్స్ ఇవే..వెల్లడించిన ఫిల్మ్ ఛాంబర్..!
RRR Ticket Rates: ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ రేట్స్ ఇవే..వెల్లడించిన ఫిల్మ్ ఛాంబర్..!

తెలంగాణ ప్రభుత్వం జీవో నెం 120 గురించి చర్చించారు. సినిమాల టికెట్ ధరలు ఎలా ఉండాలని విషయాలపై విపులంగా చర్చించుకున్నారు. జీవో నెంబర్ 120 ప్రకారం.. చిన్న సినిమా టికెట్‌ ధరలు.. కనిష్ఠ ధర కంటే ఎక్కువగా గరిష్ఠ ధర కంటే తక్కువగా అమ్మాలని ప్రభుత్వం తెలిపింది.

ఇక చిన్న సినిమా కాకుండా.. పెద్ద సినిమా కాకుండా.. మధ్య స్థాయి సినిమా విడుదలైన రెండు వారాల పాటు గరిష్ఠ ధరకు టికెట్‌లు అమ్మాలని.. ఆ తర్వాత దాన్ని కొంతవరకూ తగ్గించాలని సూచించింది. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బడ్జెట్ చిత్రాలైతే.. గరిష్ఠ ధరతో మూడువారాల పాటు టికెట్‌లు అమ్మి.. ఆ తర్వాత దాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement

ఈ నిబంధనలు ప్రతీ ఒక్కరు పాటించాలి..

అయితే ప్రభుత్వం చెప్పిన ఈ నిబంధనలను బేఖాతరు చేసి.. కొంతమంది దుర్వినియోగం చేసుకుంటున్నవారు కూడా ఉన్నారు. అలాంటి వారు కూడా నిర్ణయించిన టికెట్ ధరలనే పాటించాలని ఫిల్మ్ ఛాంబర్ తెలిపింది. ఇక దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకు టికెట్ ధరలను కూడా నిర్ణయించింది ఫిల్మ్ ఛాంబర్. ఈ సినిమాకు సింగిల్ స్క్రీన్ పై రూ. 175, మల్టీప్లెక్స్‌లో అయితే రూ.295 టికెట్‌ ధర ఉంటుందని ఫిల్మ్ ఛాంబర్ తెలిపింది. ఇదే విషయంపై ఏషియన్ సునీల్ మాట్లాడుతూ.. కరోనా వల్ల గత రెండు సంవత్సరాలుగా ఎగ్జిబిటర్లే ఎక్కువగా నష్టపోయారని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందుకు రావడం ఆనందించదగ్గ విషయమన్నారు. ప్రతీ ఒక్కరూ ఈ నిబంధనలు పాటించాలని కోరాడు.

Advertisement

Featured

Rana: నన్ను ఏదైనా అడగాలంటే అవయవాలు దానం చేయాలి… రానా కామెంట్స్ వైరల్!

Published

on

Rana: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు రానా ఒకరు. ఈయన లీడర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు. ఇలా దగ్గుబాటి కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చినటువంటి రానా ఎన్నో విభిన్న కథ చిత్రాలను ఎంపిక చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ఇక తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే హీరోగా మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో నటించడానికి కూడా రానా ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే పలు సినిమాలలో విలన్ పాత్రలలో నటించారు. ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందినటువంటి ఈయన ప్రస్తుతం వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల తన బాబాయ్ వెంకటేష్ తో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఇదిలా ఉండగా తాజాగా రానా గుర్గావ్ లో జరిగిన సినాప్స్ వేడుకలలో రానా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ ఆరోగ్యం గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రానా ఇటీవల కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈయన తన అనారోగ్య సమస్యల గురించి మాట్లాడుతూ..

Advertisement

ప్రకృతికి మించిన వైద్యం లేదు…
ఎవరైనా నా ఆరోగ్యం గురించి ఏదైనా అడగాలి అంటే ముందుగా మీరు అవయవాలు దానం చేస్తానని చెప్పండి. అలాంటి ఆలోచన మీకు ఉంటేనే నన్ను నా ఆరోగ్యం గురించి అడగండి లేదంటే ఆలోచనను విరమించుకోండి అంటూ ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మనిషి చివరిదశలో ఉన్నప్పుడే జీవితాన్ని విభిన్నంగా చూస్తాడు.ఆ క్షణం ఆలోచన విధానం మారిపోతుంది. ఇందుకు నేను మినహాయింపు కాదని తెలిపారు. అనారోగ్య సమస్యల కారణంగా బాహుబలి సినిమా సమయంలో పెరిగిన బరువు పూర్తిగా తగ్గిపోయానని అనంతరం అరణ్య సినిమా కోసం ఏడాది పాటు అడవులలో తిరుగుతూ ఉన్నానని ప్రకృతికి మించిన వైద్యం మరేది లేదంటూ ఈ సందర్భంగా రానా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

NTR: ఎన్టీఆర్ సినిమా చేయాలంటే ఈ రెండు ఉండాల్సిందేనా?

Published

on

NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇకపోతే ఈ సినిమా అక్టోబర్లో దసరా పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇదిలా ఉండగా తాజాగా ఎన్టీఆర్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎన్టీఆర్ ఒక సినిమా చేయాలి అంటే కచ్చితంగా ఆయన ఒప్పుకొనే సినిమాలలో రెండు అంశాలు మాత్రం తప్పనిసరిగా ఉండాలని ముందుగానే దర్శక నిర్మాతలకు సూచిస్తారట మరి ఎన్టీఆర్ సినిమాలలో తప్పనిసరిగా ఉండాల్సిన ఆ అంశాలు ఏంటి అనే విషయానికి వస్తే..

Advertisement

డాన్స్… యాక్షన్ సీక్వెన్స్..
ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా డాన్స్ చేస్తారనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తన సినిమాలు డాన్స్ చేసే విధంగా పాటలకు స్కోప్ ఉండాలని ఈయన కండిషన్ పెడతారట అదే విధంగా ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉండాలని ఈయన దర్శక నిర్మాతలకు చెబుతారట. ఈ రెండు తన సినిమాలలో తప్పనిసరిగా ఉండేలా ఎన్టీఆర్ జాగ్రత్తలు తీసుకుంటారని తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ డాన్స్ అంటే ఇష్టపడేవారు ఎంతోమంది ఉన్నారనే సంగతి మనకు తెలిసిందే.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ బాబుకు కలిసి రాని తల్లి సెంటిమెంట్… మూడుసార్లు చేదు అనుభవమే?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రేక్షకులకు నిరాశను మిగిల్చింది.

ఇలా ఈ సినిమా ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ కాకపోవడం ఒక కారణం కాగా ఈ సినిమాపై నెగటివ్ టాక్ తో భారీగా వైరల్ చేయడం కూడా సినిమాకు పెద్ద మైనస్ గా మారిందని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా మదర్ సెంటిమెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆ సెంటిమెంట్ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయిందని చెప్పాలి.

చిన్నప్పుడే కొడుకును వదిలేసి వెళ్లిపోయినటువంటి తల్లికి తన కొడుకు పై ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తూ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. డైరెక్టర్ త్రివిక్రమ్ అయితే ఈ సినిమా మాత్రం ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదు. అదేవిధంగా ఈ సినిమా విషయంలో మరోసారి సెంటిమెంట్ వర్కౌట్ కావడంతో ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచిందనే చెప్పాలి.

Advertisement

తల్లిని నమ్ముకుంటే కష్టమే…
మహేష్ బాబుకి తల్లి సెంటిమెంట్ సినిమాలు పెద్దగా కలిసిరావనే విషయాలు గతంలో కూడా నిజమయ్యాయి. అయితే మరోసారి కూడా ఈయనకు తల్లి సెంటిమెంట్ అచ్చి రాలేదని తల్లిని నమ్ముకుంటే మహేష్ బాబుకి చేదు అనుభవమేనని గుంటూరు కారం నిరూపించింది. గతంలో కూడా మహేష్ బాబు తల్లి సెంటిమెంటుతో వచ్చినటువంటి సినిమాలలో నాని అలాగే నిజం సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!