Vijay Devarakonda-Rashmika: ప్రస్తుతం హీరోయిన్లలో ఎక్కువగా పాపులారిటీ తెచ్చుకున్న ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. ఆమె పేరు ప్రస్తుతం క్రష్మికగా మారిపోయింది. నేషనల్ క్రష్ అని ఆమెను కొంతమంది పిలుస్తారు. అలా ఆమె పేరును క్రష్మికగా సంభోదిస్తున్నారు. అయితే గత కొంత కాలం నుంచి రష్మికకు , విజయ్ దేవరకొండకు మధ్య ఏదో నడుస్తుందని పుకార్లు వినిపిస్తున్నాయి.
గీతాగోవిందం సినిమాలో వీళ్లిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఈ సినిమాతో రష్మిక టాలీవుడ్ లో బాగా క్రేజ్ తెచ్చుకున్నారు. కాగా, విజయ్ కి క్లాస్ హీరోగా పేరు వచ్చింది. ఆ సమయం నుంచే పాపులర్ జంటగా మారిపోయారు. ఇక ఈ సినిమా తరువాత ఈ జంట డియర్ కామ్రేడ్ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించారు.
దీని తర్వాత వీళ్లిద్దరు కలిసి హోటల్స్ కు వెళ్లడం.. డిన్నర్లు, డేట్స్ అంటూ.. ఇలా కెమెరాలకు చిక్కడంతో వీరిద్దరు రిలేషన్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
ఇక కొత్త ఏడాది వీళ్లిద్దరు కలిసి ఓ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని.. దీనికి సంబంధించి బాలీవుడ్ కు చెందిన ఓ టాబ్లైడ్ ప్రకారం తెలుస్తోంది. ఆ కీలక ప్రకటన వారి రిలేషన్ గురించే అయ్యి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.
దీంతో వాళ్లు ఏం చెప్పబోతున్నారు..? వారి ప్రేమను ప్రకటించనున్నారా.. లేదా.. పెళ్లి గురించి ఏమైనా గుడ్ న్యూస్ చెబుతారా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అయితే ఈ రోజు జనవరి 1 కనుకు.. ఏ సమయంలో అయినా ఈ జంట.. తమ మనస్సులో ఉన్నది చెప్పే అవకాశం ఉంటుంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. రష్మికకు అంతకముందే.. హీరో రక్షిత్ శెట్టి తో ఎంగేజ్ మెంట్ జరిగి క్యాన్సిల్ అయింది. దీని తర్వాతనే విజయ్ తో కలిసి డేటింగ్ కు వెళ్తుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇది ఎంత వరకు నిజమో.. కొన్ని గంటలు ఆగితే తెలుస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…