Shanmukh Jashwanth: బిగ్ బాస్ రియాల్టీ షో నడుస్తున్నంత వరకు .. అందులో పాల్గొన్న కంటెస్టెంట్లకు ఎక్కడ లేని క్రేజ్ తెచ్చిపెడుతుంది. బయటకు వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్ల వరకు అలానే ఆ ట్రెండ్ నడుస్తుంది. తర్వాత మళ్లీ మామూలే. అయితే ఇప్పటి వరకు 5 సీజన్లు పూర్తాయ్యాయి.
విన్నర్ గా నిలిచిన వారిలో ఒక్కరూ కూడా ఎక్కువగా కెరీర్ లో నిలదొక్కుకున్నట్లు కనిపించలేదు. కేవలం రాహుల్ సిప్లిగంజ్ కు మాత్రమే సినిమాలో పాటలు పాడేందుకు అవకాశాలు వస్తున్నాయి. మిగతా వారి విషయంలో అంతగా చెప్పుకోదగినది ఏం లేదు. అయితే కంటెస్టెంట్లుగా పాల్గొని బయటకు వచ్చిన వారి విషయంలో కూడా అలానే జరుగుతోంది.
కొంత మందికి అయితే.. ఉన్న ఆఫర్లు పోయాయి. బిగ్ బాస్ కొందరికి మంచి చేస్తే.. మరికొందరికి కెరీర్ లో పెద్ద దెబ్బ పడిందనే చెప్పాలి. సీజన్ 4లో పాల్గొని బయటకు వచ్చిన అమ్మా రాజశేఖర్ కూడా అదే విషయాన్ని చెప్పాడు. మానం, మర్యాద మొత్తం పోయిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక ప్రస్తుతం సీజన్ 5 నుంచి రన్నర్ గా బయటకు వచ్చిన షణ్ముఖ్ విషయంలో కూడా అలానే జరుగుతోంది అంటూ.. వార్తలు వస్తున్నాయి.
సిరి విషయంలో అతడు బాగా బ్యాడ్ అయినట్లు తెలుస్తోంది. యూట్యూబ్ లో మంచి పాపులారిటీ తెచ్చుకున్న షణ్ముఖ్.. అతడి నిజ స్వరూపం చూసి.. కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. అంతే కాదు.. అతడి లవర్ దీప్తి సునయనా కూడా.. అతడితో బ్రేకప్ చెప్పినట్లు వార్తలు వినిపించాయి. తర్వాత అతడు దీనిపై క్లారిటీ కూడా ఇచ్చాడు. అలాంటిది ఏం లేదు అన్ని చెప్పాడు. కానీ దీప్తి పెట్టే పోస్టులు మాత్రం అనుమానాలకు దారితిసాయ్. ఏదేమైనా.. షణ్ముఖ్ బిగ్ బాస్ కు వెళ్లడం వల్ల ఏం ఒరిగింది లేదు ఈ కార్యక్రమం ద్వారా అతనికి లాభం కన్నా నష్టమే ఎక్కువ జరిగిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఇకపోతే నూతన సంవత్సరం కానుకగా దీప్తి సునైనా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ గత ఐదు సంవత్సరాల నుంచి తనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ షణ్ముఖ్ నుంచి తాను విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇలా దీప్తి సునైనా తన అభిప్రాయాన్ని తెలియజేయడంతో షణ్ముఖ్ జస్వంత్ సైతం తన నిర్ణయాన్ని గౌరవిస్తూ తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని గత ఐదు సంవత్సరాల నుంచి తనకు సపోర్ట్ చేసినందుకు తనకు కృతజ్ఞతలు తెలిపాడు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…