Samantha Ruth Prabhu: వాళ్ల అభిప్రాయాలతో అవసరం లేదు.. నిజం ఒక్కటే ముఖ్యం సమంత పోస్టు వైరల్..!
Samantha Ruth Prabhu: సమంత, నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నాలుగేళ్ల వైవాహిక జీవితానికి అక్టోబర్ 2న తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. కారణం ఏం చెప్పకుండా ఇలా చేయడంతో.. సోషల్ మీడియాలో ఎవరికి నచ్చిన విధంగా వాళ్లు రాసుకొస్తున్నారు. దీంతో వారిద్దరికి సంబంధించి ఏ రోజైనా వార్త లేదు అంటే అది అతశయోక్తి కాదు.
ఇలా వారిద్దరిలో ఎక్కువగా సమంతదే తప్పు అన్నట్లు.. ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. ఈ ఎఫెక్ట్ సినిమాలపై పడుతుందేమో.. ఆమెకు ఆఫర్లు రావేమో అనుకున్నారు. కానీ.. సమంత విడాకుల ప్రకటన తర్వాత తన కెరీర్ పరంగా ఓ రేంజ్ లో దూసుకుపోతోంది. ఎప్పుడూ లేని విధంగా ఓ ఐటెం సాంగ్ లో నటించింది సమంత.
ఆ సాంగ్ యూట్యూబ్ లో మిలియన్స్ కొద్ది వ్యూస్ తో రికార్డులను క్రియేట్ చేసింది. అంతకముందు కంటే ఎక్కువగా ఆమెకు ఆఫర్లు రావడం మొదలయ్యాయి. తాజాగా ఆమె ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ కు ఓకె చేసినట్లు తెలుస్తోంది. ఇలా తెలుగులోనే కాకుండా.. బాలీవుడ్ ,హాలీవుడ్ లో అవకాశాలు క్యూ కడుతున్నాయి.
ఇక ఎప్పటికప్పుడు ఎంతో యాక్టివ్ ఉంటూ.. తనకు సంబంధించి ఫొటోలను సోషల్ మీడియలో పోస్టు చేస్తుంది సమంత. తాజాగ ఆమె తన ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ లో ఓ పోస్టు పెట్టింది. అందులో ఏముందంటే.. ‘‘మీరు ఇతరులపై ఆధారపడటం మానుకోవాలి.. ఇతరులు ఏమనుకుంటున్నారో.. వారు ఏమి నమ్ముతారు,వారు ఏమి ఆశిస్తున్నారు అనేవి మీకు అనవసరం. ఇవి జైలు గదికి కడ్డీలులాంటివి. ఆ జైలు నుంచి బయటపడటానికి మీకు మీరే రిలయలైజ్ అవ్వాలి. ఇతరుల అభిప్రాయాలతో మీకు సంబంధం లేదు. అవి పట్టించుకోవాల్సి అవసరం లేదు. ఎందుకంటే ఎవరి అభిప్రాయం ముఖ్యం కాదు. నిజం ఒక్కటే ముఖ్యం. ఈ విషయాలను అర్థం చేసుకోగలిగితే.. మీరు మరిత గౌరవం పొందుతారు’’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆ స్టెటస్ కు సంబంధించిన ఈ స్టోరీ వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…