Tag Archives: nandi award

Rohini: నంది అవార్డుల పై స్పందించిన రోహిణి.. ఇప్పటివరకు నాకు ఇవ్వలేదు అంటూ సెటైర్స్!

Rohini: రోహిణి పరిచయం అవసరం లేని పేరు జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతున్నటువంటి ఈమె ఇదివరకు పలు బుల్లి తెర సీరియల్స్ లో నటించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. ప్రస్తుతం ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలు చేస్తూనే మరోవైపు వెండి తెర సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు.

ఇక ఈమె 2014వ సంవత్సరంలో కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమయ్యారు. ఈ సీరియల్ లో కమెడియన్ గా ఎంతో అద్భుతమైన నటనను కనబరిచినందుకు ఈమెకు బెస్ట్ కమెడియన్ నంది అవార్డుకు ఎంపిక అయ్యారు. ఇలా ఈమెకు నంది అవార్డుతో పాటు పదివేల రూపాయల క్యాష్ ప్రైస్ కూడా 2018లో ప్రకటించారు.

ఇకపోతే తాజాగా ఈమెకు నంది అవార్డు రాబోతున్నట్లు ప్రకటించినటువంటి ఒక లెటర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నాకు నంది అవార్డు ప్రకటించినందుకు చాలా సంతోషపడ్డాను ఇలా నంది అవార్డుకు ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉండేదని అయితే ఇప్పటివరకు నాకు నంది అవార్డు మాత్రం ఇవ్వలేదు అంటూ ఈమె తెలియజేశారు.

ఇప్పటివరకు నంది అవార్డు ఇవ్వలేదు..

ఇలా గత విషయాలను ఇప్పుడు ఈమె గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఈ పోస్టు ఫైనల్ గా మారడంతో పలువురు ఈ పోస్ట్ పై వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈమె ఇప్పటివరకు ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించలేదని పరోక్షంగా సెటైర్స్ వేస్తున్నారా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నంది అవార్డు పేరులను గద్దర్ అవార్డులుగా మార్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ అవార్డులను ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు.

https://www.instagram.com/actressrohini/p/C3QOFWSxn6U/

Karate Kalyani: సీఎం రేవంత్ రెడ్డికి శాపనార్థాలు పెట్టిన కరాటే కళ్యాణి.. ఏం జరిగిందంటే?

Karate Kalyani: సినీ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతూ తరచూ పలు వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచే కరాటే కళ్యాణి తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల నంది అవార్డుల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

చిత్ర పరిశ్రమలో కళాకారులకు ఇకపై నంది అవార్డులు కాకుండా గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని వెల్లడించారు. ఇలా గద్దర్ పేరిట వచ్చే ఏడాది ఆయన జయంతిని పురస్కరించుకొని ఈ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే ప్రముఖ నంది అవార్డుల పేరును మార్చడంతో కరాటే కళ్యాణి ఫేస్బుక్ ద్వారా ఈ విషయంపై స్పందిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

గాడ్సే అవార్డులు ఇస్తాను…

గద్దర్ గారి పేరు మీద అవార్డులు ఇవ్వడం ఇబ్బందే అయినా.. అది మీ ఇష్టం. తప్పేమీ లేదు కానీ.. అత్యుత్తమమైన నంది అవార్డుల పేరు మారిస్తే ఏ సీఎం అయినా తప్పే.. నంది చూసుకుంటాడులే అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కరాటే కళ్యాణి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి అంతేకాకుండా తాను గాడ్సే అవార్డులు కూడా ఇస్తానని అందుకోవాల్సిన వారు అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటూ ఈమె పరోక్షంగా గద్దర్ ను అవమానిస్తూ కూడా చేసినటువంటి ఈ కామెంట్లు సంచలనంగా మారాయి.

Tarakaratna: ఉత్తమ విలన్ గా నంది అవార్డు అందుకున్న తారకరత్న… ఏ సినిమాకంటే?

Tarakaratna: నందమూరి వారసుడు తారకరత్న 20 సంవత్సరాల వయసులోనే హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. 2002వసంవత్సరంలో ఈయన ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయినా ఇందులో ఈయన నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.

ఇలా హీరోగా పలు సినిమాలలో నటించిన ఈయన మాత్రం ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయారు.ఇక తారకరత్న కేవలం హీరోగా మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో కూడా నటించి అందరిని భయపెట్టారు. నిజం చెప్పాలంటే ఈయనకు హీరోగా కన్నా విలన్ గానే ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.

ఈ విధంగా రవి బాబు దర్శకత్వంలో తెరకెక్కిన అమరావతి సినిమాలో ఈయన శ్రీను అనే విలన్ పాత్రలో నటించారు.అతి భయంకరమైన ఈ పాత్రలో తారకరత్న ఎంతో అద్భుతంగా నటించారని ఈయన నటనకు గాను ఏకంగా నంది అవార్డు కూడా వరించింది. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలలో ఈయన విలన్ పాత్రలో నటించారు.

Tarakaratna: అమరావతి సినిమాకు నంది అవార్డు…

ఇక తాజాగా 9 అవర్స్ అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా తారకరత్న విలన్ పాత్రలో నటించి మెప్పించారు. ఇలా తిరిగి సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్న తారకరత్న ఉన్నఫలంగా గుండెపోటుకు గురై మరణించడం అభిమానులకు తీరని లోటుగా మారింది. ఇక ఈయన చివరిగా సారధి అనే సినిమాలో నటించారు. ఇదే తారకరత్న చివరి సినిమా.

తనకు నంది అవార్డు ఇవ్వలేదంటూ జగన్ ను విమర్శిస్తూ.. బాబు పై పొగడ్తలు చేసిన నటి!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నంది అవార్డులు సందడి కనిపించి చాలా కాలమైంది. ఈ విధంగా ఇండస్ట్రీలో వారి నటనను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటిస్తుంది. అయితే ఈ నంది అవార్డుల విషయంలో ప్రభుత్వం టాలెంట్ కి తగ్గట్టుగా కాకుండా, రెకమెండేషన్, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారి పేర్లను నంది అవార్డుల జాబితాలో విడుదల చేస్తారనే విమర్శలు వినిపిస్తుంటాయి. అదేవిధంగా నంది అవార్డులను ఎరగా వేసి సినీ సెలబ్రిటీలను రాజకీయాల వైపు తిప్పుకుంటారనే వార్తలు కూడా వినిపిస్తుంటాయి.

తాజాగా తనకి రావాల్సిన నంది అవార్డు ఇప్పటివరకు రాలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై సినీనటి, బిగ్ బాస్ ఫేమ్ కరాటే కళ్యాణి తీవ్ర స్థాయిలో విమర్శించారు. కరాటే కళ్యాణి గోరంత దీపం సీరియల్ లో విలన్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిందని, తన నటనకు అప్పటి ప్రభుత్వం నంది అవార్డును ప్రకటించిందని, అయితే ఇప్పటి వరకు నంది అవార్డ్ తనకు దక్కలేదని ఆ సీరియల్ గెటప్ కి సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ సంచలన వ్యాఖ్యలను చేసింది.

ఈ ఫోటోలను చూస్తుంటే 2013 సంవత్సరానికి వెళ్ళిపోయాను అప్పుడు ఎంతో సన్నగా అయ్యాను. ఈ సీరియల్ ద్వారా మంచి పేరుతో పాటు నంది అవార్డు కూడా కూడా వచ్చింది. అయితే అప్పటి సీఎం చంద్రబాబు నాయుడుగారు ఉన్నారు ఆయన దిగిపోయే సమయానికి నంది అవార్డును అనౌన్స్ చేసినప్పటికీ ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు తనకు నంది అవార్డు ఇవ్వడం లేదంటూ జగన్ పై విమర్శల వర్షం కురిపించింది.

గోరంత దీపం సీరియల్ కోసం తాను ప్రత్యేకంగా తెలంగాణ భాషను నేర్చుకున్నట్లు తెలిపింది.తాను విలన్ గా ఎంతో అద్భుతంగా నటించిన ఈ పాత్రకు జగన్మోహన్ రెడ్డి నంది అవార్డు ఇవ్వకపోవడంతో అందరిని ఎంతో బాధకు గురి చేశాయని ఈమె చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది.ఈమె చేసిన పోస్టర్ పై స్పందించిన నెటిజన్లు 2013లో నంది అవార్డు చేస్తే 2017,2019 వరకు చంద్రబాబునాయుడు సీఎం గా ఉన్నారు. ఈ మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఎందుకొచ్చాడు బాబీ అంటూ… నువ్వు నీ పెయిడ్ పోస్టులు అంటూ నెటిజన్లు కరాటే కళ్యాణి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.అయితే కరాటే కళ్యాణి సీఎం జగన్ మోహన్ రెడ్డి గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు ఈ విధంగా పలుమార్లు ఆమె జగన్మోహన్ రెడ్డి గురించి స్పందించారు.