Tag Archives: negative

Balakrishna: ఈ రెండు సంఘటనలు బాలయ్య ఇమేజ్ ను డామేజ్ చేశాయా… బాలయ్య పై నెగిటివ్ పెరిగిందా!

Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ మధ్యకాలంలో పలు వివాదాస్పద వ్యాఖ్యల్లో నిలుస్తున్నారు.ఇండస్ట్రీలో ఈయన హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే అక్కడ వీరసింహారెడ్డి సినిమాల సక్సెస్ తో ఈయన క్రేజ్ మరింత పెరిగిపోయింది.ఇకపోతే ఈయన హీరోగా మాత్రమే కాకుండా వ్యాఖ్యాతగా కూడా అన్ స్టాపబుల్ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇలా ఈ కార్యక్రమం కూడా బాలయ్య కెరియర్ కి ఎంతో ప్లస్ పాయింట్ అయింది.ఇలా బాలయ్య క్రేజ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈయన చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా ఈయన ఇమేజ్ కాస్త డామేజ్ అయిందని పలువురు భావిస్తున్నారు. వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్యకు జోడిగా నటించిన హనీ రోజ్ తో కలిసి బాలయ్య మందు తాగడంతో ఈయనపై కాస్త నెగెటివిటీ ఏర్పడింది.

ఇక ఈ ఘటన మర్చిపోకపోతే ఈయన అక్కినేని తొక్కినేని అంటూ మరొక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచారు. ఇలా అక్కినేని ఫ్యామిలీ గురించి బాలకృష్ణ చేసినటువంటి ఈ వ్యాఖ్యల ద్వారా అక్కినేని అభిమానులు బాలయ్య పై తీవ్రస్థాయిలో ట్రోల్ చేశారు. అయితే ఇలాంటి నెగెటివిటీ బాలయ్య పై ఎలాంటి ప్రభావం చూపదని అభిమానులు భావిస్తున్నారు.

Balakrishna: ఏఎన్ఆర్ పై ఎప్పటికీ ప్రేమ తగ్గదు…


బాలకృష్ణ గతంలో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలలో కొన్నిసార్లు బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పారు. అయితే అక్కినేని వివాదంపై ఈయన స్పందించినప్పటికీ క్షమాపణలు చెప్పలేదు కానీ ఏఎన్నార్ తనకు బాబాయ్ లాంటి వారని ఆయన పై నా గుండెల్లో ఎప్పటికీ ప్రేమ తగ్గదని బయట ఏం జరిగినా తాను పెద్దగా పట్టించుకోనని, ఇందులో తన తప్పు లేదంటూ చెప్పేశారు. ఇలా బాలకృష్ణ అక్కినేని వివాదానికి కూడా చెక్ పెట్టేసారు. ఈ సంఘటనలు బాలయ్య పై ఏమాత్రం నెగెటివిటీ చూపించలేవని చెప్పాలి.

కరోనా నెగిటివ్ వచ్చిన వాళ్లకు షాకింగ్ న్యూస్..?

గడిచిన ఏడు నెలలుగా శరవేగంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అగ్ర రాజ్యం అమెరికా సైతం కరోనా మహమ్మారి వల్ల గజగజా వణుకుతోంది. ప్రపంచ దేశాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ మహమ్మారి గురించి శాస్త్రవేత్తల పరిశోధనల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు కరోనా నుంచి కోలుకుని నెగిటివ్ వచ్చిన వాళ్లిన షాకింగ్ విషయాలను వెల్లడించారు.

కరోనా నుంచి వాళ్లలో కొందరు గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ లకు గురవుతున్నారని శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది. వైరస్ బారిన పడి కోలుకున్న రోగుల్లో 7 నుంచి 8 శాతం మందిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. సాధారణ కరోనా రోగులతో పోల్చి చూస్తే వెంటిలేటర్ పై చికిత్స చేయించుకున్న రోగులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్నా తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని వెల్లడించారు.

కరోనా నుంచి కోలుకున్న వాళ్లు గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఊపిరితిత్తుల రక్తనాళాలు గడ్డ కట్టే సమస్య ఎక్కువ మందిలో కనిపిస్తోందని కోలుకున్న వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. కరోనా సోకి నెగిటివ్ వచ్చిన వాళ్లు మూడు నెలల పాటు యాంటీ కో ఆగ్యుగేషన్ మందులను వాడాలని సూచనలు చేస్తున్నారు. చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ ను ఉపయోగిస్తే వాటి ఫాలో అప్ మందులను వాడాలని చెబుతున్నారు.

మెడిటేషన్, యోగా, వ్యాయామం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. పోషకాలతో కూడిన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలని.. యోగా, మెడిటేషన్ ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ ను తరచూ పరిశీలించుకుంటూ ఉండాలని శాస్త్రవేత్తలు సూచించారు.