Tag Archives: opportunity

Anushka Shetty: మొదటిసారిగా క్యాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పిన అనుష్క… అవకాశాలు రావాలంటే ఆ పని చేయాల్సిందే!

Anushka Shetty:అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్న నటి అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి సినిమా తర్వాత ఇండస్ట్రీకి దూరమైన అనుష్క శెట్టి తాజాగా ఒక జాతీయ మీడియాతో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈ ఇంటర్వ్యూలో భాగంగా స్వీటీ క్యాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పారు.

Anushka Shetty: మొదటిసారిగా క్యాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పిన అనుష్క… అవకాశాలు రావాలంటే ఆ పని చేయాల్సిందే!

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. అవకాశాలు ఇస్తామని చెప్పి హీరోయిన్లను లోబర్చుకునే సంస్కృతి తెలుగులో కూడా ఉంది అలాంటివి నేను చూశాను.అయితే ఈ సంస్కృతి కేవలం తెలుగు పరిశ్రమలోనే కాకుండా ప్రతి ఒక్క రంగంలోనూ ఉందని ఈ సందర్భంగా అనుష్క తెలియజేశారు.

Anushka Shetty: మొదటిసారిగా క్యాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పిన అనుష్క… అవకాశాలు రావాలంటే ఆ పని చేయాల్సిందే!

ఇక ఈ కాస్టింగ్ కౌచ్ పై తన గురించి మాట్లాడుతూ నేను ఇండస్ట్రీలోకి వచ్చిన మొదటి నుంచి ఇప్పటివరకు ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎక్కడ ఎదుర్కోలేదని తెలియజేశారు. తాను మొదటి నుంచి ఎంతో నిక్కచ్చిగా మాట్లాడే మనస్తత్వం నాది అందుకే ఎప్పుడు నాకు ఇలాంటి పరిస్థితులు ఎదురు కాలేదని అనుష్క ఈ సందర్భంగా తెలియజేశారు.

నా దురుసు ప్రవర్తనే కారణం….

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు మహిళలు ఇప్పటికీ ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఈమె చిత్ర పరిశ్రమలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పారు.ఈ విషయాన్ని నేను కూడా అంగీకరిస్తానని అయితే నా దురుసు ప్రవర్తన కారణంగా నాకు ఇబ్బందులు ఎదురుకాలేదని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం అనుష్క శెట్టి జాతి రత్నాలు హీరో నవీన్ పోలిశెట్టితో ఓ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా గురించి ఏ విధమైన ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Apple iphone: ఐఫోన్ కొనాలి అనుకుంటున్నారా… ఇదే మంచి అవకాశం ఐఫోన్ కేవలం రూ.14 వేలకే మీ సొంతం!

Apple iphone: మొబైల్ లు మార్కెట్లో ఎన్ని ఉన్నా.. యాపిల్ ఐఫోన్లకు ఉండే డిమాండ్ వేరే ఉంటుంది. ఎంత ఎక్కువ ధర పలుకుతున్నా.. చాలా మంది వాటిపై మోజు ఎక్కువగా ఉంటుంది. యాపిల్ ఐఫోన్ ప్రపంచంలోని మొబైల్ ప్రియులకు అత్యంత ఇష్టమైన బ్రాండ్‌.

Apple iphone: ఐఫోన్ కొనాలి అనుకుంటున్నారా… ఇదే మంచి అవకాశం ఐఫోన్ కేవలం రూ.14 వేలకే మీ సొంతం!

యాపిల్ ఐఫోన్ మెయింటెన్ చేస్తున్నారంటే.. అతడి లెక్క వేరే ఉంటుంది. అంతే కాదు సమాజంలో చూసే వాళ్లు కూడా.. వాళ్లకు ఇచ్చే రెస్పెక్ట్ వేరే లెవల్లో ఉంటుంది. అందుకే ఈ ఫోన్లకు మక్కువ ఎక్కువగా ఉంటుంది.

Apple iphone: ఐఫోన్ కొనాలి అనుకుంటున్నారా… ఇదే మంచి అవకాశం ఐఫోన్ కేవలం రూ.14 వేలకే మీ సొంతం!

అయితే ఇంత పాపులారిటీ ఉన్న ఈ ఫోన్లు తక్కువ ధరకు లభిస్తున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఎన్నో ఆఫర్లను తీసుకొస్తుంది. మొబైల్స్ పై భారీ డిస్కౌంట్లను తీసుకొస్తుంది.

దానికి అదనంగా మరో రూ.10,601 డిస్కౌంట్ ..

ప్రస్తుతం ఐఫోన్లపై కూడా అవే డిస్కౌంట్లను ప్రకటించింది. దాదాపు 26 శాతం డిస్కౌంట్ ప్రకటించి.. ఐఫోన్ ను కేవలం రూ.14 వేలకే అందిస్తోంది. అంటే రూ.39,900 విలువైన ఐఫోన్ ఎస్ఈని కేవలం రూ.14వేలకే అందిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. దీంతో ఆ ఐఫోన్లు విపరీతంగా సేల్ అవుతున్నాయి. వివరంగా చెప్పాలంటే.. బ్లాక్ కలర్ లో ఉన్న ఈ 64జీబీ యాపిల్ ఐఫోన్ ధర రూ.39,900 ఉండగా.. 26 శాతం డిస్కౌంట్ తీసేస్తే.. రూ.29,900లకు దక్కుతుంది. దానికి అదనంగా మరో రూ.10,601 డిస్కౌంట్ పొందవచ్చు. మరో ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఎక్ఛేంజ్ ఆఫర్ కింద ఫ్లిప్ కార్ట్‌లో ఈ ఫోన్ ను చివరకు రూ.13,799లకు సొంతం చేసుకోవచ్చు. ఎక్ఛేంజ్ ఆఫర్ మనకు ఎలిజిబిల్ ఉందా లేదా తెలుసుకోవాలంటే.. మన ప్రాంత పిన్ కోడ్ నంబర్ ఎంటర్ చేస్తే అర్హులా కాదా అనేది చూపిస్తుంది.

చనిపోయిన వారితో మాట్లాడే అవకాశం కల్పించిన మైక్రోసాఫ్ట్?

సాధారణంగా మనకు ఎంతో దగ్గరైనా మన కుటుంబ సభ్యులు, మన ఆత్మీయులు మరణించి దూరమైతే వారికి గుర్తుగా వారితో ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ నిరంతరం వారిని గుర్తు చేసుకుంటూ బాధపడుతుంటారు. ఒక్కసారైనా వారితో మాట్లాడాలని ఎంతో మంది భావిస్తుంటారు. అయితే ఇలాంటి వారి కోరికలను మైక్రోసాఫ్ట్ తీర్చ బోతోందా? అంటే దాదాపు అవుననే సమాధానం వినిపిస్తోంది. మైక్రోసాఫ్ట్ కొత్త టెక్నాలజీని ఉపయోగించి చనిపోయిన వారితో మాట్లాడే అవకాశాన్ని కల్పించనున్నట్లు తెలుస్తోంది.

ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా పనిచేసే ఒక చాట్‌బాట్‌ను రూపొందించింది. దీని ద్వారా చనిపోయిన వ్యక్తికు సంబంధించిన డేటా ఆధారంగా తయారు చేస్తారు. అంటే చనిపోయిన వ్యక్తి వాయిస్, వారి డేటా ఫోటోలు వీడియోలను సేకరించిన అనంతరం ఈ చాట్ బాట్ ద్వారా రూపొందిస్తారు. ఈ విధంగా చాట్ బాట్ రూపొందించడం వల్ల అచ్చం చనిపోయిన వ్యక్తి లాగే మాట్లాడుతుంది. అంతే కాకుండా వారికి తెలిసిన వ్యక్తులను కూడా పలకరిస్తుంది. ఈ చాట్ బాట్ కు మరింత టెక్నాలజీని ఉపయోగించి 2 డి,3డీ లో రూపంలో ఫోటోలను కూడా చేర్చవచ్చు.

ఈ విధంగా మైక్రోసాఫ్ట్ తయారుచేసిన కొత్త టెక్నాలజీ ద్వారా చనిపోయిన వ్యక్తులు తమ దగ్గర ఉన్న భావనను కలిగిస్తుంది. అంతేకాకుండా వారితో మాట్లాడుతున్న భావన మనలో కలుగుతుంది. అయితే ప్రస్తుతం ఈ టెక్నాలజీని మైక్రోసాఫ్ట్ అందుబాటులోకి తెస్తుందా? లేక దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందా అనే విషయం గురించి క్లారిటీ తెలియడం లేదు. ఏది ఏమైనా ఈ టెక్నాలజీ మాత్రం అందుబాటులోకి వస్తే ఎంతో మంది తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి కొంతవరకు ఊరటగా ఉంటుందని చెప్పవచ్చు.