Tag Archives: Oscar award.

NTR: మొదటిసారి ఆస్కార్ అవార్డు గురించి మాట్లాడిన తారక్… ఏమన్నారంటే?

NTR: అమెరికాలో ఆస్కార్ అవార్డువేడుక ముగిసిన తర్వాత చిత్ర బృందం మొత్తం తిరిగి హైదరాబాద్ చేరుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ఆస్కార్ వేడుక తర్వాత మొదటిసారి విశ్వక్ సేన్ హీరోగా నటించిన దాస్ కా ధమ్కీ సినిమా వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ వేదికపై మాట్లాడుతూ ఆస్కార్ గురించి మొదటిసారి పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. ఈ సందర్భంగా తారక్ మాట్లాడుతూ నాటు నాటు పాట నేడు ఆస్కార్ అవార్డు అందుకుంది అంటే అందుకు రాజమౌళి ప్రేమ్ రక్షిత్ చంద్రబోస్ కీరవాణి కాలభైరవ వంటి ఇతరులు ఎంతవరకు కారకులో అంతకుమించి తెలుగు, భారతీయ చిత్ర పరిశ్రమ, ప్రేక్షకులు కూడా కారణమని తెలిపారు.

వీటన్నింటితో పాటు మీరు మాపై చూపించే ప్రేమ అభిమానం కూడా కారణమని ఎన్టీఆర్ తెలిపారు. ఇక కీరవాణి చంద్రబోస్ ఆస్కార్ వేదికపై అవార్డు తీసుకుంటూ ఉంటే నాకు వాళ్ళు కనిపించలేదు ఇద్దరు భారతీయులు ఇద్దరు తెలుగువాళ్లు కనిపించారు. ఈ వేడుకను మీరు టీవీల్లో చూసి ఎంత ఆనందపడ్డారో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఆ క్షణం ఎంతో సంతోషంతో, గర్వంతో ఉప్పొంగి పోయానని తెలిపారు.

NTR: మరికొన్ని ఆస్కార్ అవార్డులు రావాలి…


ఇలాంటి క్షణం మరి ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ రావాలని కచ్చితంగా కోరుకుందాం. ఈ సినిమా ఇచ్చిన ప్రోత్సాహంతో భారతీయ,తెలుగు సినిమా పరిశ్రమలు మరికొన్ని ఆస్కార్ అవార్డులను కూడా అందుకోవాలని మనసారా భగవంతుడిని ప్రార్థిద్దాం అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఆస్కార్ వేడుకలు గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Ram Charan: అతిథిగా ఉంటే చాలు అనుకున్న… ఎంతో గర్వంగా ఉంది.. ఆస్కార్ పై చరణ్ కామెంట్స్!

Ram Charan: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRRసినిమా లోని నాటు నాటు పాట ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో భాగంగా ఆస్కార్ నామినేషన్ లో నిలిచిన విషయం మనకు తెలిసిందే. ఇక మార్చి 12న
లాస్ ఏంజిల్స్ లో జరగనున్న 95వ అకాడమీ అవార్డ్స్ ప్రధానోత్సవంలో చిత్ర బృందం సందడి చేయనున్నారు.

ఇప్పటికే త్రిబుల్ ఆర్ చిత్ర బృందం మొత్తం అమెరికా చేరుకునే పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గుడ్ మార్నింగ్ అమెరికా షో తో పాటు ఇతర కార్యక్రమాలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు.

తాజాగా రామ్ చరణ్ కేటీఎల్ఏ ఛానల్‏కు ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఆస్కార్ నామినేషన్లో నాటు నాటు పాట ఉండడం గురించి తన అభిప్రాయాలను తెలియజేశారు. నిజానికి ఓ నటుడిగా ఇది నాకెంతో సంతోషాన్ని కలిగించే క్షణం.ఆస్కార్ వేడుకల్లో నేను ఒక అతిథిగా పాల్గొంటే చాలు అనుకునేవాన్ని అలాంటిది ఈ వేడుకలలో మా సినిమా కూడా నామినేట్ కావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.

Ram Charan: ఇన్నేళ్లకు మమ్మల్ని గుర్తించారు…


ఇలా మా సినిమాలోని పాట ఆస్కార్ కి నామినేట్ కావడం ఎంతో ఆనందంగా ఉంది అంతకుమించి మరేం కావాలి ఆస్కార్ అవార్డు తీసుకొని మా దేశానికి వెళ్లడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. మా ఇండియన్ సినిమాకు 85 ఏళ్ల చరిత్ర ఉంది ఇన్నేళ్లలో ఇప్పుడు మీరు మమ్మల్ని గుర్తించారు. మా సినిమా ఎంతో బాగుంద‌ని అప్రిషియేట్ చేశారు. నేను వివిధ దేశాల్లో ఆడియెన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తున్నందుకు ఆనందంగా ఉందంటూ తన సంతోషాన్ని తెలియజేశారు.

RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావాలంటే అంత ఖర్చు చేయాలా… నిర్మాతలు సాహసిస్తారా?

RRR Movie: చిత్ర పరిశ్రమకు అందించే పురస్కారాలలో ఆస్కార్ పురస్కారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి ఏడాది అందించే ఈ ఆస్కార్ అవార్డులను అందుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు .అయితే ఈ ఏడాది జరగబోయే ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి ఇప్పటికే పలు భాషా చిత్రాలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా నామినేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే.

చరిత్రలో కలవని ఇద్దరు స్వాతంత్ర సమరయోధులను కలుపుతూ జక్కన్న అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించారు. ఇలా ఈ హీరోలు నటనకు దేశవ్యాప్తంగా కాకుండా విదేశాలలో కూడా ఎంతోమంది ఫిదా అయ్యారు.ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటించిన రామ్ చరణ్ ఎన్టీఆర్ నటనలకు తప్పకుండా ఆస్కార్ రావాలంటూ వెరైటీ మ్యాగజైన్ వీరి పేర్లను ప్రచురించిన విషయం మనకు తెలిసిందే.

ఇకపోతే ఆస్కార్ అవార్డు రావాలంటే సినిమా ప్రమోషన్ కోసం భారీగా ఖర్చు చేయాలని తెలుస్తోంది. గతంలో ఆస్కార్ అవార్డులు అందుకున్న సినిమాలు కూడా భారీ స్థాయిలో ఖర్చు పెట్టాయి. ఇలా సినిమాని ప్రమోట్ చేయడం కోసం సుమారు 40 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా.

RRR Movie: ఎన్టీఆర్ చరణ్ నటనకు హాలీవుడ్ ఫిదా..

ఈ విధంగా ఆస్కార్ అవార్డు పొందడం కోసం నిర్మాతలు ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తారా అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది.అయితే ఒక సినిమాకి ఆస్కార్ అవార్డు రావడం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు కనుక బహుశా జక్కన్న నిర్మాతల చేత ఖర్చు చేయించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 1135 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా హీరోలతో పాటు మూడు విభాగాలలో కూడా ఆస్కార్ నామినేషన్ లో ఉంది. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.