Tag Archives: pakistan

Inzamam Ul Haq: 52 ఏళ్ల వయసులోనూ సిక్స్ లు ఫోర్ లతో చెలరేగిపోయిన ఇంజమామ్!

Inzamam Ul Haq: ఇంజమామ్ ఉల్ హక్ ఈ తరం వారికి పరిచయం లేకపోయినప్పటికీ 90ల తరం వారికి ఈయన గురించి సుపరిచితమే ఈయన బ్యాచ్ చేతపట్టారంటే బాల్ బౌండరీ దాటాల్సిందే.ఇంజమామ్ గ్రౌండ్ లోకి దిగారంటే ప్రత్యర్థులు సైతం భయానికి గురవుతారు. ఈయన పరుగులు తీయడానికి ఇష్టపడకపోయినప్పటికీ సిక్స్ లు ఫోర్ లతో బాల్ బౌండరీ దాటిస్తారు.

ఈయన పాకిస్తాన్ జట్టులో ఒకఆటగాడు మాత్రమే కాకుండా కెప్టెన్ గా పాకిస్తాన్ కు ఎన్నో మరుపురాని విషయాలను కూడా అందించారు. ఇలా ఒకప్పుడు సిక్సులు ఫోన్లతో చెలరేగిపోయిన ఇంజమామ్ గత కొంతకాలంగా క్రికెట్ కు దూరంగా ఉన్నప్పటికీ తాజాగా అభిమానులు ఈయన బ్యాటింగ్ చూసే అవకాశాన్ని తనకు కల్పించారు.

పాకిస్తాన్‌లో మెగా స్టార్స్‌ లీగ్‌ పేరిట టీ10 లీగ్‌ జరుగుతోంది. ఆరు జట్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో ఇంజమామ్‌ కరాచీ కింగ్స్‌ తరఫున ఆడుతున్నాడు.ఈ టోర్నీలో భాగంగా బలోచ్ వారియర్స్ తో జరిగిన మ్యాచులో ఇంజమామ్ చెలరేగిపోయి మరోసారి తన విశ్వరూపాన్ని చూపించారు.

Inzamam Ul Haq: సిక్స్ లు ఫోర్ లతో చెలరేగిపోయిన ఇంజమామ్…

ఇంజమామ్ బ్యాట్ చేత పట్టి కేవలం 16 బంతుల్లోనే నాలుగు ఫోర్లు ఒక సిక్స్ కొట్టి 29 పరుగులు చేశారు. ఈ క్రమంలో అతడు స్టెపౌట్‌ అయ్యి కొట్టిన ఓ సిక్సర్‌ మ్యాచ్ కే హైలైట్‌గా నిలిచింది.ఇలా 52 సంవత్సరాల వయసులో కూడా ఈయన బ్యాటింగ్ తీరు ఏ మాత్రం మారలేదని అభిమానులు మరోసారి గ్రౌండ్లో ఈయన సిక్స్ లు ఫోర్ లని చూసి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Pakisthan: పాకిస్థాన్ లో తాలిబన్ల రాజ్యం..? ఈ పరిణామాలు దానినే సూచిస్తున్నాయా..?

Pakisthan: భారత్ కు పొరుగు దేశం అయిన పాకిస్తాన్ కు భారత్ కు మధ్య సరిహద్దు వివాదాలతో పాటు.. ఇతర రకాల వాగ్వాదాలు ఎప్పుడూ చోటు చేసుకుంటూ ఉంటాయి. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ వస్తోంది. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి.. పాకిస్థాన్ ఇటువంటి ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ.. పొరుగు దేశాలపై కాలుదువ్వుతూ కనిపిస్తోంది. ఇలా ఇటువంటి చర్యలకు పాల్పడుతూ దేశ అభివృద్ధిని మరిచిపోయింది పాకిస్థాన్.

Pakisthan: పాకిస్థాన్ లో తాలిబన్ల రాజ్యం..? ఈ పరిణామాలు దానినే సూచిస్తున్నాయా..?

ఇదిలా ఉండగా.. కొన్ని రోజుల క్రితం మన పొరుగు దేశం అయిన అప్ఘనిస్థాన్ లో తాలిబన్ల రాజ్యం నడుస్తున్న విషయం తెలిసిందే. అక్కడి ప్రభుత్వాన్ని నిర్ధాక్షిణ్యంగా దింపేసి.. తాలిబన్లు తమ స్వరూపాన్ని చూపించారు. దీంతో ఆ రోజు నుంచి ఆ దేశ ప్రజలకు తిండిలేక అలమటిస్తున్నారు.

Pakisthan: పాకిస్థాన్ లో తాలిబన్ల రాజ్యం..? ఈ పరిణామాలు దానినే సూచిస్తున్నాయా..?

తమ ఆహారం కోసం తమ కిడ్నీలకు అమ్ముకుంటున్నారంటేనే అర్థం చేసుకోవాలి.. అక్కడి పాలను ఎంత దుర్భరంగా ఉందో. ఇలాంటి పాలనే పాకిస్థాన్ లో చోటు చేసుకోబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. పాకిస్థాన్ పెంచి పోషించిన ఉగ్రవాదమే ఇప్పుడు ప్రమాదకరంగా మారబోతోంది.


సైనికులను పిట్టల్లా కాల్చి చంపేసినా..

తెహరి తాలిబన్లు ఇటీవల పాకిస్థాన్ సైనికులను పిట్టల్లా కాల్చి చంపేశారు. ఇటువంటి చర్యలు జరుగుతున్నా అడిగే వాడే కరువయ్యాడు. ఇదే అదునుగా భావించిన తెహరి తాలిబన్లు ఇంకా రెచ్చిపోతున్నారు. ఇటీవల పాకిస్థాన్ ఆర్మీలో పనిచేసిన జనరల్ హరి సింగ్ నల్వా కు గుర్తుగా హరి పూర్ లో ఒక విగ్రహం ఏర్పాటు చేశారు. దానిని పాకిస్థాన్ లోని మతోన్మాద శక్తులు ఆ విగ్రహాన్ని కూల్చివేసి..ఆ ప్రాంతం పేరును సాదిక్ అక్బర్ చౌక్ గా పెట్టారు. ఇదంతా జరుగుతున్నా.. పాకిస్థాన్ పీఎం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటంతో తాలిబన్ల పాలను ఇమ్రాన్ ఖాన్ కూడా స్వాగతం పలుకుతున్నారా.. అనే అనుమానాలకు తావిస్తోంది. ఇక ఏ క్షణమైనా పూర్తిగా పాకిస్థాన్ పై అమ ఆధిపత్యం చెలాయించేందుకు తెహరి తాలిబన్లు రెడీ గా ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

60 ఏళ్ల మామ పై కన్నేసిన కోడలు… తన సంతోషం కోసం ఇంత దారుణానికి ఒడిగట్టిన కోడలు..!

ఈ మధ్య కాలంలో సమాజంలో మానవతా విలువలు పూర్తిగా మంట కలిసిపోతున్నాయి. తల్లి తండ్రి అన్నా చెల్లెలు, తండ్రి కూతురు, మామ కోడలుఅన్న సంబంధాలు మరచిపోయి కేవలం శారీరక సుఖం కోసం ఎంతటి దారుణానికి అయినా పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే కోడలు కేవలం తన శారీరక సుఖం కోసం మామ పై కన్నేసి మామ ప్రాణాలతో చెలగాటమాడిన ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలలోకి వెళితే..

పంజాబ్ లోని లాహోర్ పట్టణం. బిలాల్‌ హసన్, నహీద్‌ ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. వీరికి బాయ్ బాయ్ ఇక జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతున్న సమయంలో తన భర్త ఉద్యోగం నిమిత్తం ఎక్కువగా బయటకు వెళ్ళేవాడు. ఈ క్రమంలోనే కోడలు తన 60 సంవత్సరాల మామ పై కన్నేసింది. ఈ క్రమంలోనే అతనికి వయాగ్రా టాబ్లెట్స్ అతనికి తనపై కోరిక కలిగేలా చేసింది.

ఈ క్రమంలోనే కోడలు తన మామతో శారీరక సంబంధం పెట్టుకునేది. ఇదిలా ఉండగా ఒకరోజు ఎక్కువసార్లు తన కోడలితో మామ గడపటం వల్ల వయసు పైబడటం చేత గుండెపోటు వచ్చి మరణించాడు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు తన శవాన్ని పోస్టుమార్టానికి పంపించగా దిమ్మతిరిగిపోయే నిజం బయటపడింది.

సదరు పేషెంట్ ఎక్కువసార్లు శారీరక సంబంధాలు పెట్టుకోవడం వల్ల గుండెపోటు వచ్చే మరణించిందని తెలియడంతో కోడలిపై అనుమానాలు వచ్చాయి. ఈ క్రమంలోనే కొడుకు తన భార్య పై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులకు విస్తుపోయే నిజాలను ఆ కోడలు బయటపెట్టింది.

రెప్పపాటులో అమ్మాయికి ముద్దు పెట్టి పారిపోయిన యువకుడు.. అసలేం జరిగిందంటే..!

ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు చేస్తున్న అరాచకాలు అంతా ఇంతా కాదు. కానీ అంతకంటే ఎక్కువగా మన పక్కనే ఉన్న పాకిస్థాన్ లో ఈ సంఘటనలు చూస్తే మీకే అర్థం అవుతుంది. అక్కడ ఓ ఏరియాలో ఎడ్ల బండి లాంటి ఓ రిక్షాలో… ఇద్దరు అమ్మాయిలు… ఓ చిన్నారి కూర్చొని వెళ్తున్నారు. అప్పుడు రాత్రి సమయం అయింది. అయినా అక్కడ ప్రజలు బాగానే ఉన్నారు కాబట్టి తమకు ఏమి కాదని ఆ అమ్మాయిలు అనుకొని ఉంటారు.

వెంటనే పరుగున వచ్చి ఓ వ్యక్తి అక్కడ రిక్షాలో ఎక్కాడు. బల్లిలా అతుక్కుపోయి.. ఓ అమ్మాయి బుగ్గపై ముద్దు పెట్టేశాడు. ఆ తర్వాత వెంటనే అక్కడి నుంచి కిందకు దూకి పారిపోయాడు. రెప్పపాటులో జరిగిన ఈ ఘటన బాధితురాలిని, పక్కనే కూర్చున్న మరో యువతి మాత్రం ఆశ్చర్యపోయారు. ఇంతదారుణామా అనుకున్నారు. ఇలా జరిగిన వెంటనే మరొకరు కూడా పక్కనే ఉన్న మరో యువతి దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నించగా.. ఆమె చెప్పు తీయడంతో దుండగులు పారిపోయారు.

ఇదంతా ఓ యువకుడు వీడియో తీయగా.. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ముద్దు పెట్టే ముందు ఆ యువకుడు అసభ్య సంకేతాలు చేశాడని.. దీంతో వారు తలలు తిప్పుకొని ఉన్నారని తెలిసింది. వారు వేరే వైపు తిప్పుకున్నప్పుడే ఆ యువకుడు రిక్షా దగ్గరకు వెళ్లి అంత పని చేశాడు. ఇదంతా పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న ఆగస్టు 14 న జరగడం విశేషం. ఇటీవల మరో దారుణ ఘటన కూడా చోటు చేసుకుంది. గుంపులో ఓ మహిళ బట్టలు విప్పి.. గాల్లో విసిరేసి రేప్ చేయబోయారు. ఈ ఘటన తీవ్ర దుమారం రేపడంతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దర్యాప్తుకు ఆదేశించారు.

ఇప్పుడీ వీడియో తెగ వైరల్ అవుతోంది. చాలా మంది ఇది చూసి పాకిస్థాన్ ప్రభుత్వంపై భగ్గు మంటున్నారు. అక్కడ అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతోందని పాకిస్థాన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లకూ… పాకిస్థాన్‌లో పరిస్థితులకూ ఎలాంటి తేడా లేకుండా పోయిందని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా పాకిస్థాన్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం.. లా అండ్ ఆర్డర్ విషయంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ది మొదటి నుంచి మెతకవైఖరే అంటూ నెటిజన్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పాకిస్థాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మహిళ.. త్వరలో బాధ్యతల స్వీకరణ..

దేశంలో అత్యున్నతమైన న్యాయ స్థానం అంటే మనం సుప్రీంకోర్టుగా చెబుతాం. అయితే మన దాయాది దేశం అయిన పాకిస్థాన్ కు కూడా అత్యున్నత న్యాయస్థానంగా సుప్రీంకోర్టు ఉంది. అయితే అక్కడ మొట్టమొదటి సారి ప్రధాన న్యాయమూర్తిగా ఓ మహిళ ఎంపిక కానున్నారు. ఆగస్టు 17 న ప్రస్తుతం చీఫ్ జస్టిస్‌గా ఉన్న ముషీర్ ఆలం పదవీ విరమణ చేయనున్నారు. తర్వాత చీఫ్ జస్టిస్‌ ఎవరుండాలనే నిర్ణయం అతడిపైనే ఉంటుంది.

తర్వాత చీఫ్ జస్టిస్‌గా ఓ మహిళ పేరును ప్రస్తావించారు. ఆమె పేరు అయేషా మాలిక్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పాకిస్థాన్ కు మహిళ బాధ్యతలు స్వీకరించడం అనేది మొదటిసారి. జస్టిస్ ఆలమ్ సిఫారసు మేరకు న్యాయ కమిటీ ఆయేషా మాలిక్‌ను అత్యున్నత న్యాయస్థానానికి జడ్జిగా నియమించనుంది. 1997లో న్యాయవాద వృత్తిని ప్రారంభించిన ఆమె.. 2001లో ఆమె కరాచీలోని తన న్యాయసేవా సంస్థలో పని చేశారు.

లాహోర్‌లో ఉన్న పాకిస్థాన్ కాలేజ్ ఆఫ్ లా విద్యాసంస్థ నుంచి ఆమె న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. ఆ తర్వాత ఆమె మాస్టర్స్ కోసం లండన్ వెళ్లారు. అక్కడ హార్వర్డ్ లా స్కూల్ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. తర్వాత 2012 నుంచి ఇప్పటి వరకు లాహోర్ హైకోర్టులో న్యాయమూర్తిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. సీనియారిటీ జాబితాలో ఆమె నాలుగో స్థానంలో ఉంది. 2019లో లాహోర్‌లోని మహిళా న్యాయమూర్తుల రక్షణ కమిటీకి అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు.

2019లోనే ఈ ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. పురుష న్యాయవాదుల పోకిరి పనులకు వ్యతిరేకంగా ఆమె ఈ ప్యానెల్ ను ఏర్పాటు చేశారు. మహిళల కన్యత్వ పరీక్షలపై ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుతో జస్టిస్ అయేషా జనవరిల నెలలో వార్తల్లో నిలిచారు. అంతే కాకుండా ఆమెకు ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఉమెన్ జడ్జీస్ లో కూడా సభ్యత్వం ఉంది.

ఆ బాంబు బ్లాస్ట్ వెనుక భారత్ హస్తం ఉందంటూ.. సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్!

గత నెల 23న పాకిస్థాన్ లోని లాహోర్ ప్రాంతంలో బాంబ్ బ్లాస్ట్ జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ బాంబు దాడిలో ముగ్గురు మరణించగా 24 మంది తీవ్రంగా గాయపడినట్లు పాక్ మీడియా సంస్థలు తెలియజేశాయి. అయితే ఈ విధంగా పాకిస్తాన్ లో బాంబు బ్లాస్ట్ కావడానికి ఇండియా పాత్ర ఉందని పాకిస్తాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ బాంబు దాడి వెనుక ఇండియా హస్తముందని,పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు మోయీద్ యూసుఫ్ ఆరోపించారు. ఆదివారం ఇస్లామాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో తెలిపారు.

పాకిస్తాన్ లో జరిగిన ఈ ఘటన భారత ఇంటెలిజెన్స్ సంస్థ ‘రా’ కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందని ఆయన ఆరోపించారు.అయితే ఈ బాంబు ఘటనలో నిందితులను అరెస్టు చేసే వారి దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నామని, ఆ వస్తువులను ఫోరెన్సిక్ నిపుణులను విశ్లేషిస్తే సంచలన విషయాలు బయట పడ్డాయి ఈ సందర్భంగా యూసఫ్ తెలిపారు.

అయితే ఈ బాంబు దాడి వెనుక ఉన్న వ్యక్తి ఎవరు అతని వివరాలను మాత్రం చెప్పకపోగా త్వరలోనే ఈ దాడి వెనుక ఉన్న వారు ఎవరు అనే విషయాలను పూర్తిగా వెల్లడిస్తామని పేర్కొన్నారు. అయితే ఈ బాంబు 2008వ సంవత్సరంలో ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ ఇంటి సమీపంలో పేలుడు సంభవించింది.హఫీజ్ఇంటి ముందు గుర్తుతెలియని వ్యక్తులు వాహనాన్ని ఆపి వెళ్లగా కొద్దిసేపటికే బాంబు పేలింది అని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో హఫీజ్ తప్పించుకున్నారు.

ముంబై పేలుళ్ల సూత్రధారిగా మారిన హఫీజ్ ను ఇండియాకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు. యూఎస్ జస్టిస్ డిపార్ట్‌మెంట్ కూడా అతడిని టెర్రరిస్ట్‌గా ప్రకటించింది. హఫీజ్ సయీద్‌ తలపై 10 మిలియన్ డాలర్ల రివార్డు కూడా ఉంది. ఐనప్పటికీ అతడికి పాకిస్తాన్ ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందని ఇండియాతో పాటు అమెరికా వంటి దేశాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

వీడియో వైరల్ : పుట్టినరోజు వేడుకల చీఫ్ గెస్ట్ గా వచ్చిన సింహం.. చివరికిలా?

సాధారణంగా మనం పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటే పెద్ద ఎత్తున బంధువులను, సన్నిహితులను, స్నేహితులను ఆహ్వానిస్తాము. అదేవిధంగా మన ఇంట్లో ఏవైనా అల్లారు ముద్దుగా పెంచుకొని ఉన్న పెంపుడు జంతువులను ఈ పుట్టినరోజు వేడుకలలోకి తీసుకు వస్తాము. కానీ పాకిస్తాన్ కి చెందిన ఓ మహిళ ఏకంగా తన పుట్టినరోజు వేడుకలకు ముఖ్యఅతిథిగా సింహాన్ని తీసుకువచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

సుసాన్ ఖాన్ అనే మహిళ లాహోర్ లోని ఓ హోటల్ లో జన్మదిన వేడుక జరుపుకుంది.ఈ విధంగా పుట్టినరోజు వేడుకలలో చీఫ్ గెస్ట్ గా వచ్చిన సింహాన్ని ఒక కుర్చీలో కూర్చోబెట్టి గొలుసులతో కట్టేశారు. అదే విధంగా ఈ వేడుకలకు వచ్చిన బంధువులందరూ ఆడుతూ పాడుతూ పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే తన పుట్టినరోజు వేడుకలలో జరిగిన ఓ వీడియోను సుసాన్ ఖాన్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

ఈ విధంగా వీడియోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో అసలు సమస్య మొదలైంది. ఈ వీడియో వైరల్ అవుతూ చివరికి ప్రొటెక్ట్ సేవ్ యానిమల్స్ ప్రతినిధుల కంటపడింది. దీంతో వారు ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి సదరు మహిళ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

https://www.instagram.com/p/CQWKvHPBmdl/?utm_source=ig_embed&ig_rid=12e162bd-ace6-4a3b-a95c-677234199181

ఈ వీడియో చూసిన జంతు ప్రేమికులు అందరూ తనను కఠినంగా శిక్షించాలని ఆవేదన వ్యక్తం చేశారు. నోరులేని మూగజీవాలకు మత్తు మందు ఇచ్చి తమ ఆనందం కోసం ఈ విధంగా హింసించడం చట్టపరంగా నేరమని, ఈ క్రమంలోనే తనపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పాక్ సంచలన నిర్ణయం.. రేప్ చేస్తే మగతనం మటాష్..!

ప్రపంచ దేశాల్లో రోజురోజుకు అత్యాచారాలకు సంబంధించిన ఘటనలు, లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి. ఎన్ని కొత్త చట్టాలు అమలులోకి వస్తున్నా అత్యాచార ఘటనలు, వేధింపుల కేసులు తగ్గడం లేదు. ఇలాంటి కేసులను తగ్గించడం కోసం పలు దేశాల ప్రభుత్వాలు కఠిన చట్టాలను అమలు చేస్తున్నాయి. ఆ చట్టాల ద్వారా అలాంటి ఆలోచనలు వచ్చినా ప్రజలు భయపడేలా చేస్తున్నాయి.

తాజాగా పాకిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో రెండు కొత్త ఆర్డినెన్స్ లను అమలులోకి తెచ్చింది. ఫలితంగా దేశంలో రేప్ కేసులు, లైంగిక వేధింపుల కేసులను గణనీయంగా తగ్గించాలని భావిస్తోంది. కెమికల్‌ కాస్ట్రేషన్‌ ద్వారా రేపిస్టులకు పుంసత్వాన్ని దెబ్బతీయాలని పాక్ ప్రభుత్వం భావిస్తోంది. రేప్ కేసులకు సంబంధించి విచారణ కొరకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడానికి పాక్ ప్రభుత్వం సిద్ధమైంది.

ఈ కొత్త ఆర్డినెన్స్ లకు కేబినెట్ ఆమోదం తెలిపిన అనంతరం అధ్యక్షుడు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అన్ని వయస్సుల స్త్రీలను మహిళలుగా ఈ కొత్త చట్టంలో భావిస్తారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో అమలవుతున్న నిబంధనల ప్రకారం 15 సంవత్సరాలలోపు బాలికలపై అత్యాచారం చేస్తే మాత్రమే రేప్ కేసుగా నమోదు చేసుకుంటున్నారు. పుంసత్వాన్ని దెబ్బతీయడం దోషులు చేసిన రేప్ కేసుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది.

పాకిస్తాన్ ప్రభుత్వం ఆ దేశంలో యాంటీ రేప్‌ సెల్స్‌ ను కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. గతంలో పాకిస్తాన్ లో టూ ఫింగర్‌ టెస్ట్ ద్వారా కన్యత్వాన్ని నిర్ధారించేవారు. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం ప్రస్తుతం ఈ పరీక్షలపై సైతం పాక్ ప్రభుత్వం నిషేధం విధించడం గమనార్హం.