సాధారణంగా మనం పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటే పెద్ద ఎత్తున బంధువులను, సన్నిహితులను, స్నేహితులను ఆహ్వానిస్తాము. అదేవిధంగా మన ఇంట్లో ఏవైనా అల్లారు ముద్దుగా పెంచుకొని ఉన్న పెంపుడు జంతువులను ఈ పుట్టినరోజు వేడుకలలోకి తీసుకు వస్తాము. కానీ పాకిస్తాన్ కి చెందిన ఓ మహిళ ఏకంగా తన పుట్టినరోజు వేడుకలకు ముఖ్యఅతిథిగా సింహాన్ని తీసుకువచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే…
సుసాన్ ఖాన్ అనే మహిళ లాహోర్ లోని ఓ హోటల్ లో జన్మదిన వేడుక జరుపుకుంది.ఈ విధంగా పుట్టినరోజు వేడుకలలో చీఫ్ గెస్ట్ గా వచ్చిన సింహాన్ని ఒక కుర్చీలో కూర్చోబెట్టి గొలుసులతో కట్టేశారు. అదే విధంగా ఈ వేడుకలకు వచ్చిన బంధువులందరూ ఆడుతూ పాడుతూ పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే తన పుట్టినరోజు వేడుకలలో జరిగిన ఓ వీడియోను సుసాన్ ఖాన్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
ఈ విధంగా వీడియోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో అసలు సమస్య మొదలైంది. ఈ వీడియో వైరల్ అవుతూ చివరికి ప్రొటెక్ట్ సేవ్ యానిమల్స్ ప్రతినిధుల కంటపడింది. దీంతో వారు ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి సదరు మహిళ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వీడియో చూసిన జంతు ప్రేమికులు అందరూ తనను కఠినంగా శిక్షించాలని ఆవేదన వ్యక్తం చేశారు. నోరులేని మూగజీవాలకు మత్తు మందు ఇచ్చి తమ ఆనందం కోసం ఈ విధంగా హింసించడం చట్టపరంగా నేరమని, ఈ క్రమంలోనే తనపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…