Featured

హీరో అబ్బాస్ సినిమాలు లేక.. చనిపోదాం అనుకుని..! పాపం చివరికి భార్యా పిల్లలతో దేశం విడిచి వెళ్ళిపోయారు..?!

1996 లో ఏ సెలూన్ షాప్ చూసిన అబ్బాస్ బేస్ కటింగ్ కనిపిస్తూ ఉండేది.ఆనాటి యూత్ తమకు తామే అబ్బాస్ లా ఫీలయ్యేవారు. ప్రేమదేశం సినిమా తర్వాత కాలేజీ స్టూడెంట్స్ మొత్తం హీరో అబ్బాస్ లా కటింగ్ చేయించుకున్నారంటే అతిశయోక్తి కాదు. అంతటి స్టైలిష్ కటింగ్ అబ్బాస్ చేయించుకొని తెలుగు, తమిళ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. 1996లో కుంజుమన్ నిర్మాణ సారథ్యంలో కదిర్ దర్శకత్వంలో వచ్చిన ప్రేమ దేశం చిత్రంలో అబ్బాస్, వినీత్, టబు హీరో, హీరోయిన్లుగా నటించారు.

రెండు వేరు వేరు కాలేజీలో చదువుకునే ఇద్దరు అబ్బాయిలు తమ శత్రుత్వాన్ని మరిచిపోయి ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు చివరికి ఆ అమ్మాయి ఎవరిని ప్రేమించిందన్నదే ఈ సినిమా కథ. దర్శకుడు కదీర్ ఎంచుకున్న కథ కొత్తగా లేకపోయినప్పటికీ ప్రజెంటేషన్ టేకింగ్ కొత్తగా ఉండటంతో ముఖ్యంగా అబ్బాస్ హెయిర్ స్టైల్, ఫ్యాషన్ గా కనపడటంతో యూత్ మొత్తం ఎగబడి ప్రేమదేశం సినిమాను చూశారు. తమిళంలో కాదల్ దేశంగా వచ్చిన ఈ సినిమా తెలుగులో ప్రేమ దేశం పేరుతో డబ్ అయింది. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం సినిమాను ఎక్కడికో తీసుకు వెళ్ళింది. ముస్తఫా..ముస్తఫా..అనే సాంగ్ ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో మారు మోగుతూనే ఉంది. ఐతే అబ్బాస్ పూర్తి పేరు మీర్జా అబ్బాస్ అలీ ఇతను కలకత్తాలో జన్మించాడు. తన తాతగారు ఫిరోజ్ ఖాన్ సినిమా పరిశ్రమలో 1960 నుంచి1970 వరకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రజాదరణ పొందిన నటుడు అని చెప్పవచ్చు. ఐతే 1996లో దర్శకుడు కదీర్ ఓ ప్రేమకథా చిత్రాన్ని తీయాలనుకున్నారు.

ఆ క్రమంలో ఆడిషన్స్ జరుగుతున్నాయనే విషయాన్ని తెలుసుకున్న అబ్బాస్ వాటికి హాజరు కావడం జరిగింది. అబ్బాస్ అందులో సెలెక్ట్ అయ్యారు. అలా కదిర్ దర్శకత్వంలో వచ్చిన కాదల్ దేశం అనే తమిళ చిత్రంలో హీరోగా నటించారు.ఆ తర్వాత తమిళ్,తెలుగు కన్నడ మలయాళంలో మంచి అవకాశాలు వచ్చాయి. తెలుగులో ఆరో ప్రాణం, ప్రియా ఓ ప్రియా, రాజా, అనసూయ లాంటి చిత్రాల్లో అబ్బాస్ నటించాడు. తన సినిమాలకి ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేసిన ఎరుమ్ అనే అమ్మాయిని 2000 సం.లో పెళ్లి చేసుకొని ఇద్దరూ కొడుకు, కూతుర్లకు జన్మనిచ్చారు. 2003 సంవత్సరం వచ్చేసరికి అబ్బాస్ కి సరైనటువంటి సినిమా అవకాశాలు లేకపోవడంతో.. ఒక దశలో మానసికంగా కుంగిపోయారు. మనసు కలత చెందడం తో చనిపోదాం అనుకున్నాడు.

కానీ తాను సెల్ఫ్ మోటివేటర్ గా మారి భార్య, పిల్లలతో న్యూజిలాండ్ వెళ్లి అక్కడ ఏ జాబు దొరకకపోవడంతో కొన్ని రోజులు పెట్రోల్ బంకులో పని చేశాడు. అలా తన జీవితాన్ని నెట్టుకొస్తున్న తరుణంలో.. మెల్లిగా మోటివేషనల్ స్పీకర్ గా మారి అనేక ప్రోగ్రామ్స్ చేశాడు. కొన్ని సంవత్సరాల తరువాత ఆ దేశ పౌరసత్వం తీసుకొని మంచి జీవితాన్ని ఇప్పుడు కొనసాగిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఫేస్ బుక్, ట్విట్టర్ లో తన అభిమానుల కోసం కొత్త ఫోటోలు పెడుతూ తన మనసులోని భావాలను పంచుకుంటున్నాడు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పోషకాల ఖజానా అయిన పనస గింజలు…ఎందుకు పారేస్తున్నారు?

పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…

15 hours ago

జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినొచ్చా..? నిజం ఏంటి.. వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…

15 hours ago

అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులకు భారీ షాక్..

అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…

15 hours ago

ఏపీలో ఉద్యోగులకు భారీ శుభవార్త.. పాత పెన్షన్ విధానం అమలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…

15 hours ago

చంద్ర బలంతో వారికి పట్టిందల్లా బంగారమే..! ఈ రాశుల వారికి అదృష్టం తలుపులు తెరుచుకోనున్నాయా..?

జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…

15 hours ago

గ్రీన్ టీనా.. బ్లాక్ టీనా..? బరువు తగ్గాలంటే ఏది మంచిది.. అసలు నిజం ఇదే!

నేటి జీవన విధానంలో అధిక బరువు చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారింది. పని ఒత్తిడి, శారీరక శ్రమ…

15 hours ago