Tag Archives: rains

తిరుపతి పై వరుణుడి ప్రతాపం.. జల సందిగ్ధంలో తిరుపతి వాసులు..!

తిరుమల తిరుపతి పై వరుణుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. గత మూడు రోజుల నుంచి కుండపోతగా వర్షం కురవడంతో తిరుపతి జల సందిగ్ధంలో కూరుకుపోయింది. ఈ క్రమంలోనే ప్రజలు అష్టకష్టాలు పడుతూ ఈ తిరుపతిని నువ్వే కాపాడాలి శ్రీనివాస అంటూ స్వామివారిని వేడుకుంటున్నారు. ఇక తిరుమల గిరులపై అధిక వర్షపాతం నమోదు కావడం చేత తిరుపతి నగర వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి.

కనుచూపుమేరా వరద నీరు పొంగిపొర్లడంతో ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు.ఈ క్రమంలోనే వరద ఉధృతికి ఎన్నో వాహనాలు కొట్టుకుపోగా మనుషులు పశువులు కూడా ఆ వరద నీటిలో కొట్టుకుపోయి ప్రాణాలు వదులుతున్నారు. ఇక అధిక మొత్తంలో నీరు ఇళ్లలోకి చేరడం వల్ల ఇంటిలోని సామాన్లు వరద నీటిలో కొట్టుకుపోతున్నాయి.

ఎత్తయిన చెట్లు కూలిపోవడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడి తిరుపతి మొత్తం చీకటిలో ఉండిపోయింది. ఈ విధమైనటువంటి దుర్భర పరిస్థితి నుంచి తిరుపతి నువ్వే కాపాడాలి స్వామి అంటూ ప్రజలు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా ఇలా తిరుపతిని వరద ముంచెత్తడంతో ప్రజలు కొంతమేర భయాందోళనకు గురవుతున్నారు.

ఎప్పుడో 1996 సంవత్సరంలో ఈ విధమైనటువంటి వార్తలు వచ్చాయని ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఈ విధమైనటువంటి వరద రాలేదని అక్కడి ప్రజలు తెలియజేస్తున్నారు. ఇక తిరుమల కొండలలో వరద నీరు జలపాతాలను పోలి ఉన్నప్పటికీ అధిక వర్షపాతం నమోదు కారణంగా కొండచరియలు విరిగి పడుతున్నాయి.దీంతో భక్తులు ఎవరూ కూడా తిరుమలకు రాకూడదని ఆలయ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో వర్ష సూచన కనిపిస్తోంది. బంగాళాఖాతం కేంద్రంగా 15 నుంచి ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో రాగల 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల ఈనెల 17 వరకు ఉత్తరకోస్తా, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఉపరితల ఆవర్తనం ఉత్తరాంధ్ర తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టం నుంచి 3.1 కి.మీ. నుంచి 5.8 కి.మీ. ఎత్తులో దక్షిణం వైపుగా ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంవల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురేసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ ప్రభావం తూర్పుగోదావరి జిల్లాపై అధికంగా పడే అవకాశం ఉండడంతో కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబరు: 1800 425 3077

ఏపీలో నేటి నుంచి వర్షాలు

ఏపీలో నేటి నుంచి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. పశ్చిమ దిశ నుంచి కోస్తాంధ్ర మీదుగా గాలులు వీస్తుండటంతో ఈ కారణంగా కోస్తా, రాయలసీమల్లో ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తీవ్రమవుతున్నాయి. ఆగస్టు 12న బంగాళాఖాతం నుంచి అల్పపీడనం ఏర్పాడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. సముద్ర తీరు ప్రాంతలైన మచిలీపట్నం మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.


ఈ కారణంగా కోస్తా, రాయలసీమల్లో మోస్తారు వానలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇక 13వ తేదీ తర్వాత అల్పపీడనం కారణంగా వర్షాలు ఊపందుకుంటాయని అధికారలు తెలిపారు.

ఉసురు తీసిన పిడుగులు.. 24 మంది మృతి!

దేశంలో కొన్ని ప్రాంతాలలో పిడుగు పాటు కార‌ణం గా ప్రాణన‌ష్టం సంభవిచింది. గత 24 గంటల్లో 24 మంది మృతిచెందగా, 12 మంది గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్‌, ఈస్‌ బర్ద్‌వాన్‌ జిల్లాల్లో ఏర్పాడిన పిడుగు ప్రమాదంలో మహిళ సహా నలుగురు మరణించగా మరో ఏడుగురు గాయపడ్డారు.

బీహార్‌లోని బంకా ప్రాంతంలో పడిన పిడుగుపాటు కారణంగా ఏడుగురు మరణించారు. జార్ఖండ్‌లోని పలాము జిల్లాలో పిడుగు ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోయారు. మరణించిన వారిలో ఇద్దరు చిన్నారులు, ఓ రైతు ఉన్నారు. ఇక ఒడిశా రాష్ట్రంలోని మయూర్‌భంజ్‌, భద్రక్‌, బాలాసోర్‌ జిల్లాల్లో పిడుగుపాటుతో ఐదుగురు తనువు చాలించారు.

మళ్ళీ వర్షాలు.. ఏ..ఏ జిల్లాలో అంటే!

10 రోజులుగా ముఖం చాటేసిన వర్షాలు మళ్ళీ మెుదలు కానున్నాయి. తెలంగాణలో పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ దిశగా రాష్ట్రం వైపు గాలులు వీస్తు‌న్నా‌యని, వీటి వల్ల రాబోయే రెండు రోజుల్లో తేలి‌క‌పాటి వర్షాలు కురు‌స్తా‌యని వాతావరణ కేంద్రం అధికారి వివరించారు.

రాష్ట్రంలో వర్షాలు కురిసే ప్రాంతాలను కూడా గుర్తించింది. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, వికారాబాద్‌, నారాయణపేట, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌తో సహా పలు జిల్లాలలో వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. అలాగే నైరుతి రుతుపవనాల కారణంగా మూడు రోజుల పాటు దక్షిణా భారతంలో వర్షాలు కురిసే అవకాశముందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా తమిళనాడులో మెస్తారు వర్షాలు అవకాశ ముందని తెలియజేసింది.