Tag Archives: rajendra prasad

Rajendra Prasad -Pavitra: నటుడు రాజేంద్రప్రసాద్ కు పవిత్ర మరదలు అవుతుందా… తెరపైకి వచ్చిన కొత్త బంధం?

Rajendra Prasad -Pavitra: సినిమా ఇండస్ట్రీలో నటుడు నరేష్ పవిత్ర జంట గురించి మనకు తెలిసిందే వీరిద్దరూ రిలేషన్ లో ఉంటూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని కూడా తెలిపారు.ఇలా ఇండస్ట్రీలో ఎంతో పాపులర్ అయినటువంటి నరేష్ పవిత్ర గురించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.ఇకపోతే తాజగా నటి పవిత్ర హీరో రాజేంద్రప్రసాద్ కు వరుసకు మరదలు అవుతుంది అనే విషయం వైరల్ గా మారింది.

పవిత్ర రాజేంద్రప్రసాద్ కు మరదలు కావడం ఏంటి? అసలు వీరిద్దరి మధ్య బంధుత్వం ఏంటి అనే విషయానికి వస్తే… తాజాగా నరేష్ రాజేంద్రప్రసాద్ నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అన్ని మంచి శకునములే సినిమా టైటిల్ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా రాజేంద్రప్రసాద్ నరేష్ ను దగ్గరకు తీసుకొని నిత్య పెళ్లి కొడుకుల ఉన్నారు అంటూ కామెంట్లు చేశారు.

ఇలా నరేష్ గురించి రాజేంద్రప్రసాద్ కామెంట్లు చేయడమే కాకుండా తనకు నరేష్ తమ్ముడు వరస అవుతారు అంటూ రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఇలా విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. నరేష్ నిత్య పెళ్లి కొడుకు అంటూ రాజేంద్ర ప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే కొందరు మాత్రం ఈ విషయం ప ఫన్నీ కామెంట్లు తెరపైకి తీసుకువస్తున్నారు.

Rajendra Prasad -Pavitra:మళ్లీ పెళ్లి…

రాజేంద్రప్రసాద్ మాటల ప్రకారం తనుకు నరేష్ తమ్ముడు అయితే నరేష్ తో రిలేషన్ లో ఉన్నటువంటి పవిత్ర రాజేంద్రప్రసాద్ కు మరదలు అవుతుంది అంటూ కామెంట్ లు చేస్తున్నారు. ఇలా పవిత్ర లోకేష్ బావ మరదలు అనే కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరు కూడా మళ్లీ పెళ్లి అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో భాగంగా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నటువంటి వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Rajendra Prasad: నరేష్ నిత్య పెళ్లి కొడుకు… నరేష్ పై సెటైర్లు వేసిన నటుడు రాజేంద్రప్రసాద్!

Rajendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని నటి కిరీటి బిరుదుతో ఎంతో గౌరవాన్ని అందుకున్నటువంటి నటుడు రాజేంద్రప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన తాజాగా సంతోష్ శోభన్ మాళవిక నాయర్ జంటగా నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన అన్ని మంచి శకునములే సినిమా ఈవెంట్లో పాల్గొన్నారు.

ఈ సినిమా షూటింగ్ పనులన్నింటిని పూర్తి చేసుకొని త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోని ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ విడుదల చేశారు. ఈ టైటిల్ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా పలువురు సినీ సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు.ఇక ఈ సినిమా వేడుకలో భాగంగా నటుడు రాజేంద్రప్రసాద్ కూడా పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ నటుడు నరేష్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

నటుడు నరేష్ రాజేంద్రప్రసాద్ ఇద్దరూ కూడా రెండు కత్తులు లాంటి వారు అంటూ మీడియా ప్రతినిధి చెప్పగా వెంటనే స్పందించిన రాజేంద్రప్రసాద్ తాను నరేష్ లాంటి కత్తిని కాదనీ అసలు సిసలైన కత్తి నరేష్ అని నేను కేవలం ఒర మాత్రమేనని తెలిపారు.ఇక నరేష్ ను దగ్గరికి తీసుకుని చూడండి పెళ్లి కొడుకుల తయారయ్యారుగా అంటూ రాజేంద్రప్రసాద్ చెప్పడంతో నేను పెళ్ళికొడుకుల తయారవ్వడం ఏంటి? నేను ఎప్పుడు పెళ్లి కొడుకుని అంటూ నరేష్ తెలిపారు.

Rajendra Prasad:తమ్ముడు లాంటివాడు…


ఇక ఈ మాటలకు రాజేంద్రప్రసాద్ అవును రా నేను చెప్పడం మర్చిపోయాను నువ్వు నిత్య పెళ్లి కొడుకు అంటూ నరేష్ పై సెటైర్లు వేశారు.అయితే నరేష్ ఈ వ్యాఖ్యలను సరదాగా తీసుకున్నారు ఇక నరేష్ గురించి మాట్లాడుతూ తనకు నరేష్ తమ్ముడు లాంటివారు అంటూ రాజేంద్రప్రసాద్ మాట్లాడారు ఇలా నరేష్ గురించి రాజేంద్రప్రసాద్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Rajendra prasad: కూతురితో మాటలు లేవు.. వదిలేసి వెళ్ళిపోయింది ఎమోషనల్ అయిన రాజేంద్రప్రసాద్!

Rajendra prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి హీరోగా అందరిని సందడి చేశారు. ఇక ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ విధంగా ఎంతోమంది యంగ్ హీరో హీరోయిన్లకు తండ్రి పాత్రలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి రాజేంద్రప్రసాద్ గతంలో ఒక సినిమా వేడుకలో భాగంగా తన కుమార్తె గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈయన గత కొద్ది రోజుల క్రితం బేవర్స్ సినిమా వేడుకలో పాల్గొన్నారు.

ఈ వేడుకలో భాగంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ తన కూతురి గురించి పలు విషయాలు తెలియజేశారు.ఈ సినిమాలో సుద్దాల అశోక్ తేజ తల్లి గురించి ఓ అద్భుతమైన పాట పాడారు ఈ పాట గురించి ఈయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తన తల్లిని తన కూతురిలో చూసుకుంటారు.నేను పది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నా తల్లి మరణించింది అందరిలా నేను కూడా నా కూతురిలో నా తల్లిని చూసుకున్నాను.

Rajendra prasad: తనని వదిలి వెళ్ళిపోయింది…

ఇలా నా తల్లిగా భావించే నా కూతురు ఒక వ్యక్తిని ప్రేమించి అతనితో వెళ్లిపోయింది. అప్పటినుంచి తనతో నాకు మాటలు లేవని ఇలా అమ్మలా చూసుకునే కూతురు కూడా తన నుంచి దూరంగా వెళ్లిపోయింది అంటూ ఈ సందర్భంగా ఈయన తన కూతురి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఇలా కూతురు గురించి రాజేంద్రప్రసాద్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

NTR -Rajendra Prasad: సీనియర్ ఎన్టీఆర్ పాత్రకు రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ చెప్పారని మీకు తెలుసా.. ఏ సినిమా అంటే?

NTR -Rajendra Prasad: నట కిరీటి రాజేంద్రప్రసాద్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి ఆదరణ ఉందో మనకు తెలిసిందే. ఈయన నిమ్మకూరు సమీపంలో దొండపాడు గ్రామంలో జన్మించారు.ఇక నిమ్మకూరు స్వర్గీయ నందమూరి తారకరామారావు స్వస్థలం చిన్నప్పటినుంచి ఆయనను చూస్తూ పెరిగిన రాజేంద్రప్రసాద్ కు సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఆసక్తి కలిగింది. ఎన్టీఆర్ సహాయంతోనే రాజేంద్రప్రసాద్ ఇండస్ట్రీలోకి వచ్చానని ఎన్నోసార్లు వెల్లడించారు.

ఈ విధంగా చెన్నైలోని ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణలో కోచింగ్ తీసుకున్న రాజేంద్రప్రసాద్ అనంతరం అవకాశాల కోసం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇలా మొదట్లో ఈయన డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అవకాశం అందుకొని అనంతరం నటుడిగా అవకాశాలు అందుకున్నారు. ఎలాంటి పాత్రలనైనా ఎంతో అవలీలగా నటించే రాజేంద్రప్రసాద్ అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో అగ్ర హీరోగా పేరు సంపాదించుకోవడమే కాకుండా ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా వైజయంతి మూవీస్ బ్యానర్ నిర్మాత అశ్విని దత్ ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన రాజేంద్రప్రసాద్ గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన మహానటి సినిమాలో ఎన్టీఆర్ ఏఎన్నార్ పాత్రలు కూడా కనపడతాయి. అయితే ఏఎన్ఆర్ పాత్ర నిడివి ఎక్కువగా ఉన్నప్పటికీ ఎన్టీఆర్ పాత్రలో కేవలం రెండు డైలాగులు మాత్రమే ఉంటాయి. అవి కూడా వెనక మాత్రమే కనపడతాయని తెలిపారు.

NTR -Rajendra Prasad: మహానటి సినిమా కోసం డబ్బింగ్ చెప్పిన నట కిరీటి…

ఇలా మహానటి సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు ఉన్న రెండు డైలాగులకు ఎన్టీఆర్ తరహాలోని రాజేంద్రప్రసాద్ ఎంతో చక్కగా డబ్బింగ్ చెప్పారని ఈ సందర్భంగా అశ్విని దత్ పేర్కొన్నారు.ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా అశ్విని దత్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈయన నిర్మాణంలో వచ్చిన సీతారామం బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

Actress Rambha: మనస్పర్ధల వల్ల విడాకుల వరకు వెళ్లిన రంభ.. వీరి కాపురాన్ని నిలబెట్టిన స్టార్ డైరెక్టర్?

Actress Rambha: నటి కిరీటి రాజేంద్రప్రసాద్ హీరోగా ఆ ఒక్కటి అడక్కు సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు నటి రంభ. ఈమె స్వస్థలం విజయవాడ ఈమె అసలు పేరు విజయలక్ష్మి.ఇలా తెలుగమ్మాయిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన రంభ మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఈమెకు తెలుగులో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి.

ఇకపోతే రంభ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఆగ్ర హీరోలైన చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ వంటి తదితర హీరోల సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఇలా దాదాపు 7, 8 సంవత్సరాలు ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగిన రంభ కెనడాకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో ప్రేమలో పడి అతనిని పెళ్లి చేసుకుంది.

ఈ విధంగా ఈ దంపతులు చాలా సంవత్సరాల పాటు అన్యోన్యంగా ఉన్నారు. ఈ దంపతులకు ముగ్గురు సంతానం.భార్య భర్తలన్న తర్వాత వారి మధ్య గొడవలు రావడం సర్వసాధారణం అయితే ఇలాంటి గొడవలు వచ్చినప్పుడు సామరస్యంగా పరిష్కరించుకుంటే వారి వైవాహిక జీవితం ఎంతో సంతోషంతో గడిచిపోతుంది. కానీ తన భర్తతో వచ్చిన విభేదాల వల్ల రంభ ఏకంగా విడాకులు తీసుకొని విడిపోవాలని నిర్ణయం తీసుకుంది.

Actress Rambha: భవిష్యత్తు గురించి వివరించిన రాఘవేంద్రరావు…

ఈ క్రమంలోనే ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసిన ఈమె ప్రతినెల భరణం కింద తనకు ఐదు లక్షల కావాలని పిటిషన్ లో పేర్కొన్నారు.ఇలా ముగ్గురు పిల్లల పోషణ భారం అవుతుందని ఈమె మరికొంత డబ్బును కూడా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.ఈ విధంగా రంభ విడాకులు తీసుకొని విడిపోవడానికి సిద్ధమైందని తెలుసుకున్న ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు రంభతో మాట్లాడి తనకు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో వివరించారట. భర్తతో విడిపోయి ముగ్గురు పిల్లల పోషణ వారి భవిష్యత్తు చాలా ఇబ్బందికరంగా మారుతుందని చెప్పడమే కాకుండా భార్య భర్తల మధ్య ఈ చిన్నపాటి మనస్పర్ధలు సర్వసాధారణమే అని ఆయన నచ్చ చెప్పడం వల్ల రంభ విడాకులు వెనక్కి తీసుకుందని సమాచారం. ఇలా రాఘవేంద్రరావు రంభ వైవాహిక జీవితాన్ని నిలబెట్టారని తెలుస్తోంది.

Rajendra Prasad: మధ్యలో నీ గోలేంటమ్మా… అంటూ యాంకర్ మంజూష పై అసహనం వ్యక్తం చేసిన రాజేంద్రప్రసాద్..!

Rajendra Prasad: అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్, విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ఎఫ్ 3.ఈ సినిమా గత నెల 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చే మొదటి షో తోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఇలా ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టడంతో చిత్రబృందం సక్సెస్ పార్టీని ఎంతో ఘనంగా నిర్వహించారు.

Rajendra Prasad: మధ్యలో నీ గోలేంటమ్మా… అంటూ యాంకర్ మంజూష పై అసహనం వ్యక్తం చేసిన రాజేంద్రప్రసాద్..!

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు వేదికపై వెళ్లి మాట్లాడుతూ సినిమాతో వారికి ఉన్న అనుబంధం గురించి తెలియజేశారు. ఈ క్రమంలోనే నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ను వేదికపైకి ఆహ్వానించారు. ఇకపోతే ఈయన వేదికపైకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో ఫ్రీ రిలీజ్ వేడుకలో భాగంగా రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్ ప్లే చేశారు.

Rajendra Prasad: మధ్యలో నీ గోలేంటమ్మా… అంటూ యాంకర్ మంజూష పై అసహనం వ్యక్తం చేసిన రాజేంద్రప్రసాద్..!

ఇక వేదిక పైకి వెళ్లిన రాజేంద్రప్రసాద్ మొహానికి ఖర్చీఫ్ కట్టుకొని వెళ్లగా.. యాంకర్ మంజూష మొహానికి ఖర్చీఫ్ ఎందుకు తీసేయండని చెప్పబోయింది. దీంతో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ… ఆగవమ్మ మధ్యలో నీ గోల ఏంటి… ముందు మమ్మల్ని మాట్లాడనీవ్వు.. ఇక్కడ మా గోలే సరిపోవడం లేదు అంటూ తన పై అసహనం వ్యక్తం చేశారు.

యాంకర్ పై రాజేంద్ర ప్రసాద్ అసహనం..

ఈ విధంగా రాజేంద్రప్రసాద్ మంజూష పై అసహనం వ్యక్తం చేయడంతో యాంకర్ అక్కడి నుంచి పక్కకు వెళ్లారు. ఇక పోతే తాను ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా సినిమా హిట్ కాకపోతే నా మొహం మీకు చూపించనని చేసిన వ్యాఖ్యలు మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే వేదికపైకి వెళ్లి ఆయన అందరికీ తన మొహాన్ని చూపించారు. ఇలా నేను నా మొహం మీకు చూపిస్తున్నాను అంటే అర్థం ఏంటి ఈ సినిమా హిట్ అయింది అంటూ వేదికపై రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు.

Evv Satyanarayana: 50 లక్షల్లో సినిమా తీస్తే రెండు కోట్లు రాబట్టిన ఈవీవీ సినిమా ఏంటో తెలుసా?

Jambalakadipamba: ఈదర వీర వెంకట సత్యనారాయణ (ఈవీవీ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.bసినిమా పై మక్కువతో కెరియర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా అడుగుపెట్టిన ఈవీవీ ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న సమయంలో ఈయన జంబలకిడిపంబ రాసి ఆ కథను ఆంధ్రజ్యోతి సపరివార పత్రికకు పంపించారు. ఈ కథ చూసిన పత్రికా సమస్త వారు ఇది కూడా ఒక కథేనా అంటూ ఆ కథని వెనక్కి పంపించారు.

ఇలా ఈ కథతో ఈవీవీ అద్భుతమైన సినిమాలు తీయాలని దర్శకుడిగా తనకు ఒక మంచి గుర్తింపు వచ్చిన తర్వాత ఈ సినిమా చేయాలని భావించారు. అయితే ఈ కథ రాసేటప్పుడు ఇందులో హీరోగా రాజేంద్ర ప్రసాద్ ను అనుకుని రాశారు. ఇక డైరెక్టర్ గా తనకంటూ ఓ గుర్తింపు వచ్చిన తర్వాత ఈ సినిమా చేయటానికి సన్నాహాలు చేశారు. అయితే ఆ సమయంలో రాజేంద్రప్రసాద్ బిజీగా ఉండటం వల్ల నరేష్ ను హీరోగా తీసుకున్నారు.

ఇక హీరోయిన్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఎవరూ కుదరకపోవడంతో ఆమనిని ఎంపిక చేశారు. డివివి దానయ్య, ఆచంట గోపినాథ్ నిర్మాతలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నెల రోజుల వ్యవధిలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఈ సినిమాను 1992 జులై 12వ తేదీ ఈ సినిమాని విడుదల చేశారు.

100 రోజుల వేడుకకు హాజరైన రాజేంద్రప్రసాద్..

ఇలా 50 లక్షల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రెండు కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ అప్పట్లో ఓ సెన్సేషన్ గా మిగిలిపోయింది. ఆడవారు మగవారిగా మగవారు ఆడవారుగా నటించడంతో ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంది. ఈ సినిమా హిట్ కావడంతో హీరోయిన్ ఆమనికి వరుస అవకాశాలు వచ్చాయి. ఈ సినిమా 100 రోజుల వేడుకకు ముఖ్య అతిథిగా హీరో రాజేంద్రప్రసాద్ హాజరయ్యారు.

రజిని అంటే రాజేంద్రప్రసాద్ కు ఎందుకు అంత ఇంట్రెస్ట్..? వారిద్దరి మధ్య ఏం జరిగింది..?

‘అహ నా పెళ్లంట’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరం లేదు. 1987 లో విడుదలైన ఈ సినిమా ఒక ట్రెండ్ ను సెట్ చేసింది. అయితే ఇందులో హీరో, హీరోయిన్లుగా రాజేంద్రప్రసాద్, రజిని నటించిన విషయం తెలిసిందే. ఆ ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ, రొమాన్స్‌ ఎంతగానో కుదరింది. దీంతోనే వారిద్దరి పెయిర్ ఎంతగానో హిట్ అయింది.

ఆ సినిమా తర్వాత ఎన్నో చిత్రాల్లో వీరిద్దరు కలిసి నటించారు. ప్రస్తుతం ఒక సినిమాలో హీరో, హీరోయిన్ లు హిట్ కొట్టారంటే.. అదే పెయిర్ ను కొనసాగించాలని దర్శక, నిర్మాతలు చూస్తుంటారు. అంతేకాకుండా వాళ్ల మధ్య ఎదో ఉందని.. సోషల్ మీడియాలో ఎన్నో కథనాలు వస్తుంటాయి. ఈ ఆచారం అప్పట్లో కూడా ఉండేదట. వాళ్లిద్దరు కలిసి మాట్లాడుకున్నా ఏదో ఉందని అనుకునే వారట. ఎన్నో కథనాలను పత్రికల్లో రాశారని రజిని చెప్పుకొచ్చారు.

ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. రాజేంద్ర ప్రసాద్ తో కొంత మంది హీరోయిన్లు నటించమని చెప్పినప్పుడు అతనితో నటించడానికి రజిని ముందుకు వచ్చి ఆయ‌న‌తో క‌లిసి న‌టించ‌డానికి తనను అడిగిన‌ప్పుడు తనకు చిన్నా, పెద్దా అనే తేడా లేదు. ఒక‌ప్పుడు నేనూ కొత్తే, నేనూ చిన్నే కనుక రాజేంద్ర ప్రసాద్ గారితో సినిమా చేస్తాన‌ని చెప్పి అతనితో సినిమాలు చేశానని చెప్పుకొచ్చారు.

అందుకే రాంజేంద్రప్రసాద్ కు తను అన్నా.. తన ఫ్యామిలీ అన్న ఎంతో అభిమానం అంటూ చెప్పారు. తను ఎప్పుడూ తన అందానికి గల రహస్యం ఏంటి? అని అడిగేవారని.. మీరు ఏం తింటారు? అంటూ అడిగేవారని తెలిపారు. నా డైట్ ఏంటి.. ఏం తింటుంది అంటూ.. మా అమ్మను అడిగేవారని తెలిపింది. దానికి సమాధానంగా రజిని తల్లి … ప్ర‌త్యేకంగా త‌నేమీ తిన‌దు బాబు అంటూ చెప్పేదని రజిని చెప్పారు. ఇలా వీరిద్దరు ఎంతో చనువుగాఉండటంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి అని ఓ సందర్భంలో తెలియజేశారు.

కోడితో కామెడీ చేసిన జంధ్యాల సినిమా “అహ! నా పెళ్ళంట” వెనక ఆసక్తికర విషయాలు ఎన్నో.!!

ఒకరోజు డి.రామానాయుడు దినపత్రికలో వచ్చిన ఒక జోక్ చదివి చాలాసేపు నవ్వ సాగారు. ఆయన ఎప్పుడు తీయని హాస్య కథ చిత్రం తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. ఆ క్రమంలో వెంటనే జంధ్యాలకు ఫోన్ చేసి ఒక మంచి హాస్య చిత్రం చేసి పెడతావా అని అడగడం జరిగింది. అప్పుడు జంధ్యాల సరే అనడంతో.. రచయిత ఆదివిష్ణు రాసిన హాస్య కథ అప్పటికే ఒక పత్రికలో సీరియల్ గా వస్తుంది. దానికి కొంచెం ప్రేమ కథను జోడించి.. ఆ కథను ముందు రామానాయుడుకు చెప్పడం జరిగింది. ఈ కథ నాకు కాదు సురేష్ బాబుకు చెప్పండి అతను ఓకే అంటే సినిమా మొదలుపెడదాం అని చెప్పడం జరిగింది. ఆ క్రమంలో కథ సురేష్ బాబుకు చెప్పడంతో ఆయనకు బాగా నచ్చి సినిమా ప్రారంభిద్దామని చెప్పాడు.

దర్శకుడు జంధ్యాల “సురేష్ ప్రొడక్షన్స్” లో కథారచయితగా పనిచేసినప్పటికీ దర్శకత్వం చేసే అవకాశం రాలేదు. కాని “అహ నా పెళ్ళంట” సినిమాతో దర్శకత్వం చేసే అవకాశం కుదిరింది. అలా సినిమా కథ.. ఫైనల్ అయిన తర్వాత షూటింగ్ కి వెళ్లేముందు నటీనటుల ఎంపిక ప్రక్రియ మొదలయ్యింది. ఈ హాస్య కథ నచ్చడంతో హీరోగా చేయడానికి వెంకటేష్ ముందుకు వచ్చారు. కానీ హాస్య కథ చిత్రం వెంకటేష్ కు కుదరదని చెప్పడంతో ఆయన డ్రాప్ అయ్యారు.

అప్పటికే “రెండు రెళ్ళు ఆరు” చిత్రంలో హీరోగా నటించిన రాజేంద్ర ప్రసాద్ ను తీసుకున్నారు. హీరోయిన్ గా రజిని, హీరో తండ్రిగా నూతన్ ప్రసాద్ ను తీసుకున్నారు. ఇక సినిమాలో అత్యంత ప్రజాదరణ పొందిన పాత్ర పిసినారి లక్ష్మిపతి పాత్ర. నిజంగా పిసినారి అనే పదం వచ్చినట్లయితే చాలామంది ఈ సినిమాలోని కోట శ్రీనివాసరావు చేసిన పిసినారితనాన్ని గుర్తు చేస్తూ ఉంటారు.

నిజంగా ఈ పాత్రకు ముందుగా రావు గోపాల్ రావు అనుకున్నప్పటికీ తర్వాత కోట శ్రీనివాసరావు ను తీసుకున్నారు. ఈ పాత్రకు సంబంధించిన వేషధారణ పూర్తిగా జంధ్యాల గారే శ్రద్ధ తీసుకున్నారు. ముతక పంచే, పొట్టి జుట్టు, పగిలిన కళ్ళజోడులో ఒక అద్దాన్ని పగులగొట్టి కోట శ్రీనివాసరావు కి ఇచ్చారు. బ్రతికున్న కోడిని వేలాడదీసి దానిని చూస్తూ కోడికూర తింటున్నానని కోట శ్రీనివాసరావు, సుత్తి వీరభద్రరావుకి చెప్పడం నిజంగా హాస్యానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు.

ఇకపోతే ఆయన పని మనిషిగా బ్రహ్మానందం నటించడం జరిగింది. ముందుగా ఈ పాత్రకు సుత్తివేలును అనుకున్నప్పటికీ ఆయన డేట్స్ ఖాళీ లేకపోవడంతో అత్తిలిలో ఒక అధ్యాపకునిగా పని చేస్తున్న బ్రహ్మానందం‌ ను ఇంతకు ముందే.. ఒక సమావేశంలో హాస్యం పండించడం జంధ్యాల చూశారు. సుత్తివేలు అందుబాటులో లేకపోవడంతో వెంటనే బ్రహ్మానందమును పిలిపించి.. ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు ఇంట్లోపని వాడిపాత్రను ఆయనతో‌ చేయించడం జరిగింది.

డిప్ప కటింగ్ తో నత్తి పలుకుతూ బ్రహ్మానందం చెప్పే సంభాషణలు కుర్చీలో కూర్చున్న ప్రేక్షకుడు కడుపుబ్బ నవ్విస్తాయి. “అహ నా పెళ్ళంట” చిత్రం షూటింగ్ హైదరాబాద్ దాని చుట్టూ ఉన్న దేవర, యామిజల ప్రాంతాలలో చేయడం జరిగింది. కొన్ని పాటల నిమిత్తం కేరళలో షూటింగ్ జరిపారు. దాదాపు18 లక్షల రూపాయలు ఈ సినిమాకి ఖర్చు పెట్టారు. అలా ఏకధాటిగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా 1987 నవంబర్ 27న విడుదలై ఘన విజయాన్ని సాధించింది. హాస్యరస చిత్రాల్లో “అహ నా పెళ్ళంట” సినిమా ముందువరుసలో ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.