Rajendra Prasad: మధ్యలో నీ గోలేంటమ్మా… అంటూ యాంకర్ మంజూష పై అసహనం వ్యక్తం చేసిన రాజేంద్రప్రసాద్..!
Rajendra Prasad: అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్, విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ఎఫ్ 3.ఈ సినిమా గత నెల 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చే మొదటి షో తోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఇలా ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టడంతో చిత్రబృందం సక్సెస్ పార్టీని ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు వేదికపై వెళ్లి మాట్లాడుతూ సినిమాతో వారికి ఉన్న అనుబంధం గురించి తెలియజేశారు. ఈ క్రమంలోనే నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ను వేదికపైకి ఆహ్వానించారు. ఇకపోతే ఈయన వేదికపైకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో ఫ్రీ రిలీజ్ వేడుకలో భాగంగా రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్ ప్లే చేశారు.
ఇక వేదిక పైకి వెళ్లిన రాజేంద్రప్రసాద్ మొహానికి ఖర్చీఫ్ కట్టుకొని వెళ్లగా.. యాంకర్ మంజూష మొహానికి ఖర్చీఫ్ ఎందుకు తీసేయండని చెప్పబోయింది. దీంతో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ… ఆగవమ్మ మధ్యలో నీ గోల ఏంటి… ముందు మమ్మల్ని మాట్లాడనీవ్వు.. ఇక్కడ మా గోలే సరిపోవడం లేదు అంటూ తన పై అసహనం వ్యక్తం చేశారు.
ఈ విధంగా రాజేంద్రప్రసాద్ మంజూష పై అసహనం వ్యక్తం చేయడంతో యాంకర్ అక్కడి నుంచి పక్కకు వెళ్లారు. ఇక పోతే తాను ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా సినిమా హిట్ కాకపోతే నా మొహం మీకు చూపించనని చేసిన వ్యాఖ్యలు మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే వేదికపైకి వెళ్లి ఆయన అందరికీ తన మొహాన్ని చూపించారు. ఇలా నేను నా మొహం మీకు చూపిస్తున్నాను అంటే అర్థం ఏంటి ఈ సినిమా హిట్ అయింది అంటూ వేదికపై రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…