Actress Rambha: నటి కిరీటి రాజేంద్రప్రసాద్ హీరోగా ఆ ఒక్కటి అడక్కు సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు నటి రంభ. ఈమె స్వస్థలం విజయవాడ ఈమె అసలు పేరు విజయలక్ష్మి.ఇలా తెలుగమ్మాయిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన రంభ మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఈమెకు తెలుగులో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి.
ఇకపోతే రంభ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఆగ్ర హీరోలైన చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ వంటి తదితర హీరోల సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఇలా దాదాపు 7, 8 సంవత్సరాలు ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగిన రంభ కెనడాకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో ప్రేమలో పడి అతనిని పెళ్లి చేసుకుంది.
ఈ విధంగా ఈ దంపతులు చాలా సంవత్సరాల పాటు అన్యోన్యంగా ఉన్నారు. ఈ దంపతులకు ముగ్గురు సంతానం.భార్య భర్తలన్న తర్వాత వారి మధ్య గొడవలు రావడం సర్వసాధారణం అయితే ఇలాంటి గొడవలు వచ్చినప్పుడు సామరస్యంగా పరిష్కరించుకుంటే వారి వైవాహిక జీవితం ఎంతో సంతోషంతో గడిచిపోతుంది. కానీ తన భర్తతో వచ్చిన విభేదాల వల్ల రంభ ఏకంగా విడాకులు తీసుకొని విడిపోవాలని నిర్ణయం తీసుకుంది.
ఈ క్రమంలోనే ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసిన ఈమె ప్రతినెల భరణం కింద తనకు ఐదు లక్షల కావాలని పిటిషన్ లో పేర్కొన్నారు.ఇలా ముగ్గురు పిల్లల పోషణ భారం అవుతుందని ఈమె మరికొంత డబ్బును కూడా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.ఈ విధంగా రంభ విడాకులు తీసుకొని విడిపోవడానికి సిద్ధమైందని తెలుసుకున్న ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు రంభతో మాట్లాడి తనకు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో వివరించారట. భర్తతో విడిపోయి ముగ్గురు పిల్లల పోషణ వారి భవిష్యత్తు చాలా ఇబ్బందికరంగా మారుతుందని చెప్పడమే కాకుండా భార్య భర్తల మధ్య ఈ చిన్నపాటి మనస్పర్ధలు సర్వసాధారణమే అని ఆయన నచ్చ చెప్పడం వల్ల రంభ విడాకులు వెనక్కి తీసుకుందని సమాచారం. ఇలా రాఘవేంద్రరావు రంభ వైవాహిక జీవితాన్ని నిలబెట్టారని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…