Jeevitha Rajasekhar: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా,దర్శకురాలిగా నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జీవిత రాజశేఖర్ ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల పోటీ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శనివారం తెలంగాణలో బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సారధ్యంలో ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న జీవిత తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం ఈమె మాట్లాడుతూ తాను ఇద్దరు బిడ్డల తల్లిగా ఒక మహిళకు ఎన్ని కష్టాలు ఉంటాయో నాకు తెలుసు. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి పాలన అందిస్తుందో మనందరికీ తెలిసిందే.అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన దేశాన్ని కాపాడగలిగే వ్యక్తి అని తాను బిజెపి పార్టీలోకి చేరానని ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు.
ఈ క్రమంలోనే అధిష్టానం ఆదేశిస్తే తాను వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని జీవిత వెల్లడించారు. వచ్చే ఎన్నికలలో ఏ ప్రాంతం నుంచి అయినా తను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని,పార్టీ తరఫున క్రియాశీలకంగా మారి పార్టీ కార్యక్రమాలకు తాను విధిగా హాజరవుతానని ఈ సందర్భంగా వెల్లడించారు.
బీజెపీ పార్టీలోకి జీవిత రాజశేఖర్ బండి సంజయ్ కు మద్దతుగా తాను ఈ పాదయాత్రలో పాల్గొన్నానని ఈమె వెల్లడించారు. ఈ విధంగా తెలంగాణ రాజకీయాల గురించి నటి జీవిత రాజశేఖర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.మరి ఈమె కోరిక మేరకు వచ్చే ఎన్నికలలో బిజెపి పార్టీ తరఫున పోటీ చేయడానికి అధిష్టానం అనుమతి తెలుపుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…