Movie News

Evv Satyanarayana: 50 లక్షల్లో సినిమా తీస్తే రెండు కోట్లు రాబట్టిన ఈవీవీ సినిమా ఏంటో తెలుసా?

Jambalakadipamba: ఈదర వీర వెంకట సత్యనారాయణ (ఈవీవీ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.bసినిమా పై మక్కువతో కెరియర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా అడుగుపెట్టిన ఈవీవీ ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న సమయంలో ఈయన జంబలకిడిపంబ రాసి ఆ కథను ఆంధ్రజ్యోతి సపరివార పత్రికకు పంపించారు. ఈ కథ చూసిన పత్రికా సమస్త వారు ఇది కూడా ఒక కథేనా అంటూ ఆ కథని వెనక్కి పంపించారు.

ఇలా ఈ కథతో ఈవీవీ అద్భుతమైన సినిమాలు తీయాలని దర్శకుడిగా తనకు ఒక మంచి గుర్తింపు వచ్చిన తర్వాత ఈ సినిమా చేయాలని భావించారు. అయితే ఈ కథ రాసేటప్పుడు ఇందులో హీరోగా రాజేంద్ర ప్రసాద్ ను అనుకుని రాశారు. ఇక డైరెక్టర్ గా తనకంటూ ఓ గుర్తింపు వచ్చిన తర్వాత ఈ సినిమా చేయటానికి సన్నాహాలు చేశారు. అయితే ఆ సమయంలో రాజేంద్రప్రసాద్ బిజీగా ఉండటం వల్ల నరేష్ ను హీరోగా తీసుకున్నారు.

ఇక హీరోయిన్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఎవరూ కుదరకపోవడంతో ఆమనిని ఎంపిక చేశారు. డివివి దానయ్య, ఆచంట గోపినాథ్ నిర్మాతలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నెల రోజుల వ్యవధిలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఈ సినిమాను 1992 జులై 12వ తేదీ ఈ సినిమాని విడుదల చేశారు.

100 రోజుల వేడుకకు హాజరైన రాజేంద్రప్రసాద్..

ఇలా 50 లక్షల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రెండు కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ అప్పట్లో ఓ సెన్సేషన్ గా మిగిలిపోయింది. ఆడవారు మగవారిగా మగవారు ఆడవారుగా నటించడంతో ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంది. ఈ సినిమా హిట్ కావడంతో హీరోయిన్ ఆమనికి వరుస అవకాశాలు వచ్చాయి. ఈ సినిమా 100 రోజుల వేడుకకు ముఖ్య అతిథిగా హీరో రాజేంద్రప్రసాద్ హాజరయ్యారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago