Tag Archives: remuneration

ఆ సినిమాకు భారీగా పారితోషికం తీసుకుంటున్న పవన్ కళ్యాణ్.. కారణం ఎంటంటే..!

తెలుగు సినీ పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. వారికి సంబంధించి ఏ చిన్న వార్త బయటకు వచ్చినా.. క్షణాల్లో వైరల్ గా మారుతుంది. అంతలా వారికి ఫ్యాన్స్ ఉంటారు. కొన్ని సంవత్సరాల వరకు రాజకీయంలో తన జాతకాన్ని పరీక్షించుకున్న పవర్ స్టార్.. తాజాగ తన రెండో ఇన్నింగ్స్ ను మొదలు పెట్టారు. తిరిగి సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత అతడి సినిమాలో నటించడానికి తీసుకునే రెమ్యూనరేషన్ భారీగా ఉందంటూ సినీ వర్గాల టాక్ .

అయితే ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు పవర్ స్టార్ దాదాపు రూ. 60 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అడిగినట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు తీసిన సినిమాలకు పవర్ స్టార్ రూ.50 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నటించే ఈ సినిమాకు ఎక్కువగా పారితోషికం డిమాండ్ చేయడానికి కారణం ఏంటంటే.. డైరెక్టర్ హరీష్ శంకర్ అతడికి ఎక్కువగా కాల్ షీట్లు ఇచ్చినట్లు సమాచారం.

అంత్యంత సాధ్యమైనంత వరకు సినిమాను తొందరగా ఫినిష్ చేయడానికే ఇలా డైరెక్టర్ కాల్ షీట్లు ఇచ్చారట. అతడి చేతిలో ఇప్పటికే మూడు నుంచి నాలుగు సినిమాల వరకు ఉండటంతో.. తొందరగా షూటింగ్ కంప్లీట్ చేసి.. వచ్చే జనవరిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ ప్రతినిధులు ప్రణాళిక చేసుకున్నారు. అందుకోసమే ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ పారితోషికం ఏకంగా 10 కోట్లు పెంచినట్లు తెలుస్తోంది.

ఆమె ఏం చేస్తుందని 2 కోట్లు ? మళ్ళీ నలుగురు బాడీగార్డ్స్.. అంటూ మండిపడ్డ నిర్మాత నట్టి కుమార్..!

నిర్మాత నట్టి కుమార్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వివాదాలకు కారణం అవుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తున్న నట్టికుమార్ గతంలో చిరంజీవి ఇంట్లో పలువురు సినిమా పెద్దలతో జరిగిన సమావేశం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీలోని సమస్యల గురించి సమావేశం అయితే అందరిని అడిగి అందరి సమస్యలను తెలుసుకోవాలని కానీ చిరంజీవి అలా చేయకుండా కేవలం కొందరితో మాత్రమే సమావేశమయ్యారని, అసలు అది ఏ మీటింగో ఏమో ఎవరికి తెలియదు అంటూ అప్పుడు ఈ సమావేశం పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉండగా తాజాగా నట్టికుమార్ థియేటర్స్ రెంట్, హీరోయిన్స్ రెమ్యూనరేషన్ పై కూడా ఇదే స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ రేట్లు ఎంత పెరిగినా థియేటర్స్ రెంట్ మాత్రం అంతే ఉంటుంది. ఒక సినిమాను తెరకెక్కిస్తే ఐదుగురిని మనం పోషిస్తున్నట్లనీ, ఈ సందర్భంగా నిర్మాత నట్టి కుమార్ తెలియజేశారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం హీరోయిన్ల రెమ్యూనరేషన్లు గురించి కూడా ఈయన మాట్లాడారు.

ఒకప్పుడు ఎన్నో అద్భుతమైన సినిమాలలో ఎన్నో సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో నటించినటువంటి సౌందర్య గారికి 30 నుంచి 40 లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చేవారని, ఇప్పుడు నిన్నగాక మొన్న ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్ కి ఏకంగా రెండు కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా రెండు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ పూజా హెగ్డే పై వ్యాఖ్యానించారు నట్టి కుమార్.

రెమ్యూనరేషన్ మాత్రమే కాకుండా వారికి బాడీగార్డులు, హీరోయిన్ కి ప్రత్యేకమైన కారవాన్, వారి అసిస్టెంట్లకు ఒక కారవాన్ ఇలా కోట్లకు కోట్లు ఖర్చు పెడుతున్నారంటూ ఆయన ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. ఇదంతా ప్రజల సొమ్ము, ఈ పద్ధతిలో మార్పు రావాలని ఈ సందర్భంగా నటి నిర్మాత హీరోయిన్ల రెమ్యూనరేషన్ పై ఈ విధంగా స్పందించారు.

టిక్ టాక్ దుర్గారావు ఒక్క ఇంటర్వ్యూకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలుసా?

టిక్ టాక్ దుర్గారావు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.తనలో ఉన్న టాలెంట్ ఆధారంగా సోషల్ మీడియా వేదికగా చేసుకొని తన నైపుణ్యాన్ని బయటపెడుతూ ఉన్నఫలంగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న దుర్గారావు అతని భార్య టిక్టాక్ వీడియోల ద్వారా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే టిక్ టాక్ ముగిసే సరికి మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్స్ ను పెంచుకున్నారు.

టిక్ టాక్ ద్వారా వీరు చేసే డాన్స్ లకు సంబంధించిన స్టెప్పులు విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ఈ క్రమంలోనే నాది నకిలీసు గొలుసు అనే పాటకు వీరు వేసిన స్టెప్పులు బాగా పాపులర్ అయ్యాయని చెప్పవచ్చు. ఎంతగా అంటే వీరి స్టెప్పులను ఏకంగా సినిమాలలో కూడా వాడుకునే అంతా ఫేమస్ అయ్యాయని చెప్పవచ్చు.

ఒకప్పుడు కేవలం సోషల్ మీడియాకు మాత్రమే పరిమితమైన ఈ దంపతులు చిన్నగా బుల్లితెరపై జబర్దస్త్, క్యాష్ వంటి కార్యక్రమాలకు కూడా వచ్చి మంచి ఆదరణ దక్కించుకున్నారు. ఇక క్రాక్ సినిమాలో కూడా ఈ దంపతులు నటించే అవకాశాన్ని దక్కించుకొని ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారని చెప్పవచ్చు.ఈ విధంగా ఒకప్పుడు బట్టలు కుడుతూ బ్రతికిన ఈ దంపతులు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా నెలకు యాభై వేలకు పైగానే సంపాదిస్తున్నారని చెప్పవచ్చు.

ఈ విధంగా ఉన్నఫలంగా పాపులారిటీని సంపాదించుకున్న దుర్గారావు దంపతులు పలు కార్యక్రమాల్లో నటిస్తూ పలు బ్రాండ్ ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఈ జంటను యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తే కూడా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలకు ఈ దంపతులు సుమారు 15 నుంచి 20 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌కు ఇంత రెమ్యునరేషనా..? వైరల్ అవుతున్న రావు రమేష్‌ పారితోషకం న్యూస్..

రావు గోపాలరావు వారసుడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రావు రమేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటు విలన్ పాత్ర అయినా.. అటు తండ్రి పాత్ర అయినా అద్భుతంగా పండిస్తారు. ఇలా తెలుగు ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు చాల మందే ఉన్న పాత్రకు సరిపడ ఆర్టిస్ట్ లు మాత్రం చాల తక్కువ..అలాంటి తక్కువ మందిలో బాగా పాపులర్ అయిన ఆర్టిస్ట్ రావు రమేష్ .

ప్రస్తుతం రావు రమేష్ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. అయితే తాజాగా ఈయన నిర్మాతలను షాక్ ఇస్తున్నాడనే వార్తలు బయటకు వచ్చాయి. ఇంతకీ ఏంటంటారా.. అతడి పారితోషకం గురించి. ఇటీవల మలయాళంలో మంచి విజయాన్ని సాధించిన నాయట్టు సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. వీటి హక్కులను గీతా ఆర్ట్స్‌ సొంతం చేసుకుంది.

అయితే ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలో కూడా ఏకకాలంలో రూపొందించేందుకు అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఓ క్యారెక్టర్ కోసం రావు రమేష్ ను సంప్రదించారు. అయితే ఈ క్యారెక్టర్ చేయడానికి అతడు ఏకంగా రూ.1.5 కోట్లు రెమ్యూనరేషన్ అడిగాడంట. అయితే ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు కాని.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంత రెమ్యూనరేషన్ అడగడానికి గల కారణం అందులో రావు రమేష్ పాత్ర కీలకమైంది.

అయితే దీనిని దృష్టిలో ఉంచుకొని కూడా నిర్మాత అల్లు అరవింద్ అతడు అడిగినంత రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ఫిలిమ్ వర్గాల టాక్.ఇప్పటి వరకు ఓ క్యారెక్టర్‌ ఆర్టిస్టు ఇంతలా రెమ్యునరేషన్‌ తీసుకోనుండడం ఇదే తొలిసారి అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మలయాళంలో సంచలనం సృష్టించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

రెమ్యునరేషన్ తగ్గించిన మల్లెమాల.. ఎవరికీ..? ఎందుకు..?

జబర్దస్త్ షో అంటే అందరికీ తెలిసిందే. టాలెంట్ ఉండి.. అవకాశాలు రాకుండా ఉండే వారికి మంచి ప్లాట్ ఫాం ఇచ్చి పాపులర్ కమెడియన్స్ గా ఎదిగేలా చేసిన ఈ కామెడీ షో తొమ్మిది ఏళ్లుగా సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. ఇందులో అవకాశం వచ్చిన చాలామంది ఆర్థికంగా బాగున్నారు. యాంకర్స్ రష్మీ, అనసూయ అయితే సినీ తారల మాదిరిగా వెలిగిపోతున్నారు. కరోనా కారణంగా కోట్ల మందికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.

సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలు కొంత మందికి రెమ్యునరేషన్ తగ్గించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో 24 విభాగాలకి చెందిన వారందరు తమ రెమ్యునరేషన్ తగ్గించుకున్నారు. మల్లెమాల నిర్మాణంలో వస్తున్న జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ వారికి కూడా బాగానే కోతలు పడ్డాయట. జిడ్జిల విషయానికి వస్తే రోజా ఒక్కో ఎపిసోడ్ కు 3 నుంచి 4 లక్షలు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.
అయితే ఇప్పడు ఇందులో కూడా కోత విధించనున్నారని సమాచారం. మనో విషయానికి వస్తే ఎపిసోడ్ కు రూ. 2 లక్షలు, యాంకర్స్ రష్మి, అనసూయలు ఒక్కో ఎపిసోడ్ కు రష్మి రూ.లక్ష, అనసూయ రూ.1.2 లక్షలు తీసుకుంటున్నారు. వీళ్ళ నెల ఆదాయం ఇప్పటి లెక్కల ప్రకారం 4 నుంచి 5 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉందనేది సరాసరి అంచనా. అలాగే టీమ్ లీడ‌ర్ల విష‌యంలో చ‌మ్మ‌క్ చంద్ర అంద‌రికంటే ఎక్కువ రెమ్యున‌రేష‌న్ అందుకునేవాడు. ఈయ‌న ఉన్నపుడు 3 నుంచి 4 ల‌క్ష‌లు సంపాదించాడట.

సుడిగాలి సుధీర్ టీంతో పాటు హైపర్ ఆదికి కూడా భారీగానే రెమ్యునరేషన్ ఇస్తున్నారు. వీళ్ళకు లక్షల్లోనే పారితోషికం అందుతుందని సమాచారం. హైపర్ ఆదికి రూ.2.5, అభి రూ.2 లక్షలు ఇస్తున్నారంటే. భాస్కర్ అండ్ టీంకు రూ. 2 ల‌క్ష‌లు కాగా, చ‌లాకీ చంటి 2 ల‌క్ష‌లు అంటున్నారు. ఇక సునామీ సుధాక‌ర్, కెవ్వు కార్తిక్ కూడా ల‌క్ష‌ల్లోనే సంపాదిస్తున్నార‌ట. కరోనా కారణంగా పారితోషికాల్లో భారీగా మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలుస్తుంది.

‘సిద్ శ్రీరామ్’ ఒక పాటకి ఎంత తీసుకుంటాడో తెలుసా..??

టాలీవుడ్ లో ప్రస్తుతం హీరోలు, హీరోయిన్లు మాత్రమే కాదు సింగర్ లు కూడా హై రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నారు.. అందులో ముందు వరుసలో ఉండే గాయకులలో సిద్ శ్రీరామ్ ఒకరు.. ఈ మధ్యకాలంలో యూత్‌లో బాగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న సింగర్‌ ఆయన..ఇప్పటి సినిమాలలోపాటలకు కూడా చాలా ప్రత్యేకత చూపిస్తున్నారు దర్శక నిర్మాతలు..ఈ నేపథ్యంలోనే సౌత్ లో ఉండే ఫేమస్ సింగర్స్ తో పాటలు పాడిస్తున్నారు..

ఇక ఈ మధ్య సిద్‌ శ్రీరామ్‌ పాట లేనిదే సినిమాలు లేవనడంలో అతిశయోక్తి లేదు. ఒకవేళ సినిమా యావరేజ్‌ టాక్‌ సంపాదించుకున్నా ఆయన పాట మాత్రం సూపర్‌ హిట్‌ అవుతోంది. కొన్నిసార్లు అయితే సిద్‌ శ్రీరామ్‌ పాడిన పాటలతోనే సినిమాపై హైప్‌ క్రియేట్‌ అవుతుంది. దీంతో ఆయనతో ఒక్క పాట అయినా పాడించాలని సంగీత దర్శకులు ఉవ్విళూరుతున్నారు.

తాజాగా ‘నీలినీలి ఆకాశం, ఒకే ఒక లోకం నువ్వు , మాటె వినధుగ..వినధుగ, ఏమై పోయావే’ వంటి పాటలు సిద్‌ శ్రీరామ్‌ పాడినవే. అయితే ఆ సినిమాల రిజల్ట్‌ ఎలా ఉన్నా సిద్‌ శ్రీరామ్‌ పాట మాత్రం​ హిట్‌ అవుతోండటంతో సినిమా ప్రమోషన్‌గా వాడేస్తున్నారు నిర్మాతలు.ఇక అల వైకుంఠపురమలోని ‘సామజవరగమనా’, గీత గోవిందంలోని ‘ఇంకెం ఇంకెం ఇంకెం కావాలే’ పాటలు బంపర్‌ హిట్‌గా నిలిచాయి.మరి ఇంత క్రేజ్‌ ఉన్న సిద్‌ శ్రీరామ్‌ తీసుకునే రెమ్యూనరేషన్‌కు సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.

సాధారణంగా సింగర్‌ను బట్టి 20 వేల నుంచి 50 వేలు, మహా అయితే 1.5లక్షల దాకా రెమ్యూనరేషన్‌ ఇస్తారట. అయితే సిద్‌ శ్రీరామ్‌కున్న మార్కెట్‌ను బట్టి ఆయనకు 4.5లక్షలు ఇస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఒక్క పాటకే ఆయన ఈ రేంజ్‌లో చార్జ్‌ చేయడం విశేషం. యూత్‌లో మంచి కక్రేజ్‌ ఉన్న సింగర్‌గా సిద్‌ శ్రీరామ్‌కు పేరుండటంతో ఆయన అడిగినంత ఇవ్వడంలో నిర్మాతలు వెనకడుగు వేయడం లేదని తెలుస్తోంది.మొత్తానికి స్టార్ హీరోలే కాదు సింగర్ లు కూడా రెమ్యూనరేషన్ ల పరంగా బాగానే సంపాదిస్తున్నారు..!!