Featured

క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌కు ఇంత రెమ్యునరేషనా..? వైరల్ అవుతున్న రావు రమేష్‌ పారితోషకం న్యూస్..

రావు గోపాలరావు వారసుడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రావు రమేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటు విలన్ పాత్ర అయినా.. అటు తండ్రి పాత్ర అయినా అద్భుతంగా పండిస్తారు. ఇలా తెలుగు ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు చాల మందే ఉన్న పాత్రకు సరిపడ ఆర్టిస్ట్ లు మాత్రం చాల తక్కువ..అలాంటి తక్కువ మందిలో బాగా పాపులర్ అయిన ఆర్టిస్ట్ రావు రమేష్ .

ప్రస్తుతం రావు రమేష్ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. అయితే తాజాగా ఈయన నిర్మాతలను షాక్ ఇస్తున్నాడనే వార్తలు బయటకు వచ్చాయి. ఇంతకీ ఏంటంటారా.. అతడి పారితోషకం గురించి. ఇటీవల మలయాళంలో మంచి విజయాన్ని సాధించిన నాయట్టు సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. వీటి హక్కులను గీతా ఆర్ట్స్‌ సొంతం చేసుకుంది.

అయితే ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలో కూడా ఏకకాలంలో రూపొందించేందుకు అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఓ క్యారెక్టర్ కోసం రావు రమేష్ ను సంప్రదించారు. అయితే ఈ క్యారెక్టర్ చేయడానికి అతడు ఏకంగా రూ.1.5 కోట్లు రెమ్యూనరేషన్ అడిగాడంట. అయితే ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు కాని.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంత రెమ్యూనరేషన్ అడగడానికి గల కారణం అందులో రావు రమేష్ పాత్ర కీలకమైంది.

అయితే దీనిని దృష్టిలో ఉంచుకొని కూడా నిర్మాత అల్లు అరవింద్ అతడు అడిగినంత రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ఫిలిమ్ వర్గాల టాక్.ఇప్పటి వరకు ఓ క్యారెక్టర్‌ ఆర్టిస్టు ఇంతలా రెమ్యునరేషన్‌ తీసుకోనుండడం ఇదే తొలిసారి అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మలయాళంలో సంచలనం సృష్టించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago