Tag Archives: retirement

Anushka Shetty: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించనున్న స్వీటీ.. అదే ఆఖరి మిత్రమా?

Anushka Shetty: స్వీటీ అంటే గుర్తు పెట్టకపోవచ్చు కానీ అనుష్క శెట్టి అంటే మాత్రం అందరూ టక్కున గుర్తుపడతారు. స్వీటీగా ఇండస్ట్రీకి వచ్చినటువంటి ఈమె అనంతరం అనుష్కకగా మారిపోయారు. సూపర్ సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైనటువంటి అనుష్క ప్రస్తుతం సినిమాలకు దూరమయ్యారని చెప్పాలి.

కెరియర్ మొదట్లో గ్లామరస్ పాత్రలలో నటించిన అనుష్క అనంతరం అరుంధతి వంటి లేడీ ఓరియంటెడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా సెన్సేషనల్ హిట్ కావడంతో అనుష్క తిరిగి వెనక్కి చూసుకోలేదు. ఇలా లేడి ఓరియెంటెడ్ సినిమాలతో పాటు ఎన్నో ప్రయోగాత్మక సినిమాలలో కూడా నటించారు. అయితే సైజ్ జీరో సినిమాలో ఈమె నటించి అధిక శరీర బరువు కావడంతో ఎన్నో సినిమా అవకాశాలను కోల్పోయారని చెప్పాలి.

ఇలా శరీర బరువు తగ్గడం కోసం అనుష్క ఎన్నో ఇబ్బందులు పడ్డారు.ఈ విధంగా శరీర బరువు తగ్గినటువంటి అనుష్క అనంతరం రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాహుబలి సినిమాలో నటించారు. ఈ సినిమా ద్వారా పానుండి స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనుష్క ప్రస్తుతం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

Anushka Shetty: సినిమాలకు అనుష్క గుడ్ బై…

ఈ సినిమానే అనుష్కకు ఆఖరి సినిమా అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా తర్వాత అనుష్క సినిమాలకు పూర్తిగా దూరంగా ఉండాలని భావించారట అందుకే ఈ సినిమా విడుదలైన అనంతరం ఈమె సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారంటూ ఓ వార్త సెన్సేషనల్ గా మారింది. ఇలా వెండి తెర జేజమ్మగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనుష్క ఇకపై వెండితెరపై కనిపించదు అని తెలియడంతో ఒక్కసారిగా అభిమానులు ఆందోళన నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Akhil: ఏజెంట్ దెబ్బతో అఖిల్ రిటైర్మెంట్ ప్రకటిస్తారా… భారీగా ట్రోల్ చేస్తున్న నేటిజన్స్!

Akhil: అక్కినేని వారసుడు అఖిల్ ఇటీవల ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. అయితే ఈ సినిమా కూడా అఖిల్ అభిమానులకు నిరాశ మిగిల్చింది. అక్కినేని నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అఖిల్ ఇప్పటివరకు సరైన హిట్ అందుకోలేదు . మొదటి మూడు సినిమాలు డిజాస్టర్ గా నిలువగా.. నాలుగో సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కొంతవరకు పర్వాలేదనిపించింది.

ఇక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన లేదంటే సినిమా తాజాగా విడుదల అయ్యి డిజాస్టర్ గా మిగిలి అందరి అంచనాలు తారుమారు చేసింది. దీంతో అఖిల్ తో నాగార్జున కూడా చాలా నిరాశపడ్డాడు. అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా హిట్ అవ్వాలని ఇటీవల నాగార్జున అమల దంపతులు తిరుపతి వెళ్లి దైవ దర్శనం చేసుకున్నారు. ఈ సినిమా కోసం అఖిల్ కష్టపడి బాడీ బిల్డప్ చేసినప్పటికీ సినిమాలో స్టోరీ స్ట్రాంగ్ గా లేకపోవడంతో సినిమా ప్లాప్ గానే మిగిలిపోయింది.

అఖిల్ మొదటి నుండి సినిమా సెలక్షన్ విషయంలో తప్పు మీద తప్పులు చేస్తూనే వస్తున్నాడు. ఇంకా ఎన్ని రోజులు ఇలా అంటూ అక్కినేని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందినప్పటికీ అతని వారసులు అఖిల్ నాగచైతన్య మాత్రం ఇప్పటికి ఇండస్ట్రీలో సక్సెస్ కోసం కష్టపడుతూనే ఉన్నారు. అయితే ఎప్పటికప్పుడు వారి ప్రయత్నాలు మాత్రం విఫలమవుతూనే ఉన్నాయి.

Akhil: వ్యాపారాలు చూసుకోండి…

నాగచైతన్యకి అడపాదడపా హిట్లు పడినా కూడా అఖిల్ మాత్రం మొదటి నుండి ప్లాపులతోనే బండి లాగుతున్నాడు. దీంతో మీకు సినిమాలు సరిపడవు రిటైర్ అయిపోయి చక్కగా మీ తండ్రి వ్యాపారాలు చూసుకోండి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మీ సినిమాలు చూస్తూ మాకు జండూబామ్ ఖర్చులు కూడా అధికమవుతున్నాయి అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Anchor Suma: యాక్టింగ్ వద్దు యాంకరింగ్ ముద్దు అంటున్న సుమ.. యాక్టింగ్ కు రిటైర్మెంట్ ఇచ్చినట్టేనా?

Anchor Suma: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒకప్పుడు ప్రతి ఒక్క ఛానల్ లోనూ ఏదో ఒక కార్యక్రమం ద్వారా బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి ఈమె ఈ మధ్యకాలంలో బుల్లితెర కార్యక్రమాలను కాస్త తగ్గించిందని చెప్పాలి.

ఇలా బుల్లితెర కార్యక్రమాలను తగ్గించిన సుమ సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఏదైనా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్, సక్సెస్ మీట్, అలాగే ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు చేయాలి అంటే తప్పకుండా అక్కడ సుమ ఉండాల్సిందే. ఇలా సుమ వరుస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. అయితే ఈమె కెరియర్ మొదట్లో బుల్లితెర సీరియల్స్ లో నటించి అనంతరం యాంకర్ గా స్థిరపడ్డారు.

ఈ విధంగా సుమ యాంకర్ గా కొనసాగుతూ పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఈమె గత ఏడాది జయమ్మ పంచాయతీ సినిమా ద్వారా ప్రధాన పాత్రలో నటించి పేక్షకుల ముందుకు వచ్చారు.అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ విషయం గురించి సుమ తాజాగా నిట్ ఇంజనీరింగ్ ఫెస్ట్ లో పాల్గొని విద్యార్థులతో మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు.

Anchor Suma:యాంకరింగ్ అంటే ఇష్టం…

తనకు యాంకరింగ్ అంటేనే చాలా ఇష్టమని యాక్టింగ్ తనకు పెద్దగా కలిసి రాలేదని తెలియజేశారు. సుమ ఇలా చెప్పడంతో ఇకపై ఈమె బిగ్ స్క్రీన్ పై కనిపించదేమో ఇలా యాక్టింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించారా అంటూ పెద్ద ఎత్తున అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.ఇలా యాక్టింగ్ తనకు కలిసి రాలేదని యాంకరింగ్ ఇష్టం అని చెప్పడంతో ఇకపై వెండితెరపై కాకుండా కేవలం బుల్లితెరపై మాత్రమే ప్రేక్షకులను సందడి చేయబోతున్నారంటూ పలువురు భావిస్తున్నారు.

Keeravani: నాలుగేళ్ల క్రితమే రిటైర్మెంట్ ప్రకటించిన కీరవాణి…. అదే నిజమై ఉంటే ఆస్కార్ వచ్చేదా?

Keeravani: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ వచ్చింది. ఇలా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న RRR సినిమాకు నేడు ఆస్కార్ అవార్డు రావడం తెలుగు చిత్ర పరిశ్రమకే గర్వకారణం అని చెప్పాలి. ఇలా ఈ సినిమాకు ఆస్కార్ రావడం వెనుక ఎంతో మంది కృషి ఉంది.

ఇక ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించిన ఎం ఎం కీరవాణి ఈ ఆస్కార్ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు రావడంలో ఈయన పాత్ర చాలా ఉందని చెప్పాలి.ఇలాంటి ఒక అద్భుతమైన పాటకు అద్భుతమైన సంగీతాన్ని అందించి అంతర్జాతీయ వేదికపై మన తెలుగు సినిమా సత్తాని చాటారు. అయితే గత నాలుగు సంవత్సరాల క్రితం కీరవాణి తీసుకున్నటువంటి నిర్ణయం వెనక్కి కనుక తీసుకోకపోయి ఉంటే ఇప్పుడు ఈ ఘనత తెలుగు చిత్ర పరిశ్రమకు దక్కేది కాదని చెప్పాలి.

బాహుబలి సినిమా సమయంలో కీరవాణి సోషల్ మీడియా వేదికగా తాను ఇకపై సినిమాలు మానేద్దాం అనుకుంటున్నాను అంటూ ఓ పోస్ట్ చేశారు. ఇలా తాను సినిమాల నుంచి కనుక రిటైర్మెంట్ తీసుకొని ఉంటే ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమకు ఆస్కార్ వచ్చేదా?ఆరోజు కీరవాణి తన మాటను వెనుక తీసుకోవడంతోనే నేడు తెలుగు చిత్ర పరిశ్రమకు గొప్ప గౌరవం లభించింది అని చెప్పాలి.

Keeravani:ఆస్కార్ మిస్ అయ్యేది….

రిటైర్మెంట్ ప్రకటించిన కీరవాణి తర్వాత ఆ విషయం గురించి స్పందిస్తూ తాను రిటైర్మెంట్ వెనుక తీసుకున్నట్లు తెలిపారు. ఇలా తను రిటైర్మెంట్ గురించి క్లారిటీ ఇచ్చినప్పటికీ పలుసార్లు ఈయన సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.సినిమాల విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న కీరవాణి ఎవరి మాట విని ఆగిపోయారో తెలియదు కానీ వారి మాట వినడంతోనే నేడు ఆస్కార్ అందుకొని అవకాశం వచ్చిందని చెప్పాలి.అలా కాకుండా తన నిర్ణయాన్ని కొనసాగించి ఉంటే తెలుగు చిత్ర పరిశ్రమ గొప్ప అవకాశాన్ని కోల్పోయేది.