Keeravani: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ వచ్చింది. ఇలా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న RRR సినిమాకు నేడు ఆస్కార్ అవార్డు రావడం తెలుగు చిత్ర పరిశ్రమకే గర్వకారణం అని చెప్పాలి. ఇలా ఈ సినిమాకు ఆస్కార్ రావడం వెనుక ఎంతో మంది కృషి ఉంది.
ఇక ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించిన ఎం ఎం కీరవాణి ఈ ఆస్కార్ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు రావడంలో ఈయన పాత్ర చాలా ఉందని చెప్పాలి.ఇలాంటి ఒక అద్భుతమైన పాటకు అద్భుతమైన సంగీతాన్ని అందించి అంతర్జాతీయ వేదికపై మన తెలుగు సినిమా సత్తాని చాటారు. అయితే గత నాలుగు సంవత్సరాల క్రితం కీరవాణి తీసుకున్నటువంటి నిర్ణయం వెనక్కి కనుక తీసుకోకపోయి ఉంటే ఇప్పుడు ఈ ఘనత తెలుగు చిత్ర పరిశ్రమకు దక్కేది కాదని చెప్పాలి.
బాహుబలి సినిమా సమయంలో కీరవాణి సోషల్ మీడియా వేదికగా తాను ఇకపై సినిమాలు మానేద్దాం అనుకుంటున్నాను అంటూ ఓ పోస్ట్ చేశారు. ఇలా తాను సినిమాల నుంచి కనుక రిటైర్మెంట్ తీసుకొని ఉంటే ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమకు ఆస్కార్ వచ్చేదా?ఆరోజు కీరవాణి తన మాటను వెనుక తీసుకోవడంతోనే నేడు తెలుగు చిత్ర పరిశ్రమకు గొప్ప గౌరవం లభించింది అని చెప్పాలి.
రిటైర్మెంట్ ప్రకటించిన కీరవాణి తర్వాత ఆ విషయం గురించి స్పందిస్తూ తాను రిటైర్మెంట్ వెనుక తీసుకున్నట్లు తెలిపారు. ఇలా తను రిటైర్మెంట్ గురించి క్లారిటీ ఇచ్చినప్పటికీ పలుసార్లు ఈయన సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.సినిమాల విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న కీరవాణి ఎవరి మాట విని ఆగిపోయారో తెలియదు కానీ వారి మాట వినడంతోనే నేడు ఆస్కార్ అందుకొని అవకాశం వచ్చిందని చెప్పాలి.అలా కాకుండా తన నిర్ణయాన్ని కొనసాగించి ఉంటే తెలుగు చిత్ర పరిశ్రమ గొప్ప అవకాశాన్ని కోల్పోయేది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…