Flash Back : సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు శంకర్.సామాజిక, సందేశాత్మక చిత్రాలతో ఆయన ప్రేక్షకులను తన అభిమానులుగా చేసుకున్నారు. హాస్య దర్శకులైన జంధ్యాల, ఈవీవీ.సత్యనారాయణ తర్వాత అందరూ చెప్పుకునే దర్శకుడు ఎస్ వి కృష్ణారెడ్డి.
కుటుంబ కథలు ఎంచుకొని అందులో కాస్తంత హాస్యాన్ని జోడించి సినిమాలను రూపొందిస్తారు. తక్కువ సినిమాలతో ప్రేక్షకుల ఎక్కువ అభిమానాన్ని ఆయన సొంతం చేసుకున్నారు.. అయితే వీరు ఈ సినిమాలతో వెండితెరకు పరిచయమయ్యారు.
1993 లో కుంజుమోన్ నిర్మాణం, శంకర్ దర్శత్వంలో ‘జెంటిల్ మెన్’ చిత్రం విడుదల అయింది. ఈ సినిమాలో అర్జున్, మధుబాల హీరో, హీరోయిన్లుగా నటించారు. ఏ.ఆర్ రెహమాన్ అందించిన పాటలు కుర్ర కారును ఉర్రూత లూగించాయి. విద్య కోసం ధనవంతులు నుండి దొంగిలించి పేదవారికి సహాయపడే పాత్రలో అర్జున్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. తమిళం నుంచి తెలుగులోకి డబ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘనవిజయాన్ని సాధించింది.
‘రాజేంద్రుడు గజేంద్రుడు’ 1993 లో ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఒక హాస్యభరిత చిత్రం. ఇది ఎస్. వి. కృష్ణారెడ్డికి దర్శకుడిగా మొదటి సినిమా. కథంతా ఒక ఏనుగు చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రాన్ని మనీషా ఫిలింస్ పతాకంపై కె. అచ్చిరెడ్డి నిర్మించగా, కిషోర్ రాఠీ సమర్పకుడిగా వ్యవహరించాడు.
‘మనీ’ శివనాగేశ్వరరావు దర్శకత్వంలో, రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా నిర్మించిన 1993 నాటి తెలుగు క్రైం కామెడీ సినిమా. జె.డి. చక్రవర్తి, చిన్నా కథానాయకులుగా, జయసుధ, పరేష్ రావెల్, బ్రహ్మానందం తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. హాస్యదర్శకుడిగా పేరొందిన శివనాగేశ్వరరావుకు దర్శకుడిగా ఇది తొలి చిత్రం. 1986 నాటి హాలీవుడ్ క్రైం కామెడీ సినిమా రూత్ లెస్ పీపుల్ సినిమా ఆధారంగా ఈ కథ, కొన్ని పాత్రలను రూపొందించారు. డబ్బు కోసం పక్క ఇంట్లోని సంపన్నురాలిని కిడ్నాప్ చేసిన నిరుద్యోగ యువకులే ఆమె ఆస్తి కోసం చంపాలని చూస్తున్న భర్త నుంచి కాపాడడం ప్రధాన కథాంశం. ఇలా ఈ ముగ్గురు దర్శకులు మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…