Actress Meena : సుందరకాండ వెంకటేష్ కథానాయకునిగా కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో 1992లో వచ్చిన చిత్రం. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించాడు. సుందరకాండ దర్శకత్వం కె. రాఘవేంద్రరావు, రచన భాగ్యరాజా (కథ) నటవర్గం వెంకటేష్, మీనా, అపర్ణ, ఛాయాగ్రహణం కె. రవీంద్రబాబు, కూర్పు కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం ఎం. ఎం. కీరవాణి.
లెక్చరర్ ను ప్రేమించి ఒక అమ్మాయి కథ ఇది. ఇందులో వెంకటేష్ లెక్చరర్ గా నటించాడు.
ఈ చిత్రం తమిళంలో కె. భాగ్యరాజా స్వీయదర్శకత్వంలో నటించిన సుందరకాండం అనే చిత్రానికి పునర్నిర్మాణం. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది. ఈ చిత్రంలో వేటూరి రాసిన ఆకాశాన సూర్యుడుండడు తెల్లవారితే పాటకు నంది పురస్కారం లభించింది.. ఐతే ఓ సినీ కార్యక్రమానికి హాజరైన మీనా మాట్లాడుతూ.. ఆనాటి సుందరాకాండ సినిమా షూటింగ్ విశేషాలను గుర్తు చేసుకుంటూ.. చంటి సినిమా విజయవంతమైన తర్వాత రాఘవేంద్రరావు సినిమాలో నటించే అవకాశం వచ్చింది.
అప్పటికి ఆయన హీరోయిన్స్ ని రొమాన్స్ గా చూపించడం అలాగే నడుముపై వివిధ రకాలైన ఫ్రూట్స్ వేయడం లాంటివి చేస్తారని మొదట్లో భయం వేసేది. కానీ రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో నటించాలని కోరికగా ఉండేది. అలా కెరీర్ మొదట్లోనే ఆయన సినిమాలో నటించే అవకాశం వచ్చింది. సుందరకాండ సినిమాలో నాది అనాధ స్త్రీ పాత్ర.. అయితే ఆ సినిమాలోని ఒక సన్నివేశంలో.. రోడ్డుపై వెళ్తూ.. దేవుడా.. దేవుడా.. అమ్మానాన్న లేని వాళ్లకు దేవుడా.. దేవుడా.. అంటూ నేను పాడుకుంటూ వెళ్లాలి. అలా రోడ్డుపై నేను పాడుకుంటూ వెళ్తున్నప్పుడు.. నిజంగానే రోడ్ పై అటువైపుగా వెళుతున్న ఒకతను నా చేతిలో చిల్లర వేసి వెళ్ళిపోయాడు. షూటింగ్ లో ఉన్న యూనిట్ సభ్యులు అది చూసి అందరూ నవ్వుకున్నారు. ఇప్పటికి ఆ విషయం గుర్తు చేసుకుంటే నవ్వొస్తుందని ఆ ఇంటర్వ్యూలో మీనా ఆనాటి సంగతులను గుర్తు చేసుకున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…