Flash Back : 1980’s లో శ్రీదేవి సీనియర్ నటులతో అనేక సినిమాలలో నటించి అద్భుతమైన విజయాలను తన సినీ ఖాతాలో వేసుకున్నారు. అప్పటికి జూనియర్స్ అయినా చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలతో వేళ్ళ మీద లెక్కపెట్టే చిత్రాలలో మాత్రమే శ్రీదేవి నటించారు. అప్పటికి రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి వంటి దర్శకులు బాలయ్య శ్రీదేవి కాంబినేషన్ లో సినిమా తీయాలనుకున్నా ఎందుకో కుదరలేదు.
ఇక 90’s విషయానికి వస్తే.. నటసింహం నందమూరి బాలకృష్ణ, నటభూషణ్ శోభన్ బాబు నటించిన ‘అశ్వమేధం’ సినిమా గుర్తుకు ఉండే ఉంటుంది. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు కే.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. సీ.అశ్వినీ దత్ నిర్మాతగా వ్యవహరించారు. 1992లో తెరకెక్కించిన ఈ భారీ చిత్రం.. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ప్రకటించడంతో భారీగా నష్టపోయినట్లు సమాచారం. ఎందుకంటే ప్రభుత్వం రాయితీలు ప్రకటించడంతో సినిమాల సంఖ్య భారీగా పెరిగింది.. ఫలితంగా నాణ్యత లేని కథలు వచ్చాయి. దీంతో ఆ సినిమాలు దారుణంగా ఫ్లాపులు అయ్యాయి. వీటిలో అశ్వమేధం కూడా ఉంది. సినీ పరిశ్రమపై చర్చించుకోవడానికి కూడా వీలులేని పరిస్థితి ఏర్పడింది.
నిర్మాత అశ్వినీదత్ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాకు తెరకెక్కించారు. ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి నటించారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద అఖండ విజయం సాధించింది. ఈ సినిమా తర్వాతనే ‘అశ్వమేధం’ సినిమాను తెరకెక్కించారు. సీనియర్ ఎన్టీఆర్‌తో కలిసి రెండు సినిమాలు అప్పటికే తన బ్యానర్‌లో తెరకెక్కించారు నిర్మాత అశ్వినీదత్. ఆ తర్వాత ఎన్టీఆర్ తనయుడు బాలయ్యతో కలిసి ‘అశ్వమేధం’ సినిమా తీయాలని అనుకున్నారు.
బాలయ్య, శ్రీదేవి కాంబినేషన్‌లో తొలి సినిమా తీయాలని అశ్వినిదత్ అనుకొని డైరెక్టర్ రాఘవేంద్రరావును సంప్రదించారు. కానీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో బాలయ్య, శ్రీదేవి కాంబినేషన్ కుదరలేదు. అయినా, పట్టువదలని విక్రమార్కునిలా ఎనిమిది నెలల తర్వాత అశ్విని దత్ మరో కథను రెడీ చేయించాడు. కథ రెడీ అవ్వడంతో హీరో శోభన్ బాబు, నటసింహం బాలయ్యతో కలిసి ‘అశ్వమేధం’ సినిమాను ప్రారంభించారు.
ఈ సినిమాను 1992 జూన్ 29న హీరో నాగార్జున కెమెరాను స్విచ్ఛాన్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టి ప్రారంభించారు. అన్నపూర్ణ స్టూడియోలో సినిమా షూటింగ్ ప్రారంభం అయింది.
అశ్వమేధంలో పోలీస్ ఆఫీసర్ అభిమన్యుడిగా శోభన్ బాబు, అతని తమ్ముడు పైలెట్ ఆఫీసర్‌గా బాలకృష్ణ నటించారు. హీరోయిన్లుగా నగ్మా, మీనా నటించారు. అమ్రిష్ పూరి, కోట శ్రీనివాసరావు, రాధారవి విలన్లుగా వ్యవహరించారు. దాదాపు రూ.3 కోట్ల బడ్జెట్‌తో ‘అశ్వమేధం’ సినిమాను తెరకెక్కించారు. 1992 డిసెంబర్ 25వ తేదీన రిలీజ్ అవ్వగా.. 8 సెంటర్లల్లో 50 రోజుల వరకు ఆడింది. ఈ సినిమాకు ముంబై నుంచి ప్రత్యేక టీంను రప్పించి.. ఇళయరాజా సంగీతం అందజేశారు. అయినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయాన్ని పొందింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…