Tag Archives: salary

Andhrapradesh: ఓ వైపు నిరసనలు, ఆందోళనలు..! మరోవైపు తమ పంతం నెగ్గించుకున్న ఏపీ ప్రభుత్వం..!

Andhrapradesh: ఏపీలో ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగుల మధ్య పీఆర్సీ రగడ కొనసాగుతూనే ఉంది. కొత్తగా ప్రకటించిన పీఆర్సీ తమకు సమ్మతం కాదని.. ఉద్యోగులు నిరసన బాట పట్టారు. తమ నిరసనలను కొనసాగిస్తూ… ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించాలని డిమాండ్ చేస్తున్నారు.

Andhrapradesh: ఓ వైపు నిరసనలు, ఆందోళనలు..! మరోవైపు తమ పంతం నెగ్గించుకున్న ఏపీ ప్రభుత్వం..!

మరోవైపు తమ డిమాండ్ల నెరవేరకపోతే ఈ నెల 7 నుంచి సమ్మెకు వెళ్తామని ఇదివరకే హెచ్చరించారు. 
మరోవైపు ప్రభుత్వం ఉద్యోగులను బుజ్జగించేందుకు మంత్రులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఉద్యోగులు తమ సమస్యలను మంత్రుల కమిటీకి చెప్పాలని చర్చలకు ఆహ్వానించారు.

Andhrapradesh: ఓ వైపు నిరసనలు, ఆందోళనలు..! మరోవైపు తమ పంతం నెగ్గించుకున్న ఏపీ ప్రభుత్వం..!

అయితే ఉద్యోగుల మాత్రం చాలా సార్లు కమిటీ ఆహ్వానానికి స్పందించలేదు. అయితే నిన్న మంత్రుల కమిటీతో పీఆర్సీ స్టీరింగ్ కమిటీ భేటీ అయింది. కాగా ముఖ్యంగా మూడు డిమాండ్లపై ఉద్యోగులు పట్టుబట్టడంతో చర్చలు విఫలం అయ్యాయి. 


ఉద్యోగులు నిరసనలు, ఆందోళనతో..

ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు నిరసనలు, ఆందోళనతో ఏమాత్రం భయపడటం లేదు. తాజాగా ప్రభుత్వం తన పంతాన్ని నెగ్గించుకుంది. ఓ వైపు నిరసనలు, ఆందోళనలను పట్టించుకోకుండా… రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల అకౌంట్లలో వేతనాలను జమచేసింది. పదకొండవ పీఆర్సీ ప్రకారం ఉద్యో గుల అకౌంట్లలో ఉదయం నుంచే వేతనాలు పడిపోయాయి. ప్రతి నెలా ఉద్యోగులకు ఆలస్యంగా వేతనాలు అందుతుండగా.. ఈ నెలలో మాత్రం బుధవారం ఉదయం లోపు అందరికీ వేతనాలు పడ్డాయి. ఇదిలా ఉంటే ట్రెజరీ ఉద్యోగులకు మాత్రం వేతనాలు ఇంకా పడలేదు. వేతన బిల్లులు ప్రాసెస్ చేయకపోవడంతో.. ట్రెజరీ ఉద్యోగులపై ఉన్నతాధికారులు గుర్రుగా ఉన్నారు.

నెలకు జీతం చొప్పున దర్శకుడిగా పనిచేశాడా.. మరీ అంత చీప్ గా ఎందుకు..?

ఏదైనా ఒక సినిమా హిట్ అయిందంటే.. అందులో నటించిన నటులకు, దర్శకుడికి పెద్ద ఎత్తున పేరు వస్తుంది. తర్వాత సినిమాలు అనేవి క్యూ కడతాయి. వద్దన్నా అవకాశాలు వస్తుంటాయి. అయితే అప్పుడెప్పుడో బొమ్మరిల్లు సినిమాను పెద్ద హిట్ గా తీసిన భాస్కర్.. సంచలన హిట్ ను సాధించాడు. ఆ తర్వాత భాస్కర్ పేరే.. బొమ్మరిల్లు భాస్కర్ గా మారిపోయింది.

తర్వాత వచ్చిన పరుగు సినిమా కూడా బంపర్ హిట్ సాధించింది. ఈ రెండు సినిమాలు అతడి కెరీర్ ను ఓ మలుపు తిప్పాయి. ఇలా అతడు తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు. తర్వాత వచ్చిన ఆరెంజ్ సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ ను మూటగట్టుకుంది. దానిని అన్నీ తానై నడిపించిన నాగబాబుకు ఆ సినిమా తర్వాత అప్పలు పాలయి.. ఆత్మహత్యకు ఈ సినిమా అప్పులు దారి తీశాయనే విమర్శ ఉంది.

ఆ సినిమా భాస్కర్ కు కెరీర్ లో పెద్ద దెబ్బ పడింది. తర్వాత అతడి వద్దకు సినిమాలు తీసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అంత ధైర్యం కూడా చేయలేదు. మధ్యలో ఒంగోలు గిత్త సినిమా తీసినా అంత పెద్ద హిట్ కొట్టలేకపోయింది. దీంతో అతడు సినిమాలకు చాలా దూరం అయ్యాడు. ఇక చాలా రోజుల తర్వాత అతడికి అల్లు అరవింద్ అవకాశాన్ని కల్పించాడు.

అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ హీరోగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాకు అతడు నెలకు రూ.2లక్షల చొప్పున రెమ్యూనరేషన్ తీసుకొని వర్క్ చేశాడట. జీతం తీసుకొని అతడు ఈ సినిమాను తెరకెక్కించాడు. ప్రస్తుతం ఈ సినిమా హాట్ టాక్ వచ్చింది. మరి బొమ్మరిల్లు భాస్కర్ కు ఇప్పుడైనా రెమ్యూనరేషన్ ఇస్తుందో లేదో చూడాలి.

కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం జగన్ అదిరిపోయే శుభవార్త..?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్ట్ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. 2021 సంవత్సరం మార్చి నెల 31వ తేదీ వరకు కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను పొడిగిస్తున్నట్టు ఉత్తర్వులు విడుదల చేశారు. న్యాయశాఖ, సాంస్కృతిక పర్యాటక శాఖ, యువజన సర్వీసులు, కుటుంబ సంక్షేమం, వైద్యం, ఆరోగ్యం, పాఠశాల, ఉన్నత విద్యాశాఖల్లోని కాంట్రాక్ట్ సర్వీసులను పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు గడువును పొడిగించటంతో పాటు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. రెగ్యులర్ ఉద్యోగులకు ఏ విధంగా వేతనాలను చెల్లిస్తారో కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా అదే విధంగా చెల్లించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను జీతాల విషయంలో ఇబ్బంది పెట్టవద్దని చెప్పారు.

పర్మినెంట్ ఉద్యోగులకు ఏ విధంగా సామాజిక, ఆరోగ్య భద్రత కల్పిస్తున్నామో కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా అదే విధంగా సామాజిక, ఆరోగ్య భద్రత కల్పించడం కోసం అధ్యయనం చేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. అధ్యయనం అనంతరం తనకు పూర్తి వివరాలను అందజేయాలని జగన్ అధికారులకు చెప్పారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉద్యోగులకు, వ్యాపారులకు, రైతులకు, విద్యార్థులకు, మహిళలకు ప్రయోజనం చేకూర్చేలా వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రశంసలు అందుకుంటున్నారు. కరోనా, లాక్ డౌన్ వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నా సీఎం జగన్ మాత్రం అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం గమనార్హం.