Andhrapradesh: ఓ వైపు నిరసనలు, ఆందోళనలు..! మరోవైపు తమ పంతం నెగ్గించుకున్న ఏపీ ప్రభుత్వం..!
Andhrapradesh: ఏపీలో ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగుల మధ్య పీఆర్సీ రగడ కొనసాగుతూనే ఉంది. కొత్తగా ప్రకటించిన పీఆర్సీ తమకు సమ్మతం కాదని.. ఉద్యోగులు నిరసన బాట పట్టారు. తమ నిరసనలను కొనసాగిస్తూ… ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు తమ డిమాండ్ల నెరవేరకపోతే ఈ నెల 7 నుంచి సమ్మెకు వెళ్తామని ఇదివరకే హెచ్చరించారు.
మరోవైపు ప్రభుత్వం ఉద్యోగులను బుజ్జగించేందుకు మంత్రులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఉద్యోగులు తమ సమస్యలను మంత్రుల కమిటీకి చెప్పాలని చర్చలకు ఆహ్వానించారు.
అయితే ఉద్యోగుల మాత్రం చాలా సార్లు కమిటీ ఆహ్వానానికి స్పందించలేదు. అయితే నిన్న మంత్రుల కమిటీతో పీఆర్సీ స్టీరింగ్ కమిటీ భేటీ అయింది. కాగా ముఖ్యంగా మూడు డిమాండ్లపై ఉద్యోగులు పట్టుబట్టడంతో చర్చలు విఫలం అయ్యాయి.
ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు నిరసనలు, ఆందోళనతో ఏమాత్రం భయపడటం లేదు. తాజాగా ప్రభుత్వం తన పంతాన్ని నెగ్గించుకుంది. ఓ వైపు నిరసనలు, ఆందోళనలను పట్టించుకోకుండా… రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల అకౌంట్లలో వేతనాలను జమచేసింది. పదకొండవ పీఆర్సీ ప్రకారం ఉద్యో గుల అకౌంట్లలో ఉదయం నుంచే వేతనాలు పడిపోయాయి. ప్రతి నెలా ఉద్యోగులకు ఆలస్యంగా వేతనాలు అందుతుండగా.. ఈ నెలలో మాత్రం బుధవారం ఉదయం లోపు అందరికీ వేతనాలు పడ్డాయి. ఇదిలా ఉంటే ట్రెజరీ ఉద్యోగులకు మాత్రం వేతనాలు ఇంకా పడలేదు. వేతన బిల్లులు ప్రాసెస్ చేయకపోవడంతో.. ట్రెజరీ ఉద్యోగులపై ఉన్నతాధికారులు గుర్రుగా ఉన్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…