Tag Archives: shocked

నిద్ర నుంచి లేచిన పూజా హెగ్డే అది చూసి షాక్ అయింది.. తర్వాత ఏం చేసిందో తెలుసా..?

పట్టిందల్లా బంగారమే అనేది పెద్దలు చెబుతుంటారు. అలాంటి సామెత కచ్చితంగా టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డేకు సరిపోతుంది. ఎందుకంటే.. ఆమె ఇటీవల ఏ సినిమా చేసినా.. బంపర్ హిట్ తో దూసుకుపోతోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో విజయవంతమైన హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇప్పటికే ఆమె చేతిలో ఎన్నో సినిమా ప్రాజెక్టులు ఉన్నాయి.

అయితే ఇటీవల ఆమె వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లింది. అక్క‌డ తెగ సందడి చేస్తూ నానా ర‌చ్చ చేసింది. ప్రశాంతమైన సాగర తీరంలో హాయిగా సేద తీరారు. మాల్దీవుల‌కి సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తూ మ‌తులు పోగొడుతుంది పూజా హెగ్డే. ఇందులో పూజా క్యూట్ లుక్స్ ను ఆమె తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దానిని చూసిన నెటిజన్లు మతి పోయింది.

తాజాగా పూజా హెగ్డే బికినీ వేసి హాట్ హాట్ అందాల‌తో కేక పెట్టించింది. పూజా హాట్ డ్యాన్స్ కి కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. ఇలా ఉండగా.. ఆమె ఉదయం తన బెడ్ మీద నుంచి లేచి.. తన ఫోన్ చూసుకుంది. ఫోన్ చూసిన వెంటనే ఎంతో సంతోషంగా బెడ్ పైనే ఆమె డ్యాన్స్ వేసింది. ఎందుకో తెలుసా.. ఆమె సోషల్ మీడియాలో ప్లాట్ ఫాంలో అంటే.. ఇన్ స్టా, ఫేస్ బుక్, ట్విట్టర్ లో తన ఫాలోవర్స్ ప్రతీ రోజు పెరుగుతూనే ఉన్నారు.

తాజాగా ఇన్ స్టాలో ఆమె ఫాలోవర్స్ 16 మిలియన్ కు చేరుకుంది. దీంతో ఆమె తన సంతోషాన్ని డ్యాన్స్ రూపంలో చూపించారు.మీ అభిమానాన్ని ఇలానే చూపించాలని.. ఇంతగా తనపై ప్రేమను కురిపిస్తున్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు పూజా హెగ్డే. అయితే ఆమె బెడ్ పై వేసిన డ్యాన్స్ కు సంబంధించిన వీడియోలను తన ఇన స్టాలో పోస్టు చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా.. ఈ ముద్దుగుమ్మ‌ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రంతో మంచి హిట్ కొట్టింది. చిరంజీవి-చరణ్ ల మల్టీ స్టారర్ ఆచార్య, ప్రభాస్ రాధే శ్యామ్ వంటి భారీ ప్రాజెక్ట్స్ పూజా హెగ్డే ఖాతాలో ఉన్నాయి. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న రాధే శ్యామ్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు నెటిజన్లు.

కరోనా వ్యాక్సిన్ వద్దంటున్న ప్రజలు.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే..?

దేశంలో కరోనా మహమ్మారి విలయం కొనసాగుతోంది. ఇప్పట్లో సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశం కనుచూపుమేరలో కనిపించడం లేదు. వైద్యులు, శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్ ను త్వరగా అందుబాటులోకి తెచ్చి ప్రపంచవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేద్దామని భావిస్తున్నారు. అయితే ప్రజలు మాత్రం శాస్త్రవేత్తలు, వైద్యులకు భారీ షాక్ ఇస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ వచ్చినా తమకు వ్యాక్సిన్ అవసరం లేదని తేల్చి చెబుతున్నారు.

దేశంలో ఏకంగా 61 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. దేశంలోని ప్రజల్లో కరోనా వైరస్ గురించి గతంతో పోలిస్తే భయం చాలా తగ్గింది. చాలామంది ప్రజలు ఇతర వ్యాధుల్లాగే కరోనా కూడా సాధారణ ఫ్లూ మాత్రమే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక సర్వే అధ్యయనంలో 2021 జనవరిలో కరోనా వ్యాక్సిన్ వచ్చినా వేయించుకోవడానికి తాము సిద్ధంగా లేమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

లోకల్‌ సర్కిల్స్‌ అనే సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ఆన్ లైన్ లో సర్వేను నిర్వహించి ఈ విషయాలను వెల్లడించింది. 51 శాతం మంది కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే కరోనా బారిన పడకపోయినా ఇతర ఆరోగ్య సమస్యలు తమను వేధించే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు. 10 శాతం తమకు వ్యాక్సిన్ వద్దేవద్దని ఖరాఖండీగా చెబుతున్నారు. 72 శాతం పురుషులు, 54 శాతం మహిళలు ఈ సర్వేలో పాల్గొన్నారని సమాచారం.

కరోనా వ్యాక్సిన్ గురించి ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం సర్వే నిర్వాహకులు పేర్కొన్నారు. సర్వేలో మొత్తం 8,496 మంది పాల్గొన్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 20 శాతం మంది ఒత్తిడికి గురవుతున్నామని తెలిపారు.