Tag Archives: siva

Janhvi Kapoor: ఎన్టీఆర్ 30 లో తారక్ జోడిగా జాన్వీ కపూర్…. పెద్ద చిక్కుల్లో పడిన బాలయ్య?

Janhvi Kapoor: నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు అయితే ఇప్పటివరకు ఈ సినిమా ఇంకా షూటింగ్ పనులను మొదలుపెట్టలేదు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులను ప్రారంభించుకోబోతుందని సమాచారం. అయితే ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటించడం కోసం పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించినప్పటికీ చివరికి అందాల తార శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ఈ సినిమాలో ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. గత కొద్ది రోజుల క్రితం జాన్వీ హైదరాబాద్ వచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈమె హైదరాబాద్ రావడానికి గల కారణం ఎన్టీఆర్ సినిమా కోసం ఫోటో షూట్స్ జరిగాయని దాదాపు ఈమె ఎన్టీఆర్ సినిమాలో కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది.

ఇలా ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను త్వరలోనే అధికారకంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్ అయినట్లేనని పలువురు భావిస్తున్నారు. ఇలా ఎన్టీఆర్ సినిమాలో శ్రీదేవి కూతురు నటించిన బాలయ్య కాస్త చిక్కుల్లో పడ్డారని తెలుస్తోంది. బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీదేవి అనంతరం ఎన్టీఆర్ హీరోగా ఆయన సరసన హీరోయిన్గా నటించి వీరి కాంబినేషన్లో సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

Janhvi Kapoor:బాలయ్యతో నటించనీ శ్రీదేవి…

ఇక ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు అందరి సరసన నటించిన శ్రీదేవి బాలకృష్ణ సరసన మాత్రం నటించలేదు. బాలకృష్ణ సినిమాలో శ్రీదేవిను హీరోయిన్ గా ఎంపిక చేసిన ఎన్టీఆర్ మాత్రం బాలయ్య సినిమాలో శ్రీదేవి నటించడానికి ఒప్పుకోలేదట.బాలకృష్ణ కూడా తన తండ్రితో కలిసి నటించిన శ్రీదేవి తనకు తల్లితో సమానమని అందుకే తనతో సినిమాలు చేయలేదని పలు సందర్భాలలో తెలియజేశారు. అయితే ప్రస్తుతం శ్రీదేవి కుమార్తె జాన్వీ ఎన్టీఆర్ సినిమాలో నటించడంతో ఎప్పుడైనా బాలకృష్ణ ఈ సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే శ్రీదేవి గురించి ఎలా స్పందిస్తారనే విషయంపై అందరిలో ఆత్రుత నెలకొంది.

డైరెక్టర్ తేజ ఎవరు.. అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. ఆయన తండ్రి ఏం చేసేవారో తెలుసా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ తేజ గురించి అందరికీ తెలిసినదే. చిత్రం సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యి మొదటి సినిమానే బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన దర్శకుడుగా మాత్రమే అందరికీ తెలుసు. అయితే ఇండస్ట్రీ లోకి రాకముందు ఆయన ఎవరు? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి తన తండ్రి ఏం చేసేవారు అనే విషయాల గురించి చాలా మందికి తెలియదు. తేజ చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలను అనుభవిస్తూ తన అక్కల సహాయంతో ప్రస్తుతం ఈ స్థాయికి వచ్చారు.

ఇండస్ట్రీలోకి వచ్చిన వెంటనే తేజ కెమెరా డిపార్ట్మెంట్ లో చేరి, ఆ తరువాత కెమెరా ఆపరేటివ్ గా, డైరెక్టర్ గా ప్రస్తుతం గొప్ప స్థాయిలో ఉన్నారు. దర్శకుడు తేజ వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆయన తండ్రి పేరు జె.బి.కె. చౌదరి. అందరూ ఆత్మీయంగా తనని జెబీకే అని పిలుచుకునేవారు. సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న జెబీకే తన మిత్రుల సహాయంతో “ధర్మపత్ని” అనే సినిమాను చేశారు.

జెబీకే, రాణి దంపతులకు ఇద్దరు కూతుర్ల తరువాత తేజ జన్మించారు. తేజ అసలు పేరు ధర్మ తేజ. అప్పటికి షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ పేరు జయంతి ధర్మతేజ ఉండేవారు. ఆయన పేరున ఇన్స్పిరేషన్ గా తీసుకొని తన కొడుకుకు ఆ పేరును పెట్టారు. తన కొడుకు పుట్టిన తరువాత తన తండ్రి జపాన్ కి హ్యూమన్ హెయిర్ ఎక్స్ పోర్ట్ బిజినెస్ చేసేవారు. అయితే వ్యాపారంలో బాగా నష్టం రావడమే కాకుండా తన భార్య మృతి చెందడంతో ఎంతో కుంగిపోయారు.

ఈ క్రమంలోనే తేజ పది సంవత్సరాల వయసులో తల్లి తండ్రి ఇద్దరు మరణించగా తన అక్కల సహాయంతో ఉన్నత చదువులు చదివారు. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉండడంతో ముంబైకి వెళ్లి ఇండస్ట్రీ లో కెమెరా డిపార్ట్మెంట్ లో చేరారు. ఈ విధంగా ఎన్నో సినిమాలలో పనిచేసిన తేజకి రామ్ గోపాల్ వర్మ పరిచయం కావడంతో ఆయన తెరకెక్కించిన “శివ” సినిమాకు కెమెరామెన్ ఆపరేటర్ గా పని చేశారు. అలాగే వర్మ “రాత్రి” సినిమాతో ఫోటోగ్రాఫర్ గా మారారు.

ఇలా ఎన్నో సినిమాలలో కెమెరా డిపార్ట్మెంట్ లో పనిచేసిన తేజ రామానాయుడు గారిని ఒప్పించి కేవలం 30 లక్షల బడ్జెట్ తో ఉదయ్ కిరణ్ ను హీరోగా పరిచయం చేస్తూ “చిత్రం” సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజ ఆ తర్వాత వరుస అవకాశాలు రావడంతో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.