Tag Archives: song

RRR Movie: కళకు కులం పిచ్చి అంటించే కొడుకులకు కుత్తుక కొయ్యాలి.. ఆర్ఆర్ఆర్ పై స్పందించిన పీవీవీ!

RRR Movie: సినీ జీవితంలో ఓటమి ఎరుగని విక్రమార్కుడిగా ఇండస్ట్రీలో దూసుకుపోతూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు ఈయన దర్శకత్వంలో ఏ ఒక్క సినిమా కూడా ఓటమిని చవిచూడలేదని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశం గర్వించేలా రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా శుక్రవారం విడుదలైంది.

RRR Movie: కళకు కులం పిచ్చి అంటించే కొడుకులకు కుత్తుక కొయ్యాలి.. ఆర్ఆర్ఆర్ పై స్పందించిన పీవీవీ!

ఈ సినిమాపై దేశవ్యాప్తంగా రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపించగా మరికొందరు మాత్రం తీవ్ర స్థాయిలో ఈ సినిమాపై విమర్శలు చేస్తున్నారు. ఇక బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ అయితే రాజమౌళిని జైలులో పెట్టాలి అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు. ఈ విధంగా పలువురు ఈ సినిమా పై నెగిటివ్ రివ్యూ ఇస్తున్నారు.

RRR Movie: కళకు కులం పిచ్చి అంటించే కొడుకులకు కుత్తుక కొయ్యాలి.. ఆర్ఆర్ఆర్ పై స్పందించిన పీవీవీ!

ఈ సందర్భంగా కొందరు సినిమా పై స్పందిస్తూ సినిమాల్లో పెద్దగా ఎమోషనల్ సన్నివేశాలు లేవని, సంగీత నేపథ్యం కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది అంటూ విమర్శలు కురిపించారు.ఈ కథను రచించడంలో విజయేంద్రప్రసాద్ తెరకెక్కించడంలో రాజమౌళి ఇద్దరు విఫలమయ్యారని కొందరు ఈ సినిమాపై విమర్శలు చేశారు. ఇలా ఈ సినిమా పై విమర్శలు రావడంతో పీవీపీ రంగంలోకి దిగి సినిమాపై నెగిటివ్ కామెంట్లు చేసిన వారికి లెఫ్ట్ రైట్ ఇచ్చారు.

అపహాస్యం చేసే వారిపై తిరగబడండి…

ట్విట్టర్ వేదికగా పీవీపీ స్పందిస్తూ..కళకు కులం పిచ్చి అంటించే కొడుకులకు, కుత్తుక కొయ్యాలి..
జాతి గర్వించే కధలు, దేశభక్తితో నెత్తురు ఉడికించే సినిమాను చూసి శభాష్ అనాలి..మన తెలుగు వాడు, ఒక జాతీయ సంపద అయినందుకు మనవాడని ఆనంద పడాలి అంటూ ట్విట్టర్ వేదికగా ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సినిమా దర్శక నిర్మాతలతో నాకు ఏ విధమైనటువంటి వ్యాపారాలు లేవు కనీసం ఒక తెలుగోడిగా, గర్వపడిండిరా కొడకల్లారా.. జీవితంలో ఒక షాట్ తియ్యలేదు, ఒక్క రోజు షూటింగ్లో నిలబడింది లేదు.. కానీ అందరికి సినిమాలు ఎలా తీయాలో మాత్రం చెబుతారు. సినీ ఇండస్ట్రీలో నీ కష్టాన్ని అపహాస్యం చేసే వారిపై తిరగబడండి అని చెప్పడమే కాకుండా ఈ సినిమా గురించి నెగిటివ్ రివ్యూ రాసిన వెబ్ సైట్ పై కేసు వేయాలని ఆయన హ్యాష్ ట్యాగ్ కూడా జ‌త చేశాడు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Pushpha Movie: శ్రీవల్లి పాటకు మోడీ అదిరిపోయే స్టెప్పులు.. వైరల్ వీడియో!

Pushpha Movie: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఈ సినిమా విడుదలై దాదాపు నెల రోజులు దాటిపోయిన ఎక్కడ చూసినా ఈ సినిమాలో పాటలు ఈ సినిమాలో డైలాగులు వినపడుతూనే ఉన్నాయి.

Pushpha Movie: శ్రీవల్లి పాటకు మోడీ అదిరిపోయే స్టెప్పులు.. వైరల్ వీడియో!

ఇక దక్షిణాది రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాది రాష్ట్రాలలో విదేశాలలో సైతం పుష్ప సినిమాకు భారీ ఈ స్థాయిలో ఆదరణ దక్కిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన మాస్ డైలాగ్ లు అలాగే చూపే బంగారమాయే శ్రీవల్లి అనే పాటకు ఎంతోమంది అచ్చం అల్లుఅర్జున్ మాదిరిగానే డాన్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

Pushpha Movie: శ్రీవల్లి పాటకు మోడీ అదిరిపోయే స్టెప్పులు.. వైరల్ వీడియో!

సాధారణ ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ పాటకు కాలు కదుపుతున్నారు. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం ఈ పాటకు డాన్స్ వేసి అందరిని నవ్వించారు. ఈ విషయం మర్చిపోకముందే ప్రధానమంత్రి నరేంద్రమోడీ సైతం ఈ పాటకు స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకున్నారు.

నిజంగానే నరేంద్రమోడీ కాదండోయ్…

పుష్ప సినిమాలో ఈ పాటకు నిజంగానే నరేంద్రమోడీ డాన్స్ చేశారా అనుకుంటే మనం పప్పులో కాలు వేసినట్లే… క్రియేటివ్ మైండ్స్ లో కార్టూన్ రూపంలో మోడీ స్టెప్పులేసినట్టు క్రియేట్ చేసి శ్రీవల్లి పాటకు స్టెప్పులు వేయించారు. ఈ పాటకు ప్రధానమంత్రి డాన్స్ చేయడమే కాకుండా తగ్గేదె లే అనే మూమెంట్ కూడా ఎంతో అద్భుతంగా చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎస్పీ బాలసుబ్రమణ్యం ఒక్క పాటకు ఎన్ని రూ. లక్షలు తీసుకున్నారో తెలుసా..

సింగర్ విజయ లక్ష్మి దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి సంగీతంలో ఎన్నో పాటలు పాడారు. ఆమె గానానికి ఎంతో మంది మంత్ర ముగ్దులయ్యారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆశక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అందులో ముఖ్యంగా.. సంగీత దర్శకుడు చక్రి గురించి మాట్లాడుతూ.. మ్యూజిక్ డైరెక్టర్ చక్రి తనను ఎంతో ప్రోత్సహించారని.. తన ప్రోత్సాహం వల్లే తన ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో తనకు ఎవరు సహాయం చేయలేదని అన్నారు.

తన మెరిట్ ప్రకారమే ఇంత వరకు వచ్చానని.. చక్రి మొదట్లో మంచి సాంగ్స్ ఇవ్వకపోయినా.. తర్వాత మంచి సాంగ్స్ తనతో పాడిచ్చారని తెలిపింది. చక్రి ఉండుంటే వేరేలా ఉండేదని.. ఎంతో మంది కొత్త వాళ్లకు చాన్స్ కూడా వచ్చేదని విజయలక్ష్మి ఈ సందర్భంగా పేర్కొన్నారు. కొత్త కొత్త వాళ్లను అతడు ఎంకరేజ్ చేసేవాడని తెలిపింది. అతడి జర్నీలో.. అతడితో పాటు ఉన్నవాళ్లు అతడిని చాలా మంది గుర్తు పెట్టుకున్నారన్నారు.

చక్రి సినిమాకు అగ్రిమెంట్ చేయించుకుంటారా అనే ప్రశ్న ఈమెకు ఎదురవగా.. అలాంటిది ఏమి లేదు.. పాట పాడిన దానికి మాత్రమే ఇస్తాడని చెప్పింది. ప్రస్తుతం చాలామంది రూ.లక్ష వరకు తీసుకుంటుంన్నారని చెప్పారు. ఒక సాంగ్ హిట్ అయితే కెరీర్ లో అలా నిలిచిపోతుంది. ఒక్క పాట హిట్ అయితే తర్వాత పాటలకు ఎక్కువ డబ్బులు అడగడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.

అలా ఆ పాట వల్ల ఎక్కువగా రెమ్యూనరేషన్ పొందొచ్చన్నారు. పాట హిట్ అయితే .. మంచిగా లైఫ్ ఉంటుందని చెప్పారు. దివంగత బాల సుబ్రమణ్యం గారు కూడా రెండు సంవత్సరాల క్రితం ఒక పాటకు రూ.లక్ష వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారని వెల్లడించారు. మిగతా వారు దాదాపు రూ.25 నుంచి రూ.50 వేల వరకు తీసుకుంటున్నారని ఈ సందర్భంగా సింగర్ విజయ లక్ష్మి తెలిపారు.