RRR Movie: సినీ జీవితంలో ఓటమి ఎరుగని విక్రమార్కుడిగా ఇండస్ట్రీలో దూసుకుపోతూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు ఈయన దర్శకత్వంలో ఏ ఒక్క సినిమా కూడా ఓటమిని చవిచూడలేదని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశం గర్వించేలా రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా శుక్రవారం విడుదలైంది.
ఈ సినిమాపై దేశవ్యాప్తంగా రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపించగా మరికొందరు మాత్రం తీవ్ర స్థాయిలో ఈ సినిమాపై విమర్శలు చేస్తున్నారు. ఇక బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ అయితే రాజమౌళిని జైలులో పెట్టాలి అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు. ఈ విధంగా పలువురు ఈ సినిమా పై నెగిటివ్ రివ్యూ ఇస్తున్నారు.
ఈ సందర్భంగా కొందరు సినిమా పై స్పందిస్తూ సినిమాల్లో పెద్దగా ఎమోషనల్ సన్నివేశాలు లేవని, సంగీత నేపథ్యం కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది అంటూ విమర్శలు కురిపించారు.ఈ కథను రచించడంలో విజయేంద్రప్రసాద్ తెరకెక్కించడంలో రాజమౌళి ఇద్దరు విఫలమయ్యారని కొందరు ఈ సినిమాపై విమర్శలు చేశారు. ఇలా ఈ సినిమా పై విమర్శలు రావడంతో పీవీపీ రంగంలోకి దిగి సినిమాపై నెగిటివ్ కామెంట్లు చేసిన వారికి లెఫ్ట్ రైట్ ఇచ్చారు.
ట్విట్టర్ వేదికగా పీవీపీ స్పందిస్తూ..కళకు కులం పిచ్చి అంటించే కొడుకులకు, కుత్తుక కొయ్యాలి..
జాతి గర్వించే కధలు, దేశభక్తితో నెత్తురు ఉడికించే సినిమాను చూసి శభాష్ అనాలి..మన తెలుగు వాడు, ఒక జాతీయ సంపద అయినందుకు మనవాడని ఆనంద పడాలి అంటూ ట్విట్టర్ వేదికగా ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సినిమా దర్శక నిర్మాతలతో నాకు ఏ విధమైనటువంటి వ్యాపారాలు లేవు కనీసం ఒక తెలుగోడిగా, గర్వపడిండిరా కొడకల్లారా.. జీవితంలో ఒక షాట్ తియ్యలేదు, ఒక్క రోజు షూటింగ్లో నిలబడింది లేదు.. కానీ అందరికి సినిమాలు ఎలా తీయాలో మాత్రం చెబుతారు. సినీ ఇండస్ట్రీలో నీ కష్టాన్ని అపహాస్యం చేసే వారిపై తిరగబడండి అని చెప్పడమే కాకుండా ఈ సినిమా గురించి నెగిటివ్ రివ్యూ రాసిన వెబ్ సైట్ పై కేసు వేయాలని ఆయన హ్యాష్ ట్యాగ్ కూడా జత చేశాడు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…