Tag Archives: sri devi drama company

Actress Indraja: ప్రేమ వివాహం గురించి అన్ని విషయాలు బయటపెట్టిన ఇంద్రజ.. ఈమె పెళ్లి ఖర్చు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Actress Indraja: టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన మంచి గుర్తింపు సంపాదించుకున్న ఇంద్రజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీతో పోలిస్తే కోలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక సినిమాలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇలా పలు సినిమాలలో నటించిన మంచి గుర్తింపు పొందిన ఈమె బ్రాహ్మణ అమ్మాయి అయినప్పటికీ తాను ముస్లిం వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.అయితే ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ బుల్లితెర కార్యక్రమాలతో ప్రారంభించిన ఇంద్రజ తాజాగా ఓ కార్యక్రమంలో భాగంగా తన ప్రేమ పెళ్లి గురించి అన్ని విషయాలు బయట పెట్టారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ..తాను మలయాళంలో హీరోయిన్ గా బిజీగా ఉన్న సమయంలోనే ప్రేమ వివాహం చేసుకున్నానని తెలిపారు.

Indraja: రోజా జబర్దస్త్ కార్యక్రమానికి వస్తే.. నేను వెళ్ళిపోతాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన ఇంద్రజ?

ఇంద్రజ 2006వ సంవత్సరంలో నటుడు, బిజినెస్‌మెన్‌ మహమ్మద్‌ అబ్సర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ దంపతులకు ఓ కుమార్తె ఉంది. ఇక తన భర్త ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ విదేశాలలో వ్యాపారాలు చేస్తూ బిజీగా ఉన్నారని తెలిపారు. ప్రేమ పెళ్లికి కేవలం 13 మంది అతిధులు మాత్రమే హాజరయ్యారని తెలిపారు. అలాగే మా పెళ్లి ఖర్చు అక్షరాల రూ.7500 అని ఈమె తన పెళ్లికి అయిన ఖర్చు గురించి వెల్లడించారు.

తల్లి పాత్రలలో నటిస్తున్న ఇంద్రజ…

ఇంద్రజ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు న్యాయ నిర్ణీతగా వ్యవహరిస్తూ ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా సినిమాలలో కూడా హీరో హీరోయిన్ల తల్లి పాత్రలలో నటిస్తున్నారు. తాజాగా ఇంద్రజ స్టాండప్ రాహుల్ అనే సినిమాలో హీరో తల్లి పాత్రలో నటించి ప్రేక్షకులను సందడి చేశారు. ఇకపోతే ఇంద్రజ తన పెళ్లి గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

నటి ఇంద్రజ అసలు పేరేంటో తెలుసా..?

టాలీవుడ్ హీరోయిన్ ఇంద్రజ గురించి ప్రేత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఇంద్రజ కొన్నేళ్లు పాటు సినిమాలకు దూరంగా ఉంది.ఈ మధ్య కాలంలో అల్లుడు అదుర్స్, సాఫ్ట్ వేర్ సుధీర్, హ్యాపీ వెడ్డింగ్ ఇలాంటి సినిమాల ద్వారా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ షో జడ్జీగా వ్యవరిస్తోంది. అప్పట్లో తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోల నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరచుకుంది.

అయితే ఇంద్రజ అసలు పేరు ఇంద్రజ కాదట. సినిమాలలో గుర్తింపు సంపాదించుకోవడం కోసం తన పేరు ఇంద్రజ గా మార్చుకుందట. ఈమె అలీ ఇలాంటి కామెడీ హీరోల నుంచి బాలయ్య మోహన్ బాబు లాంటి సూపర్ స్టార్ హీరోల వరకు అందరి సరసన నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇదే కాకుండా కొన్నేళ్లపాటు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.

ఈమె తెలుగు తమిళం మలయాళం ఇలా అన్ని భాషలలో కలిపి దాదాపుగా 50 సినిమాలకు పైగా నటించింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ ద్వారా పరిమిత సంఖ్యలో సినిమాలలో నటిస్తూ అదేవిధంగా బుల్లితెరపై ప్రసారమయ్యే పోలీసులకు జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది. ఇంద్రజ అసలు పేరు రాజాతి. ఇంద్రజ నటి అయినప్పటికీ సింగర్ కూడా కావడం గమనార్హం.

ఈమె తెలుగు అమ్మాయి అయినప్పటికీ ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అదే విషయం అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇంద్రజ 1978లో చెన్నైలో జన్మించింది. ఈమె తన 15 ఏళ్ల వయసులోనే తమిళ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టింది. ఇక తెలుగు లోనే కాకుండా ఇతర భాషలలో కూడా ఈమె నటించింది. అక్కడ కూడా ఈమెను ఒరిజనల్ పేరు కాకుండా ఇంద్రజ అనే పిలిచేవారు.

నవ్య స్వామితో సుడిగాలి సుధీర్ పెళ్లి.. వైరల్ వీడియో!

జబర్దస్త్ తో కమెడియన్ గా పరిచయమై స్టార్ కమెడియన్ గా నిలిచాడు సుడిగాలి సుధీర్. తన కామెడీ తో బాగా సందడి చేస్తుంటాడు. వెండితెరపై కూడా పలు సినిమాలలో హీరోగా అవకాశాలు అందుకున్నాడు. ఏ కామెడీ షో లోనైనా సుడిగాలి సుధీర్ ఉంటే అక్కడ సందడి ఉండాల్సిందే. ఇక ఈయనకున్న అభిమానులు కూడా అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు.

ఇక జబర్దస్త్ లో యాంకర్ రష్మీ తో ఉండే విధానం గురించి అందరికీ తెలిసిందే. తనతో ఎంతగా రచ్చ చేస్తాడో చూస్తూనే ఉంటాం. గతంలో వీరిద్దరి మధ్య ప్రేమ నడుస్తుందని త్వరలోనే పెళ్లి చేసుకుంటారని తెగ వార్తలు వినిపించాయి. కానీ అవన్నీ పుకార్లని కేవలం ఎంటర్ టైన్ మెంట్ కోసం అలా చేస్తామని పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పుడు తెలిపారు. జబర్దస్త్ లోనే కాకుండా ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ షో లో కూడా టీమ్ లీడర్ గా పని చేస్తున్నాడు. ఈ మధ్య మరో కొత్త షో శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా చేస్తున్నాడు సుధీర్. ఇదిలా ఉంటే బుల్లితెర నటితో సుధీర్ పెళ్లి జరుగగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.

శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంలో చాలా మంది సెలబ్రెటీలు పాల్గొంటున్నారు. ఇక ఇందులో ఓ స్కిట్ చేయగా అందులో సీరియల్ నటి నవ్య స్వామి కూడా పాల్గొన్నది. ఇక ఇందులో ఇమ్మానియేల్ ను పిలిచి నవ్య అంటే ఇష్టమని చెప్పాడు సుధీర్. దీంతో అక్కడే పెళ్లి చూపుల కార్యక్రమం ఏర్పాటు చేసి పెళ్లి కూడా చేసేశారు. ఈ పెళ్లికి పెద్దగా హైపర్ ఆది ఉండగా.. తీరా పెళ్లాయక మరో కమెడియన్ రాంప్రసాద్ ఫస్ట్ నైట్ ఉండదని షాక్ ఇచ్చాడు. దీంతో సుధీర్ బిత్తిరి పోగా ఇదంతా డ్రామా అని అనేసరికి మరింత షాక్ అవుతాడు సుధీర్.