జబర్దస్త్ తో కమెడియన్ గా పరిచయమై స్టార్ కమెడియన్ గా నిలిచాడు సుడిగాలి సుధీర్. తన కామెడీ తో బాగా సందడి చేస్తుంటాడు. వెండితెరపై కూడా పలు సినిమాలలో హీరోగా అవకాశాలు అందుకున్నాడు. ఏ కామెడీ షో లోనైనా సుడిగాలి సుధీర్ ఉంటే అక్కడ సందడి ఉండాల్సిందే. ఇక ఈయనకున్న అభిమానులు కూడా అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు.
ఇక జబర్దస్త్ లో యాంకర్ రష్మీ తో ఉండే విధానం గురించి అందరికీ తెలిసిందే. తనతో ఎంతగా రచ్చ చేస్తాడో చూస్తూనే ఉంటాం. గతంలో వీరిద్దరి మధ్య ప్రేమ నడుస్తుందని త్వరలోనే పెళ్లి చేసుకుంటారని తెగ వార్తలు వినిపించాయి. కానీ అవన్నీ పుకార్లని కేవలం ఎంటర్ టైన్ మెంట్ కోసం అలా చేస్తామని పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పుడు తెలిపారు. జబర్దస్త్ లోనే కాకుండా ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ షో లో కూడా టీమ్ లీడర్ గా పని చేస్తున్నాడు. ఈ మధ్య మరో కొత్త షో శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా చేస్తున్నాడు సుధీర్. ఇదిలా ఉంటే బుల్లితెర నటితో సుధీర్ పెళ్లి జరుగగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.
శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంలో చాలా మంది సెలబ్రెటీలు పాల్గొంటున్నారు. ఇక ఇందులో ఓ స్కిట్ చేయగా అందులో సీరియల్ నటి నవ్య స్వామి కూడా పాల్గొన్నది. ఇక ఇందులో ఇమ్మానియేల్ ను పిలిచి నవ్య అంటే ఇష్టమని చెప్పాడు సుధీర్. దీంతో అక్కడే పెళ్లి చూపుల కార్యక్రమం ఏర్పాటు చేసి పెళ్లి కూడా చేసేశారు. ఈ పెళ్లికి పెద్దగా హైపర్ ఆది ఉండగా.. తీరా పెళ్లాయక మరో కమెడియన్ రాంప్రసాద్ ఫస్ట్ నైట్ ఉండదని షాక్ ఇచ్చాడు. దీంతో సుధీర్ బిత్తిరి పోగా ఇదంతా డ్రామా అని అనేసరికి మరింత షాక్ అవుతాడు సుధీర్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…