Actress Indraja: టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన మంచి గుర్తింపు సంపాదించుకున్న ఇంద్రజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీతో పోలిస్తే కోలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక సినిమాలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇలా పలు సినిమాలలో నటించిన మంచి గుర్తింపు పొందిన ఈమె బ్రాహ్మణ అమ్మాయి అయినప్పటికీ తాను ముస్లిం వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.అయితే ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ బుల్లితెర కార్యక్రమాలతో ప్రారంభించిన ఇంద్రజ తాజాగా ఓ కార్యక్రమంలో భాగంగా తన ప్రేమ పెళ్లి గురించి అన్ని విషయాలు బయట పెట్టారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ..తాను మలయాళంలో హీరోయిన్ గా బిజీగా ఉన్న సమయంలోనే ప్రేమ వివాహం చేసుకున్నానని తెలిపారు.
ఇంద్రజ 2006వ సంవత్సరంలో నటుడు, బిజినెస్‌మెన్ మహమ్మద్ అబ్సర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ దంపతులకు ఓ కుమార్తె ఉంది. ఇక తన భర్త ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ విదేశాలలో వ్యాపారాలు చేస్తూ బిజీగా ఉన్నారని తెలిపారు. ప్రేమ పెళ్లికి కేవలం 13 మంది అతిధులు మాత్రమే హాజరయ్యారని తెలిపారు. అలాగే మా పెళ్లి ఖర్చు అక్షరాల రూ.7500 అని ఈమె తన పెళ్లికి అయిన ఖర్చు గురించి వెల్లడించారు.
ఇంద్రజ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు న్యాయ నిర్ణీతగా వ్యవహరిస్తూ ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా సినిమాలలో కూడా హీరో హీరోయిన్ల తల్లి పాత్రలలో నటిస్తున్నారు. తాజాగా ఇంద్రజ స్టాండప్ రాహుల్ అనే సినిమాలో హీరో తల్లి పాత్రలో నటించి ప్రేక్షకులను సందడి చేశారు. ఇకపోతే ఇంద్రజ తన పెళ్లి గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…