Tag Archives: super star krishna

Ramesh Babu Death: రమేష్ బాబు సూపర్ స్టార్ ఫ్యామిలీలో హీరోగా, ప్రొడ్యూసర్‌గా సక్సెస్ కాలేకపోవడానికి కారణం ఇదేనా?

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీలో నటులు, నిర్మాతలు ఉన్నారు. కృష్ణ.. తేనే మనసులు సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంబించారు. దాదాపు 350 పై చిలుకు చిత్రాలలో నటించి తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ అగ్ర నటుడుగా, నిర్మాతగా ఊహించని క్రేజ్ సంపాదించుకున్నారు. విజయ నిర్మలను రెండవ వివాహం చేసుకున్న కృష్ణ ఆమె దర్శకత్వంలో కూడా హీరోగా నటించి ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఆ తర్వాత పద్మాలయ స్టూడియోస్ నిర్మాణ సంస్థను స్థాపించి బ్లాక్ బస్టర్స్ నిర్మించారు. ఈ సినిమాలలో ఎక్కువగా ఇండస్ట్రీ హిట్స్ సాధించినవే. నిర్మాణ రంగంలోనే కాదు సొంత స్టూడియోను స్థాపించి సినిమాలు తీశారు.

ఇలా కృష్ణ హీరోగా, నిర్మాతగా సక్సెస్ ఫుల్ జర్నీని కొనసాగించారు. ఆ తర్వాత ఆయన వారసులు ఇండస్ట్రీలోకి వచ్చారు. రమేష్ బాబు, మహేష్ బాబు, మంజుల నటులుగా, నిర్మాతలుగా మారి తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాలను నిర్మిస్తూ, నటిస్తూ ఉన్నారు. కృష్ణ కూమార్తె మంజుల 1999లో ‘రాజస్థాన్’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ‘సమ్మర్ ఇన్ బెత్లెహెం’ అనే మలయాళ సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఇక 2002 లో ‘షో’ అనే సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలో విపరీతమైన గుర్తింపు సాధించారు.

అంతేకాదు ‘షో’ సినిమాలో నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకొని, జాతీయ స్థాయి ఉత్తమ చిత్రం, ఉత్తమ స్క్రీన్‌ప్లే పురస్కారాలు అందుకున్నారు. మంజుల తన సొంత ప్రొడక్షన్ హౌజ్ అయిన ఇందిరా ప్రొడక్షన్స్ ద్వారా సినిమాలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘నాని’, ‘పోకిరి’, ‘కావ్యాస్ డైరీ’, ‘ఏ మాయ చేశావే’, ‘మనసుకు నచ్చింది’ లాంటి సినిమాలు చేశారు. వీటిలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి’ 75 ఏళ్ళ తెలుగు సినిమా పరిశ్రమలోని రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టింది. భారీ కమర్షియల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో మంజుల సోదరుడు, సూపర్ స్టార్ కృష్ణ తనయుడు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించాడు. మంచి కథ దొరికే మంజుల ఇప్పటికీ సినిమాలు నిర్మించడానికి రెడీగా ఉన్నారు.

ఇక ఈ ఫ్యామిలీలో మరో వారసుడు కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు. నటుడుగా, నిర్మాతగా సినిమాలు చేశాడు. అయితే ఘట్టమనేని ఫ్యామిలీలో అంతగా సక్సెస్ కాలేదంటే అది రమేష్ ఒక్కడే. మనషులు చేసిన దొంగలు, పాలు నీళ్ళు, నీడ వంటి సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన రమేష్, సామ్రాట్ సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత చిన్ని కృష్ణుడు, బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు, కృష్ణగారి అబ్బాయి, ఆయుధం, కలియుగ అభిమన్యుడు వంటి సినిమాలలో నటించాడు. కానీ హీరోగా స్టార్ డం దక్కలేదు. ఆ తర్వాత సొంతగా కృష్ణ ప్రొడక్షన్స్ స్థాపించారు.

ఈ నిర్మాణ సంస్థలో హిందీ ‘సూర్యవంశం’ నిర్మించారు. ఇది పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో తమ్ముడు మహేష్ బాబు హీరోగా ‘అర్జున్’ సినిమాను నిర్మించారు. ఈ సినిమా అద్బుతంగా ఉందనే ప్రశంసలు దక్కినప్పటికీ కమర్షియల్ గా మాత్రం నిరాశపరచింది. దీని తర్వాత మహేష్ హీరోగా యూటీవీ మోషన్ పిక్చర్స్ తో కలిసి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘అథిది’ సినిమాను నిర్మించి దెబ్బతిన్నాడు. చివరిగా రమేష్ బాబు సమర్పణలో ‘దూకుడు’ సినిమా వచ్చింది. ఈ సినిమా భారీ హిట్ సాధిచింది. ఈ సినిమా తర్వాత రమేష్ బాబు నిర్మాతగా, నటుడిగా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. అయితే రమేష్ బాబు ప్రస్తుతం సూపర్ స్టార్ సొంత నిర్మాణ సంస్థలకి, ఇతర వ్యాపారాలకి సంబంధించిన పనులు చూసుకుంటున్నారు.

అయితే సూపర్ స్టార్ కృష్ణ కు ఉన్న భారీ ఇమేజ్ తో అయనకు పెద్ద ఎత్తున అవకాశాలు వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు రమేష్ బాబు.. ఈ క్రమంలో అయన నటనపై పెద్దగా దృష్టి పెట్టలేదు, మరోవైపు ఆయనకున్న పలు అలవాట్ల వాళ్ళ ఆయన శరీరాకృతి కూడా మారిపోయింది. హీరోగా ఆయనను చూడలేని పరిస్థితి వచ్చేయడం మరోవైపు ఆయనకు సినిమాలపై ఆశక్తి కూడా తగ్గిపోవడంతో ఈ రంగానికి పూర్తిగా దూరమైపోయారు. గత కొద్దికాలంగా అయన పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. ఈ నేపధ్యంలో కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అయన శనివారం తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్ గచ్చిబౌలీ లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అయితే అప్పటికే అయన మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. అయన మృతి పట్ల పవన్ కళ్యాణ్ తో పాటూ పలువురు సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.

Krishna: ఎన్టీఆర్ ఈ సినిమా ఎప్పుడు తీస్తారా అని ఎదురు చూసా… నా జీవితంలో ఇదే బెస్ట్ సినిమా: కృష్ణ

Krishna: టాలీవుడ్ సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈయన దాదాపు గత నాలుగైదు సంవత్సరాల క్రితం వరకు పలు సినిమాలలో తండ్రి పాత్రలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం వయసు పైబడటంతో కృష్ణ సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తూ పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఇదిలా ఉండగా హైదరాబాద్ లో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు ఏపీ, తెలంగాణ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా సూపర్ స్టార్ కృష్ణకు ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అవంతి శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్, మోహన్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ్, నిర్మాత అశ్వినీదత్ వంటి ప్రముఖులు హాజరయ్యారు.

Krishna: ఎన్టీఆర్ ఈ సినిమా ఎప్పుడు తీస్తారా అని ఎదురు చూసా… నా జీవితంలో ఇదే బెస్ట్ సినిమా: కృష్ణ

ఈ కార్యక్రమంలో వీరు అల్లూరి సీతారామరాజు చిత్రంలో నటించిన సూపర్ స్టార్ కృష్ణ గారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Krishna: నా 365 సినిమాలలో బెస్ట్ మూవీ అదే…

చిన్నప్పటి నుంచి అల్లూరి సీతారామరాజు గురించి ఎన్నో బుర్రకథలలో విన్నాను. ఈ సినిమాని ఎన్టీఆర్ గారు ఎప్పుడు చేస్తారా అని ఈ సినిమా కోసం ఎదురు చూశాను. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఎన్టీఆర్ చేయలేకపోయారు. ఈ క్రమంలోనే తన 100వ చిత్రంగా తానే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించి ఇందులో నటించాను. ఈ సినిమా ఎంత విజయం సాధించిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. నేను నటించిన 365 చిత్రాలలో అల్లూరి సీతారామరాజు సినిమా బెస్ట్ చిత్రం అని ఈ కార్యక్రమంలో కృష్ణ తెలియజేశారు.

27 సంవత్సరాలను పూర్తిచేసుకున్న హీరో గురించి ఎవరికీ తెలియని నిజాలు ఇవే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన సమయంలో వరుస ఫ్లాప్ చిత్రాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.ఇక ఇండస్ట్రీలో కృష్ణ గారి సినీ ప్రస్థానం ముగిసిందని అందరూ అనుకుంటున్న సమయంలో ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో నెంబర్ వన్ సినిమాను తెరకెక్కించారు.

ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని దక్కించుకోవడంతో తిరిగి కృష్ణ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. ఇక అదే ఏడాది గోవిందా గోవిందా అనే సినిమా తెరకెక్కించి ఎంతో నష్టపోయిన నిర్మాత అశ్వినీదత్ ను శుభలగ్నం సినిమా ద్వారా ఎస్ వి కృష్ణారెడ్డి తనని ఇండస్ట్రీలో నిలబెట్టారు. అలాగే కమెడియన్ అలీ హీరోగా యమలీల సినిమాను తెరకెక్కించి బాక్సాఫీస్ వద్ద ఒక కమెడియన్ సినిమా కూడా ఇంతగా హిట్ అవుతుందా అని నిరూపించాడు.

ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ సౌందర్య హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం టాప్ హీరో. ఈ సినిమాపై ఇండస్ట్రీలో ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. విడుదలకు ముందే ఈ సినిమా ఊహించని విధంగా బిజినెస్ చేసి నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. ఇలా ఎన్నో అంచనాల నడుమ టాప్ హీరో డిసెంబర్ 9 1994లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇలా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో బయ్యర్లు ఎంతగానో నష్టపోయారు.ఈ సినిమాతో ఎస్.వి.కృష్ణారెడ్డి స్టార్ హీరోలను హ్యాండిల్ చేయలేడు అనే విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. ఇక ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఫ్లాప్ గా నిలిచిన ఈ టాప్ హీరో 27 సంవత్సరాలను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది.

‘స్నేహం కోసం’ సినిమాలో ఆ పాత్రకు సూపర్‌‌‌స్టార్ కృష్ణ, తర్వాత రాజశేఖర్ ను అనుకున్నారట.. కానీ చివరకు..

ఒకప్పుడు తమిళంలో కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలోనే వచ్చిన నట్పుక్కాగ అనే చిత్రం మెగస్టార్ చిరంజీవిని బాగా ఆకట్టుకుంది. తమిళంలో శరత్ కుమార్, సిమ్రాన్ జంటగా నటించారు. దానిని 1999లో అతడి దర్శకత్వంలోనే ‘స్నేహం కోసం’ అనే తెలుగు టైటిల్ తో విడుదల అయిన విషయం తెలిసిందే. చిరంజీవి, మీనా ఇందులో ప్రధాన పాత్రధారులు.

శ్రీ సూర్య మూవీస్ బ్యానరు పై ఎ. ఎం. రత్నం ఈ చిత్రాన్ని నిర్మించాడు. చిరంజీవి ఇందులో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు. తండ్రి చిరంజీవికి ఆప్తమిత్రుడిగా ప్రముఖ నటుడు విజయకుమార్ నటించాడు. ఈ సినిమా పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. అయితే అందులో చిరంజీవి స్నేహితుడిగా విజయ కుమార్ చేసిన పాత్రకి ముందుగా సూపర్ స్టార్ కృష్ణని అనుకున్నారట.

మెగాస్టార్ చిరంజీవి నటించిన స్నేహంకోసం సినిమా షూటింగ్‌‌కి ముందు వీరిద్దరూ ఇందులో కలిసి నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ అవి కేవలం వార్తలుగానే మిగిలిపోయాయి. ఎందుకుంటే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు బంపర్ హిట్ అయ్యాయి. అందుకనే అలా ఆలోచించారట. ఇదంతా అనుకుంటుడగానే.. చిరంజీవి ఎందుకో సూపర్ స్టార్ ను సంప్రదించలేదట. తర్వాత ఆ పాత్రను రాజశేఖర్ ను అనుకొని అతడిని సంప్రదించారు మూవీ మేకర్స్.

ఇక రాజశేఖర్ ఆ పాత్రకు ఓకె అయిన సమయంలో చిరంజీవి వెళ్లి.. ఆ పాత్ర చేయకపోవడమే మంచిది.. ఈ సమయంలో ఓల్డ్ రోల్స్ చేయడం కరెక్ట్ కాదని చెప్పడంతో విరమించుకోవాల్సి వచ్చిందట. చివరకు ఆ పాత్రకు తమిళంలో నటించిన విజయ్ కుమారే చేయాల్సి వచ్చిందట.

రమేష్ బాబు సినిమాలకు దూరం కావడానికి కారణం అదే.. అసలు విషయం బయట పెట్టిన కృష్ణ!

సూపర్ స్టార్ కృష్ణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత ఆరు దశాబ్దాల నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న కృష్ణ వారసులుగా ఇండస్ట్రీలో మహేష్ బాబు, రమేష్ బాబు అడుగు పెట్టిన సంగతి మనకు తెలిసిందే.అయితే వీరిలో మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో గా కొనసాగుతున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయి సినిమాలపై దృష్టి సారించిన మహేష్ బాబు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. అదేవిధంగా కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు కృష్ణతో కలిసి పోరాటం అనే సినిమాలో నటించారు. ఇందులో మహేష్ బాబు కూడా నటించారు.ఈ సినిమా తర్వాత రమేష్ నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో తనకు సినిమాలపై ఆసక్తి తగ్గిపోయిందని ఆ కారణం చేతనే తను ఇండస్ట్రీ నుంచి దూరం అయ్యారని ఇంటర్వ్యూ సందర్భంగా కృష్ణ తెలియజేశారు.

ఈ క్రమంలోనే సినిమాలకు దూరమైన రమేష్ బాబు మహేష్ బాబు సినిమా వ్యవహారాలతో పాటు, తన బిజినెస్ లను కూడా చూసుకుంటున్నట్లు తెలిపారు.గతంలో నమ్రత మహేష్ బాబు వ్యవహారాల అన్నింటినీ చూసుకుంటుందని వార్తలు వచ్చినప్పటికీ నమ్రత కేవలం పిల్లల బాధ్యతలు మాత్రమే చూసుకుంటుందని తను ఎలాంటి వ్యవహారాల్లో కలుగజేసుకోదని కృష్ణ ఈ సందర్భంగా వెల్లడించారు.

నమ్రత పిల్లలతో పాటు కుటుంబ బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తారు. తను కోడలుగా కాకుండా కూతురిగా మాతో కలిసి పోయింది అంటూ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా కృష్ణ తన కొడుకు, కోడలు గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఇక ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారీ వారి పాట చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

హాఫ్ సెంచరీ కొట్టిన ‘మోసగాళ్లకు మోసగాడు’.. అప్పట్లో భారీ బడ్జెట్.. సూపర్ హిట్ టాక్ అయినా నష్టాలే..

పద్మాలయా ఫిలింస్ బ్యానర్‌లో సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల హీరో, హీరోయిన్లుగా ప్రముఖ నిర్మాత ఘట్టమనేని ఆది శేషగిరిరావు ప్రతిష్టాత్మకం గా నిర్మించిన ‘మోసగాళ్లకు మోసగాడు’. ఈ చిత్రం విడుదలై నేటికి అంటే ఆగస్టు 27 నాటికి 50 సంవత్సరాలు. ఇది ఆగస్టు 27, 1971 సంవత్సరంలో విడుదలైంది. ఈ సినిమా అప్పట్లో పెద్ద బంపర్ హిట్ కొట్టేసింది.

అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా తెచ్చుకుంది. భారతదేశంలో తొలి కౌబాయ్ చిత్రం కావడం కూడా విశేషం. ఇది దాదాపు ప్రపంచవ్యాప్తంగా 125 దేశాలలో ప్రదర్శింపబడి ప్రకంపనలు సృష్టించింది. పాన్ ఇండియా సినిమాలు అని చెప్పుకుంటున్న ఈ రోజుల్లో ఏ మాత్రం గ్రాఫిక్స్ లేకుండా సినిమాను తీయలేకపోతున్నారు. కానీ ఆ రోజుల్లోని ఇలాంటి పాన్ ఇండియా సినిమాతీసి సంచలనం స్పష్టించారు. ఆ సినిమాతో సూపర్ స్టార్ కృష్ణను అభిమానులు ఆంధ్రా జేమ్స్‌బాండ్ అని పిలవడం మొదలు పెట్టారు.

మరో విశేషం ఏంటంటే.. పద్మాలయా సంస్థ కూడా రూపొందించబడి 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. హిందీ, తమిళం, ఇంగ్లీష్‌తో పాటు రష్యన్, స్పానిష్‌తో పలు భాషల్లో డబ్ చేయబడింది ఈ చిత్రం. ఈ సినిమా విడుదలైన తర్వాత కొన్నాళ్లకు కొన్ని థియేటర్లలో మళ్లీ విడుదల చేశారు. అప్పుడు కూడా విజయవంతంగా రన్ చేయబడిన చిత్రం మోసగాళ్లకు మోసగాడు. ఈ సినిమాను అప్పట్లో రూ. 6 లక్షల 70 వేలతో రూపొందించారు. అయితే ఆ సమయంలో నాన్ థియేట్రికల్ రైట్స్ పెద్దగా వచ్చేవి ఏమీలేకపోవడం ఒక పెద్ద మైనస్ అయింది. ఇక సినిమా రూ.4.5 లక్షలకు విక్రయించారు. దీనితో అప్పట్లోనే సూపర్ స్టార్ కృష్ణ సొంత బ్యానర్ కావడంతో రూ.2.5 లక్షల వరకు నష్టాలు వచ్చినట్టు తెలుస్తుంది.

ఈ చిత్రానికి ఆది నారాయణ రావు సంగీతం అందించగా.. వి.యస్.ఆర్.స్వామి సినిమాటోగ్రఫీ అందించారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. 1972 సంవత్సరంలో రష్యాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఈ చిత్రం ప్రదర్శింపబడింది.

ఎన్టీఆర్ వద్దంటే.. కృష్ణ చేసి ఇండస్ట్రీలో తిరుగులేని రికార్డును సృష్టించారు..

గతంలో సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ సినిమాలు బాగా ప్రేక్షకాదరణ పొందేవి. సంవత్సరానికి పదుల సంఖ్యలో సినిమాలు తీస్తూ ప్రేక్షకులను సందడి చేసేవారు.ఈ క్రమంలోనే ఎన్నో అద్భుతమైన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరోలు వారి సినీ కెరీర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలే ఉన్నాయని చెప్పవచ్చు.ఇక హీరో కృష్ణ విషయానికి వస్తే ఎన్నో విభిన్న కథాచిత్రాల్లో నటించి మంచి ప్రేక్షకాదరణ పొందాడు.

సూపర్ స్టార్ కృష్ణ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా దర్శకుడిగా కూడా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక కృష్ణ కెరీర్లో ఎన్నో విజయవంతమైన సినిమాలున్నాయి.అలాంటి విజయవంతమైన సినిమాల్లో ఒకటిగా ఎంతో పేరు సంపాదించుకున్న సినిమా “అల్లూరి సీతారామరాజు” అని చెప్పవచ్చు. అప్పట్లో ఈ సినిమా రికార్డులు సృష్టించింది.

ఇక ఈ సినిమాలోని పాటల విషయానికి వస్తే అది ఒక అద్భుతం. ఇప్పటికి ఈ సినిమాలోని పాటలు మనకు వినబడుతూనే ఉంటాయి. ముఖ్యంగా “తెలుగువీర లేవరా..”అనే పాట శ్రోతలను బాగా ఆకట్టుకుంది. అసాధ్యుడు సినిమాలో కృష్ణ అల్లూరి సీతారామరాజు వేషం వేశారు. ఈ సినిమాకు రామచంద్ర రావు దర్శకత్వం వహించారు.ఈ క్రమంలోనే అల్లూరి సీతారామరాజు కథ సిద్ధం కాగా ఈ సినిమాను దర్శకుడు రామచంద్రరావు ముందుగా ఎన్టీఆర్ దగ్గరకు తీసుకువెళ్లారు.

కథ మొత్తం విన్న ఎన్టీ రామారావు కథ అద్భుతంగా ఉందని చెప్పి, కొన్ని కారణాల వల్ల ఈ సినిమాలో నటించడానికి ఎన్టీఆర్ ఒప్పుకోలేదు.ఈ క్రమంలోనే రామచంద్రరావు ఈ కథను కృష్ణ దగ్గరకు తీసుకు వెళ్లడం కృష్ణ అందుకు ఒప్పుకోవడంతో ఈ సినిమా పట్టాలెక్కింది.ఈ విధంగా 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న దర్శకుడు రామచంద్రరావు అనివార్య మృతి వల్ల ఈ సినిమా మిగిలిన భాగాన్ని కెఎస్ఆర్.దాస్ తెరకెక్కించగా కృష్ణ పద్మాలయ సంస్థ పై ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ విధంగా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మొదటి షో లో అద్భుతమైన టాక్ సంపాదించుకుంది. ఈ విధంగా థియేటర్ల వద్ద మంచి విజయం దక్కించుకున్న ఈ సినిమా కృష్ణ కెరీర్లోనే ఒక అత్యున్నతమైన సినిమాగా నిలిచిపోయింది.

సుడిగాలి సుధీర్ టీంపై మండిపడుతున్న సూపర్ స్టార్ అభిమానులు.. ఎందుకంటే..?

ఈటీవీలో ప్రతీ శుక్రవారం రాత్రి ప్రసారమవుతున్న ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. అయితే అందులో హీరో సూపర్ కృష్ణను అవమానించేలా జబర్ధస్త్ టీమ్ మెంబర్స్ సుడిగాలి సుధీర్ చేసిన స్కిట్స్ పై సూపర్ స్టార్ అభిమానులు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు.

అయితే ఈ షోలో ఎక్కువ శాతం బడా హీరోల పాత్రలను, ఇంకా డ్యాన్స్ లను పేరడీగా తీసుకొని చేస్తుండటం.. వాటిని కామెడీ మలిచి ప్రేక్షకులకు చూపిస్తుంటారు. అందులో కొంత వరకు విజయవంతం అవుతాయి. కానీ కొన్ని కొన్ని బెడసి కొడతాయి. అదేంటంటే.. తాజాగా ఈటీవీలో ప్రసారమైన ఎక్స్‌ట్రా జబర్ధస్త్ కామెడీ షో ప్రోగ్రామ్‌లో సుడిగాలి సుధీర్ చేసిన స్కిట్ కు సూపర్ స్టార్ కృష్ణ అభిమానులకు కోపం తెప్పిచ్చింది.

అందులో సూపర్ స్టార్ కృష్ణ నటించిన అమ్మ దొంగా సినిమాలోని నీతో సాయంత్రం ఎంతో సంతోషం అనే పాటను పేరడీగా చేశారు. దీనిని ప్రతీ సారి సుధీర్ ఒక పేరడీ డ్యాన్స్ గా వేస్తుండటంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఢీ, శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి షోలో కూడా అప్పుడప్పుడు ఆ పాటను పేరడీగా చేసి కామెడీగా మలుస్తుండటంతో సూపర్ స్టార్ కృష్ణ ఇమేజ్‌ను దెబ్బతీసే విధంగా ఉందంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై సుడిగాలి సుధీర్‌తో పాటు అతడి టీమ్ మెంబర్స్ పై అభిమానులు మండిపడుతున్నారు. దీనిపై వాళ్లు ఎలా స్పందిస్తారనేది చూడాలి మరి.

సూపర్ స్టార్ కృష్ణ సింహాసనం సినిమా గురించి ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.! అప్పట్లో బాహుబలి రేంజ్..!

సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఎన్నో విజయవంతమైన సినిమాలలో “సింహాసనం” సినిమా ఒకటి అని చెప్పుకోవచ్చు.అయితే ఈ సినిమా విడుదలై దాదాపు 35 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ తరం వారికి ఈ సినిమా గురించి బహుశా తెలియకపోయి ఉండొచ్చు.ఈ సినిమాలోని ప్రత్యేకత గురించి తెలిస్తే మాత్రం వెంటనే ఈ సినిమాను చూడకుండా ఉండలేరని చెప్పవచ్చు. మరి కృష్ణ గారు నటించిన “సింహాసనం” సినిమా ప్రత్యేకతలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

కృష్ణ సింహాసనం సినిమా దర్శకత్వం, నిర్మాత, ఎడిటర్, హీరో అన్ని సూపర్ స్టార్ కృష్ణ గారే వ్యవహరించారు. అంతేకాకుండా తెలుగులో మొట్టమొదటి 70 ఎంఎం స్టీరియోఫోనిక్‌ సౌండ్‌ సినిమా కూడా ఇదే అని చెప్పవచ్చు. ఈ సినిమా ప్రత్యేకత గురించి సింపుల్ గా చెప్పాలంటే 80 సంవత్సర కాలంలో ఈ సినిమా కూడా ఒక బాహుబలి సినిమా అని చెప్పవచ్చు. సింహాచలం సినిమా వసూళ్ల విషయంలో కానీ, రికార్డుల విషయంలో కానీ బాహుబలి సినిమాకు ఏ మాత్రం తీసిపోదని చెప్పవచ్చు.

ఈ సినిమా విడుదలైన సమయంలో సినిమా టికెట్ల కోసం ప్రేక్షకులు 12 కిలోమీటర్ల మేరా లైన్లో వేచి ఉన్నారంటే ఈ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని సృష్టించిందో అర్థమవుతుంది. ఆ రోజుల్లో ఈ సినిమాను నిర్మించడం కోసం 3.5 కోట్ల రూపాయలు ఖర్చు కాగా ఈ కింద 5 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇక ఈ సినిమా 100 రోజుల ఫంక్షన్ చెన్నైలో నిర్వహించగా కార్యక్రమానికి కృష్ణ అభిమానులు నాలుగు వందల బస్సులలో అక్కడికి చేరుకున్నారు. ఈ విధంగా 35 సంవత్సరాల క్రితమే అద్భుతమైన రికార్డులను సృష్టించిన సినిమా కృష్ణ నటించిన సింహాసనం సినిమా అని చెప్పవచ్చు.