ఈటీవీలో ప్రతీ శుక్రవారం రాత్రి ప్రసారమవుతున్న ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. అయితే అందులో హీరో సూపర్ కృష్ణను అవమానించేలా జబర్ధస్త్ టీమ్ మెంబర్స్ సుడిగాలి సుధీర్ చేసిన స్కిట్స్ పై సూపర్ స్టార్ అభిమానులు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు.
అయితే ఈ షోలో ఎక్కువ శాతం బడా హీరోల పాత్రలను, ఇంకా డ్యాన్స్ లను పేరడీగా తీసుకొని చేస్తుండటం.. వాటిని కామెడీ మలిచి ప్రేక్షకులకు చూపిస్తుంటారు. అందులో కొంత వరకు విజయవంతం అవుతాయి. కానీ కొన్ని కొన్ని బెడసి కొడతాయి. అదేంటంటే.. తాజాగా ఈటీవీలో ప్రసారమైన ఎక్స్‌ట్రా జబర్ధస్త్ కామెడీ షో ప్రోగ్రామ్‌లో సుడిగాలి సుధీర్ చేసిన స్కిట్ కు సూపర్ స్టార్ కృష్ణ అభిమానులకు కోపం తెప్పిచ్చింది.
అందులో సూపర్ స్టార్ కృష్ణ నటించిన అమ్మ దొంగా సినిమాలోని నీతో సాయంత్రం ఎంతో సంతోషం అనే పాటను పేరడీగా చేశారు. దీనిని ప్రతీ సారి సుధీర్ ఒక పేరడీ డ్యాన్స్ గా వేస్తుండటంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఢీ, శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి షోలో కూడా అప్పుడప్పుడు ఆ పాటను పేరడీగా చేసి కామెడీగా మలుస్తుండటంతో సూపర్ స్టార్ కృష్ణ ఇమేజ్‌ను దెబ్బతీసే విధంగా ఉందంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై సుడిగాలి సుధీర్‌తో పాటు అతడి టీమ్ మెంబర్స్ పై అభిమానులు మండిపడుతున్నారు. దీనిపై వాళ్లు ఎలా స్పందిస్తారనేది చూడాలి మరి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…