Featured

నాగార్జున అసలు బిహేవియర్ ఏంటో.. ఆధారాలతో సహా బయటపెట్టిన జేడీ చక్రవర్తి

జేడీ చక్రవర్తి.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయనది ఒక ప్రత్యేక స్థానం. అందరు హీరోలు వేరు.. జేడీ చక్రవర్తి వేరు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే తత్వం. అలాగే.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వివాదాలు కూడా ఎక్కువే. ఆయన నటించిన సినిమాలు చాలా తక్కువ అయినప్పటికీ.. ఆయన నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం విజయవంతం అయ్యాయి. జేడీ చక్రవర్తి.. ఆయన అనుకున్న సినిమాల్లో మాత్రమే నటించారు.

అందుకే ఆయన చాలా తక్కువ సినిమాల్లో నటించాల్సి వచ్చింది. కానీ.. ఆయన నటించిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు జేడీ చక్రవర్తి. ఆయన ఇండస్ట్రీలోకి రావడం రావడమే ఆయనకు శివ సినిమాలో చాన్స్ వచ్చింది. ఆ సినిమాలో ఆయన విలన్ గా నటించాడు. నిజానికి.. చక్రవర్తి హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చాడు కానీ.. ముందు విలన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.

శివ రిలీజ్ కాకముందే నాగార్జున నాకు వేరే సినిమాలో అవకాశం ఇప్పించారు

శివ సినిమాలో హీరో నాగార్జున అని తెలుసు కదా. ఆ సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు జేడీ చక్రవర్తి. అయితే.. అప్పట్లో నాగార్జునతో చక్రవర్తికి రిలేషన్ షిప్ ఉండేదట. అందుకే.. శివ సినిమా పూర్తి కాకముందే మరో సినిమాలో అవకాశం ఇప్పించారట నాగార్జున. అయితే.. చక్రవర్తికి హీరో అవ్వాలనే లక్ష్యం ఉండటం శివ సినిమా షూటింగ్ లో నాగార్జునకు తెలిసిందట. శివ కాకముందే అందుకే నేటి సిద్ధార్థ అనే సినిమాలో విలన్ గా నటించాడు జేడీ చక్రవర్తి. శివ సినిమా రిలీజ్ కాకముందే.. నేటి సిద్ధార్థ సినిమా షూటింగ్ అయిపోయిందట.

అలా మనీ సినిమాలో అవకాశం వచ్చింది

అయితే.. శివ సినిమా షూటింగ్ లో చక్రవర్తితో మాట్లాడుతున్న సమయంలో.. జేడీ చక్రవర్తి హీరో అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చినట్టు నాగార్జునకు తెలిసి.. తన సినిమాల్లో విలన్ గా అవకాశం ఇవ్వలేదట. ముందు కిల్లర్ సినిమాలో మెయిన్ విలన్ గా చక్రవర్తికి అవకాశం ఇద్దామని అనుకున్నా.. చక్రవర్తి టాలెంట్ చూసి.. చక్రవర్తి హీరోగా అయితే బాగా సెట్ అవుతాడని అనుకొని విలన్ గా ఆ సినిమాలో అవకాశం ఇవ్వలేదట. దీంతో.. ఈ విషయం తెలిసి.. నాగార్జున ఇంటికి వెళ్లాడట చక్రవర్తి. ఏంటి సార్.. నాకు కిల్లర్ లో మెయిన్ విలన్ అవకాశం ఇస్తా అన్నారు. ఇప్పుడు వద్దన్నారట అని చెప్పగానే.. అవును చక్రవర్తి. నువ్వు విలన్ కన్నా హీరోగా బాగా సూట్ అవుతావు.

ఒకవేళ నువ్వు విలన్ గా సినిమాలు చేస్తూ పోతే.. ఇండస్ట్రీలో విలన్ గానే సెట్ అయిపోతావు కానీ.. హీరో ఎప్పటికీ కావు. నువ్వు హీరో మెటిరియల్.. అందుకే నువ్వు హీరోగా ట్రై చేయి.. మంచి అవకాశాలు వస్తాయి. నువ్వు ఖచ్చితంగా హీరో అవుతావు.. అని చక్రవర్తికి నాగార్జున నచ్చజెప్పారట. అలా.. రామ్ గోపాల్ వర్మ సినిమా మనీలో హీరోగా జేడీ చక్రవర్తికి అవకాశం వచ్చిందట. అప్పటి నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోకుండా.. వరుసగా హీరోగా సినిమాలు చేసి సూపర్ సక్సెస్ సాధించాడు జేడీ చక్రవర్తి. అందుకే.. నాగార్జునకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను.. అని అన్నాడు జేడీ చక్రవర్తి. 

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago