Featured

ఎఫ్ 3తో నాకు నేనే సవాల్ విసురుకుంటున్నా.. గెలుస్తానో ఓడతానో తెలీదు: అనీల్ రావిపూడి

ఒక డైరెక్టర్ కంటిన్యూస్ గా హిట్స్ ఇవ్వడం అంటే అంత ఈజీ కాదు. దర్శకుడిగా డెబ్యూ సినిమాతో హిట్ ఇచ్చిన దర్శకులు చాలామంది రెండవ సినిమాతో ఫట్ అన్న వాళ్ళే. రెండవ సినిమా కూడా సూపర్ హిట్ ఇచ్చినా మూడవ సినిమా మాత్రం ఫ్లాప్ గా మిగిలి దెబ్బైన దర్శకులు ఉన్నారు. కానీ రాజామౌళి, కొరటాల శివ తర్వాత అలా ఒక్క ఫ్లాప్ కూడా చూడని దర్శకుడు అనీల్ రావిపూడి. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా పటాస్ అనే సినిమాను తెరకెక్కించి డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. మొదటి సినిమా మంచి హిట్ గా నిలవడంతో నెక్స్ట్ సినిమా మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ తో చేసే అవకాశం అందుకున్నాడు.

రెండవ సినిమా సుప్రీం. సాయి ధరం తేజ్ – బబ్లీ బ్యూటి రాశి ఖన్నా జంటగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత మాస్ మహారాజాతో రాజా ది గ్రేట్ సినిమా చేశాడు. అప్పటి వరకు రవితేజ హిట్స్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాడు. అలాంటి సమయంలో అనిల్ రావిపూడి ఒక అంధుడి పాత్ర చెప్పి ఒప్పించడం అంటే చాలా రిస్క్ తో కూడుకున్న విషయం. ఇక్కడ రవితేజ కూడా దర్శకుడిగా తన మీద ఉన్న నమ్మకంతో ఒప్పుకున్నాడు.  రాజా ది గ్రేట్‌ మూవీ కథ చాలా ఠఫ్. అంధుడి పాత్రను రాసుకుంటున్నప్పుడు, తెరమీదకి ఎక్కించేప్పుడు ఆయన కూడా కష్టంగా భావించాడు. అందుకే పక్కా స్టోరీ బోర్డ్ వేసుకొని ప్రతి షాట్‌ను ఎంతో జాగ్రత్తగా చేశాడు.

రాజా ది గ్రేట్‌ కి ముందు తీసిన రెండు సినిమాలు, ఆ తర్వాత తీసిన సినిమాల కంటే ఇదే చాలా క్లిష్టమైన, కష్టమైన కథ. అయినా హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. రవితేజకి భారీ హిట్ ఇచ్చాడు. ఇలా బ్యా టు బ్యాక్ మూడు భారీ హిట్స్ అందుకున్న అనిల్ రావిపూడి రిలాక్స్ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ ట్విస్ట్ ఇస్తూ మల్టీస్టారర్ గా ఎఫ్ 2 ప్రకటించాడు. ఇద్దరు స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్స్ తో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అంటే బాలీవుడ్ లో వచ్చే సినిమాల ఫార్మాట్. అక్కడ వచ్చే కొన్ని సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకొని విజయం సాధిస్తాయి.

అలాంటి జోనర్ లో అనిల్ రావిపూడి ఎఫ్ 2 కథ రాసుకున్నాడు. అందులో వెంకటేశ్ – మెగా వరుణ్ తేజ్, తమన్నా – మెహ్రీన్ సరిగ్గా సరిపోయారు. ఇక నిర్మాత దిల్ రాజు కూడా ఖర్చుకు వెనకాడకుండా భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. సంక్రాంతి పండుగ సీజన్ లో వచ్చి 100 కోట్ల పైగా వసూళ్ళు రాబట్టి అందరినీ షాక్ కి గురి చేసింది. దాంతో అనిల్ రావిపూడికి రెండు బంపర్ ఆఫర్స్ వచ్చాయి. ఒకటి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం. రెండోది ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 తీద్దామని దిల్ రాజు ఆఫర్ ఇవ్వడం.

ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు తీసి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఇప్పుడు ఎఫ్ 3 చేస్తున్నాడు. దాదాపు ఎఫ్ 2 టీం మొత్తం పనిచేస్తోంది. ఒకరకంగా ఈ సినిమా సీక్వెల్ అంటే అనిల్ రావిపూడి తనకి తానే సవాల్ విసురుకున్నట్టు. మరి ఇందులో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. ప్రస్తుతం ఈ సినిమా 80 శాతం కి పైగా చిత్రీకరణ పూర్తయింది. 2022 సంక్రాంతి బరిలో దింపేందుకు దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ – రానాల ఏకే రీమేక్, ప్రభాస్ రాధే శ్యాం లాంటి సినిమాలు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకొని ఉన్నాయి. మరి ఎఫ్ 3 రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుందో చూడాలి.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పసుపు అరటి కాదు… ఎర్ర అరటి తింటేనే అసలు హెల్త్ సీక్రెట్!

మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…

6 hours ago

విశాఖలో విషాదం.. యువతి ఆత్మహత్య కేసులో ఆరుగురు అరెస్ట్

విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…

6 hours ago

ఫోన్‌తో టాయిలెట్‌లో గడిపితే… మీ శరీరం చెల్లించాల్సిన ధర ఇదే!

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…

6 hours ago

టాలీవుడ్‌కు ఘట్టమనేని వారసుడి ఎంట్రీ.. హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ హాట్ టాపిక్

తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…

6 hours ago

కేరళ సీఎంకు లేఖ.. మోనాలిసా కేసులో కొత్త ట్విస్ట్

‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…

6 hours ago

పచ్చదనం మంచిదే కానీ.. ఈ చెట్లకు దూరంగా ఉండండి!

ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…

7 hours ago