దర్శకుడు కదీర్ తను చూసిన కొన్ని ప్రేమకథా చిత్రాల కంటే భిన్నంగా ఓ ప్రేమ కథ చిత్రం చేయాలనుకున్నారు.ఆ క్రమంలో ఆయన దాదాపు ఆరు నెలలు కష్టపడి ఓ కథ రాసుకున్నారు. ఆయన కొంత విరామం కావాలనుకుని ముంబాయి, బెంగళూరు అలా పర్యటిస్తున్న సందర్భంలో బెంగళూరులో ఒక కేఫ్ లో స్టైల్ గా దువ్వుకొని ఒక అబ్బాయి కనిపించాడు. వెళ్లి అతని గురించి వాకబు చేయగా తను మోడలింగ్ చేస్తున్నాని చెప్పాడు. అయినా ఫోన్ నెంబర్ తీసుకుని తిరిగి చెన్నై వచ్చాడు.
ప్రేమికుడు హిట్ తర్వాత నిర్మాత కుంజుమన్ కొత్త కథతో ఎవరైనా వస్తే తాను సినిమా తీయడానికి సిద్ధంగా ఉన్నానని పేపర్ ప్రకటన ఇవ్వడం జరిగింది. అలా దర్శకుడు కదీర్ వెళ్లి నిర్మాత కుంజుమన్ ను కలవడం జరిగింది. అలా ఆ కథ కుంజుమన్ కి నచ్చడంతో సినిమా మొదలు పెడదాం అనుకున్నారు. ముందుగా హీరోయిన్ గా దేవయానిని అనుకున్నప్పటికీ… ఆమె డేట్స్ కుదరలేదు. తర్వాత బొంబాయి వెళ్లి ఆడిషన్స్ చేస్తున్నప్పుడు… ఒకసారి మధ్యలో “హిమ్మత్” అనే చిత్రంలో నటిస్తున్న టబును కలిశారు. ఆమెకు కథ నచ్చడంతో వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. అలా టబు హీరోయిన్ గా సెలెక్ట్ కావడం జరిగింది.
ఇదివరకు “జెంటిల్ మేన్” చిత్రంలో వినీత్ ఒక పాత్ర వేయడం జరిగింది. ఈ సినిమాకి అతన్ని మొదటి హీరోగా తీసుకున్నారు. ఇక రెండో హీరోగా దర్శకుడు కదీర్ తను కొద్దిరోజుల ముందు బెంగళూరులో కలిసిన అబ్బాస్ తీసుకున్నారు. కదీర్ వివిధ రకాలైన కాలేజీలను చూసినప్పటికీ అవి నచ్చకపోవడంతో కోటి రూపాయలతో “మహాబలేశ్వరం”లో భారీ సెట్టింగ్ వేయడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించి కేవలం పాటలకే 2 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. సినిమా షూటింగ్ వైజాగ్, చెన్నై, ముంబై , నేపాల్ వంటి లొకేషన్లలో చిత్రీకరించారు. సినిమాకి దాదాపు ఏడు కోట్ల వరకు ఖర్చు చేశారు. ఇంత భారీ మొత్తం రజనీకాంత్, కమల్ హాసన్ చిత్రాలకే ఆరోజుల్లో ఖర్చుచేసేవారు. కానీ ఎలాంటి స్టార్ డమ్ లేని అబ్బాస్, వినీత్ మీద ఇంత మొత్తాన్ని ఖర్చు చేయడం సినీ ప్రముఖులను విస్మయానికి గురి చేసింది.
1995 డిసెంబర్లో షూటింగ్ ప్రారంభించి 1996 ఆగస్టు 30న ప్రేమదేశం సినిమాని విడుదల చేశారు. ముస్తఫా..ముస్తఫా.. అనే పాటకి గొంతు కలపని యువకుడు, హలో డాక్టర్ హార్ట్ మిస్ ఆయే… అనే పాటకి చేయి కదపని యువతి అంటూ లేదేమో అనిపిస్తుంది. ఏ ఆర్ రెహమాన్ తన పాటలతో కాలేజీ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఆ రోజుల్లో కుర్రాళ్ళు కాలేజీకి డుమ్మా కొట్టి ప్రేమదేశం చిత్రానికి వెళ్లేవారు. ఇక అబ్బాస్ పేరుతో ఏకంగా చాలాచోట్ల “అబ్బాస్ హెయిర్ సెలూన్స్” వెలిచాయంటే అతిశయోక్తి కాదు. తమిళంలో “కాదల్ దేశం” తెలుగులో “ప్రేమ దేశం” పేరుతో కొద్ది రోజుల తేడాతో విడుదలై రెండు రాష్ట్రాల్లో అద్భుత విజయాన్ని సాధించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…