ఆ రోజుల్లో అబ్బాస్ పేరుతో కొన్ని “హేర్ సెలూన్స్” వెలిచాయంటే మీరు నమ్ముతారా..!!

0
1972

దర్శకుడు కదీర్ తను చూసిన కొన్ని ప్రేమకథా చిత్రాల కంటే భిన్నంగా ఓ ప్రేమ కథ చిత్రం చేయాలనుకున్నారు.ఆ క్రమంలో ఆయన దాదాపు ఆరు నెలలు కష్టపడి ఓ కథ రాసుకున్నారు. ఆయన కొంత విరామం కావాలనుకుని ముంబాయి, బెంగళూరు అలా పర్యటిస్తున్న సందర్భంలో బెంగళూరులో ఒక కేఫ్ లో స్టైల్ గా దువ్వుకొని ఒక అబ్బాయి కనిపించాడు. వెళ్లి అతని గురించి వాకబు చేయగా తను మోడలింగ్ చేస్తున్నాని చెప్పాడు. అయినా ఫోన్ నెంబర్ తీసుకుని తిరిగి చెన్నై వచ్చాడు.

ప్రేమికుడు హిట్ తర్వాత నిర్మాత కుంజుమన్ కొత్త కథతో ఎవరైనా వస్తే తాను సినిమా తీయడానికి సిద్ధంగా ఉన్నానని పేపర్ ప్రకటన ఇవ్వడం జరిగింది. అలా దర్శకుడు కదీర్ వెళ్లి నిర్మాత కుంజుమన్ ను కలవడం జరిగింది. అలా ఆ కథ కుంజుమన్ కి నచ్చడంతో సినిమా మొదలు పెడదాం అనుకున్నారు. ముందుగా హీరోయిన్ గా దేవయానిని అనుకున్నప్పటికీ… ఆమె డేట్స్ కుదరలేదు. తర్వాత బొంబాయి వెళ్లి ఆడిషన్స్ చేస్తున్నప్పుడు… ఒకసారి మధ్యలో “హిమ్మత్” అనే చిత్రంలో నటిస్తున్న టబును కలిశారు. ఆమెకు కథ‌ నచ్చడంతో వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. అలా టబు హీరోయిన్ గా సెలెక్ట్ కావడం జరిగింది.

ఇదివరకు “జెంటిల్ మేన్” చిత్రంలో వినీత్ ఒక పాత్ర వేయడం జరిగింది. ఈ సినిమాకి అతన్ని మొదటి హీరోగా తీసుకున్నారు. ఇక రెండో హీరోగా దర్శకుడు కదీర్ తను కొద్దిరోజుల ముందు బెంగళూరులో కలిసిన అబ్బాస్ తీసుకున్నారు. కదీర్ ‌వివిధ రకాలైన కాలేజీలను చూసినప్పటికీ అవి నచ్చకపోవడంతో కోటి రూపాయలతో “మహాబలేశ్వరం”లో భారీ సెట్టింగ్ వేయడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించి కేవలం పాటలకే 2 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. సినిమా షూటింగ్ వైజాగ్, చెన్నై, ముంబై , నేపాల్ వంటి లొకేషన్లలో చిత్రీకరించారు. సినిమాకి దాదాపు ఏడు కోట్ల వరకు ఖర్చు చేశారు. ఇంత భారీ మొత్తం రజనీకాంత్, కమల్ హాసన్ చిత్రాలకే ఆరోజుల్లో ఖర్చుచేసేవారు. కానీ ఎలాంటి స్టార్ డమ్ లేని అబ్బాస్, వినీత్ మీద ఇంత మొత్తాన్ని ఖర్చు చేయడం సినీ ప్రముఖులను విస్మయానికి గురి చేసింది.

1995 డిసెంబర్లో షూటింగ్ ప్రారంభించి 1996 ఆగస్టు 30న ప్రేమదేశం సినిమాని విడుదల చేశారు. ముస్తఫా..ముస్తఫా.. అనే పాటకి గొంతు కలపని యువకుడు, హలో డాక్టర్ హార్ట్ మిస్ ఆయే… అనే పాటకి చేయి కదపని యువతి అంటూ లేదేమో అనిపిస్తుంది. ఏ ఆర్ రెహమాన్ తన పాటలతో కాలేజీ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఆ రోజుల్లో కుర్రాళ్ళు కాలేజీకి డుమ్మా కొట్టి ప్రేమదేశం చిత్రానికి వెళ్లేవారు. ఇక అబ్బాస్ పేరుతో ఏకంగా చాలాచోట్ల “అబ్బాస్ హెయిర్ సెలూన్స్” వెలిచాయంటే అతిశయోక్తి కాదు. తమిళంలో “కాదల్ దేశం” తెలుగులో “ప్రేమ దేశం” పేరుతో కొద్ది రోజుల తేడాతో విడుదలై రెండు రాష్ట్రాల్లో అద్భుత విజయాన్ని సాధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here