సుడిగాలి సుధీర్ టీంపై మండిపడుతున్న సూపర్ స్టార్ అభిమానులు.. ఎందుకంటే..?

0
1513

ఈటీవీలో ప్రతీ శుక్రవారం రాత్రి ప్రసారమవుతున్న ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. అయితే అందులో హీరో సూపర్ కృష్ణను అవమానించేలా జబర్ధస్త్ టీమ్ మెంబర్స్ సుడిగాలి సుధీర్ చేసిన స్కిట్స్ పై సూపర్ స్టార్ అభిమానులు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు.

అయితే ఈ షోలో ఎక్కువ శాతం బడా హీరోల పాత్రలను, ఇంకా డ్యాన్స్ లను పేరడీగా తీసుకొని చేస్తుండటం.. వాటిని కామెడీ మలిచి ప్రేక్షకులకు చూపిస్తుంటారు. అందులో కొంత వరకు విజయవంతం అవుతాయి. కానీ కొన్ని కొన్ని బెడసి కొడతాయి. అదేంటంటే.. తాజాగా ఈటీవీలో ప్రసారమైన ఎక్స్‌ట్రా జబర్ధస్త్ కామెడీ షో ప్రోగ్రామ్‌లో సుడిగాలి సుధీర్ చేసిన స్కిట్ కు సూపర్ స్టార్ కృష్ణ అభిమానులకు కోపం తెప్పిచ్చింది.

అందులో సూపర్ స్టార్ కృష్ణ నటించిన అమ్మ దొంగా సినిమాలోని నీతో సాయంత్రం ఎంతో సంతోషం అనే పాటను పేరడీగా చేశారు. దీనిని ప్రతీ సారి సుధీర్ ఒక పేరడీ డ్యాన్స్ గా వేస్తుండటంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఢీ, శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి షోలో కూడా అప్పుడప్పుడు ఆ పాటను పేరడీగా చేసి కామెడీగా మలుస్తుండటంతో సూపర్ స్టార్ కృష్ణ ఇమేజ్‌ను దెబ్బతీసే విధంగా ఉందంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై సుడిగాలి సుధీర్‌తో పాటు అతడి టీమ్ మెంబర్స్ పై అభిమానులు మండిపడుతున్నారు. దీనిపై వాళ్లు ఎలా స్పందిస్తారనేది చూడాలి మరి.