Movie News

“ఊహ తెలిసినప్పటి నుంచి అన్నీ నాన్నే.!” ఎమోషనల్ అయిన ఇంద్రజ.. వైరల్ గా మారిన వీడియో..!


బుల్లితెరపై ఎక్కువగా పాపులారిటీ తెచ్చుకున్న షో అనగానే చాలామందికి టక్కున చెప్పే సమాధానం జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్ కామెడీ షో. ఎందుకంటే దాని టీఆర్ పీ రేటింగ్ ఆవిధంగా ఉంటుంది మరి. ఇందులో వచ్చి పాల్గొన్న ప్రతీ ఒక్కరు పేరు తెచ్చుకున్నారు. తెలుగు సినీ నటి ఇంద్రజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

హీరోయిన్ గా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత జబర్దస్త్ కామెడీ షోతో జడ్జిగా పరిచయమైన ఇంద్రజ.. బుల్లితెరపై అతి తక్కువ సమయంలో ప్రేక్షకులను మెప్పించింది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా అందరినీ మెప్పించిన ఇంద్రజ తర్వాత ఈటీవీలోనే ప్రసారం అవుతున్నా మరో ఎంటర్టైన్మెంట్ షో శ్రీదేవి డ్రామా కంపెనీల్లో కూడా పాల్గొని తన డాన్సులతో, నవ్వులతో బాగా సందడి చేస్తుంది. ఇలా తెలుగు ఆడియెన్స్ కు టచ్ లో ఉంటూ ఇంద్రజ పలు షోలో కనిపిస్తుంది.

తాజాగా ఇంద్రజ స్టార్ మాలో ప్రసారం అవుతున్న సిక్స్త్ సెన్స్ కామెడీ షోలో పాల్గొని ఎమోషనల్ అయ్యారు. ఇందులో ఓంకార్ హోస్టింగ్ చేస్తూ.. వచ్చిన సెలబ్రిటీలను టెన్షన్ లో ముంచుతాడు. దీంతో ఈ వారం ఎపిసోడ్ లో ఇంద్రజ పాల్గొంది. ఆమెతో పాటు సుడిగాలి సుధీర్ కూడా పాల్గొన్నాడు. షో మధ్యలో ఇంద్రజ కుటుంబానికి సంబంధించి ఒక ఫొటోను ఓం కార్ డిస్ ప్లే లో చూపించారు.

అందులో ఆమె తన నాన్నతో పాటు కుటుంబసభ్యులు ఉన్నారు. దాంతో తన ఫ్యామిలీ గురించి కొన్ని విషయాలు షోలో పంచుకుంది. తన తండ్రి అంటే ఇష్టమని చిన్నప్పటి నుంచి అన్నీ ఆయనే అంటూ బాగా ఎమోషనల్ అయ్యింది. తండ్రి ప్రేమ ఎంతో స్వచ్చమైనదంటూ.. తండ్రి లేకుంటే కుంటుంబం అనేది ఉండదని ఆమె చెబుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఏడాదిలో ఒక్కరోజే అవకాశం.. సింహాచలం స్వామి నిజరూప దర్శనం కోసం భక్తుల తాకిడి

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ వైష్ణవక్షేత్రాలలో ఒకటైన సింహాచలం దేవాలయంలో జరగబోయే చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది విశేషంగా నిర్వహించే…

3 minutes ago

రాజకీయాలకు ఆధ్యాత్మిక టచ్.. విజయ్ వినూత్న ప్రచారం అందరి దృష్టిని ఆకర్షించింది!

తమిళ సినీ నటుడు, తమిళక వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ తాజాగా రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక…

33 minutes ago

చార్‌ధామ్ యాత్ర ప్రారంభం.. యమునోత్రి, గంగోత్రి దర్శనాలకు భారీగా తరలివచ్చిన భక్తులు!

ఉత్తరాఖండ్‌లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్‌ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…

1 hour ago

నా మాటలను వక్రీకరించారు.. ప్రకాశ్ రాజ్ క్లారిటీ

సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…

21 hours ago

డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపితే… మీ ఆరోగ్యానికి రిస్క్

ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…

1 day ago

కొబ్బరి చట్నీ కేవలం రుచే కాదు… ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకోండి!

ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…

1 day ago