Tag Archives: tik tok star

ఉద్యోగం పోయినా.. రెండు చేతులా సంపాదిస్తోంది.. లక్ అంటే అదే మరి..!

కరోనా కాలంలో చాలామందికి ఉద్యోగాలు లేక.. ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోయి ఇబ్బందులకు గురవుతుంటే.. ఆమెకు మాత్రం కరోనా కాలం కలిసొచ్చింది. ఏకంగా రూ. కోట్లు సంపాదించేందుకు వీలు కుదిరింది. ఆమె పేరు పప్పీ ఓ తూలే. కరోనా మహమ్మారి కారణంగా ఆమె చేస్తున్న ఉద్యోగం పోయింది.

ఏం చెయ్యాలో తెలియని స్థితి వచ్చేసింది. ఓ రోజు ఆమెకు మంచి ఆలోచన తట్టింది. బంగాళా దుంపలతో వంటలు చేస్తూ రోజూ రూ. లక్షలు సంపాదిస్తోంది. పూర్తి వివాల్లోకి వెళ్తే.. ఆమె వయస్సు 27 ఏళ్లు. బ్రిటన్ కు చెందిన యువతి. ఓ ప్రముఖ సంస్థలో రెసిపీలు ఎలా వండాలో నేర్చుకుంది. తర్వాత మరో కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. నెలకు దాదాపు 280 గంటలు కష్టపడుతూ వంటలు చేసింది. కానీ ఏం లాభం.. వచ్చే జీతం మాత్రం సరిపోయేది కాదు.

తర్వాత కరోనా వచ్చి ఉద్యోగం పోయింది. అదే సమయంలో ఆమె తల్లిదండ్రుల సాయంతో టిక్ టాక్‌లో పర్సనల్ వీడియోలు పోస్ట్ చెయ్యడం ప్రారంభించింది. దానిలో భాగంగానే బంగాళదుంపతో రెసిపి వండి టిక్ టాక్ లో పోస్ట్ చేసింది. అంతే ఇక ఆ వీడియోని విపరీతంగా చూశారు. లక్షల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఇదేదో బాగుందనుకొని ఆలూతో చేసిన వంటలు అన్నీ చేసి.. వీడియో తీసి టిక్ టాక్ లో పోస్ట్ చేసింది. ఇక ఆమె వీడియోలు అన్నీ వైరల్ అయ్యాయి.

అమెరికా వాళ్లు ఆమె వీడియోలను తెగ చూసేశారు. ఏకంగా 2 కోట్లు వ్యూస్ వచ్చాయి. దీంతో ఆమెను ఫాలో అయ్యారు. దీంతో ఆమె వంటలకు సంబంధించిన బుక్ ను కూడా రిలీజ్ చేసింది పప్పీ. దానిపేరు రెసిప్ బుక్ సెప్టెంబర్ 2021. ఇలా ఆమె పాలపులారిటీ తెచ్చుకొని వ్యూస్ తెచ్చుకుంటూ.. ఫాలోవర్స్ పెంచుకుంటూ రెండు చేతులా సంపాదిస్తోంది.కరోనా కొందరికి దురదృష్టం అయితే మరికొందరికి అదృష్టం అని చెప్పడానికి ఇదే నిదర్శనం అని చెప్పవచ్చు.

మళ్ళీ వస్తున్నాను.. మీ సపోర్ట్ నాకు కావాలి: ఫన్ బకెట్ భార్గవ్

ఫన్ బకెట్ భార్గవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టిక్ టాక్ వీడియోల పేరుతో ఒక మైనర్ బాలికను బెదిరించి తనను లొంగదీసుకుని లైంగికంగా దాడి చేసిన ఘటనలో అరెస్టయిన ఫన్ భార్గవ్ తాజాగా బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.ఏప్రిల్ నెలలో చెల్లి అని పిలుస్తూనే 14 సంవత్సరాల బాలికను భయపెడుతూ లొంగదీసుకొని లైంగికంగా వేధించినట్లు అతనిపై ఫిర్యాదు రావడంతో అతనిపై కేసు నమోదు చేసుకొని కోర్టులో హాజరుపరచగా అతనికి జైలు శిక్ష విధించింది.

తాజాగా భార్గవ్ పెట్టిన పోస్టు చూస్తుంటే అతడు జైలు నుంచి విడుదలైనట్లు తెలుస్తోంది.యూట్యూబ్ ద్వారా పలు ఫన్నీ వీడియోలను చేస్తూ.. ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న భార్గవ్ ఆ తర్వాత టిక్ టాక్ వీడియోలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ గుర్తింపు ద్వారానే సినిమాలలో చిన్న చిన్న అవకాశాలను సంపాదించుకున్న భార్గవ్ ఒక బాలిక పట్ల ఈ విధంగా ప్రవర్తించడంతో జైలుపాలయ్యాడు.

ఈ విధంగా భార్గవ్ పై కేసు నమోదు కావడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విధమైన ఆరోపణలతో భార్గవ్ ను అరెస్టు చేసిన పోలీసులు కోర్టు తీర్పు అనంతరం జైలుకు తరలించారు. భార్గవ్ తాజాగా జైలు నుంచి తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఫన్ బకెట్ భార్గవ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే మళ్లీ నేను వస్తున్నాను. నాకు ఎలాంటి సపోర్ట్ లేదు.. నాకు మీ అందరి సహకారం కావాలి అంటూ భార్గవ్ పోస్ట్ చేయడంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఇతను జైలు నుంచి బయటకు వచ్చాడు అని అర్థం అవుతోంది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు అందరూ పెద్ద ఎత్తున భార్గవ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం చేద్దామని.. ప్రజలకు ఏం చెబుదామని వస్తున్నావు..? అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు కురిపిస్తున్నారు.

ప్రముఖ టిక్ టాక్ స్టార్ ఆత్మహత్య.. కారణం అదే అంటున్న కుటుంబ సభ్యులు..!

టిక్ టాక్ ద్వారా ఎంతో ఫేమస్ అయి ఎంతో మంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్న కొందరు టిక్ టాక్ స్టార్ లు ఇప్పటికీ అదే రేంజ్ ను కంటిన్యూ చేస్తూ యూట్యూబ్ చానల్స్ ద్వారా వినోదాన్ని పంచుతారు.కొందరికి బుల్లితెరపై నటించే అవకాశం రాగా దుర్గారావు లాంటి వారికి ఏకంగా సినిమాలలో నటించే అవకాశాన్ని కూడా కల్పించింది. ఇందులో భాగంగానే టిక్ టాక్ ద్వారా ఎంతో ఫేమస్ అయిన షేక్ రఫీ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది.

నెల్లూరు లో కెమెరామెన్ గా పనిచేస్తున్న షేక్ రఫీ అక్కడి నుంచి రోజుకు పదుల సంఖ్యలో టిక్ టాక్ ద్వారా వీడియోలను అప్లోడ్ చేస్తూ మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు. ఇంత ఫాలోవర్స్ ఉన్న రఫీ ప్రస్తుతం ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర సంచలనం రేపుతోంది. రఫీ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఓ అమ్మాయని తెలుస్తోంది. రఫీ స్నేహితుడైన ముస్తఫాతో మంచి స్నేహం ఏర్పడింది. అయితే ముస్తఫా ఒక అమ్మాయితో ఎంతో చనువుగా వుండే వాడు. కానీ ఆ అమ్మాయి ముస్తఫాతో కన్న రఫీ తో చనువుగా ఉండటం చూసి తట్టుకోలేకపోయిన ముస్తఫా తన స్నేహితులతో కలిసి రఫీ పై దాడిచేశాడు. గాయాలతో ఇంటికి చేరుకోగా చికిత్స నిమిత్తం అతనిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.

రఫీ తండ్రి రియాజ్ అనంతరం ముస్తఫా పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విధంగా తన పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముస్తఫా రఫీను మరింత ఎక్కువగా వేధించేవాడు. అతని వేధింపులు రోజురోజుకి ఎక్కువవడంతో ఎంతో మనస్తాపానికి గురైన రఫీ జనవరి 22న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన కొడుకు ఆత్మహత్య చేసుకోవడానికి కేవలం ముస్తఫా వేధింపులే కారణమని రఫీ తల్లిదండ్రులు అతని పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.