కరోనా కాలంలో చాలామందికి ఉద్యోగాలు లేక.. ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోయి ఇబ్బందులకు గురవుతుంటే.. ఆమెకు మాత్రం కరోనా కాలం కలిసొచ్చింది. ఏకంగా రూ. కోట్లు సంపాదించేందుకు వీలు కుదిరింది. ఆమె పేరు పప్పీ ఓ తూలే. కరోనా మహమ్మారి కారణంగా ఆమె చేస్తున్న ఉద్యోగం పోయింది.
ఏం చెయ్యాలో తెలియని స్థితి వచ్చేసింది. ఓ రోజు ఆమెకు మంచి ఆలోచన తట్టింది. బంగాళా దుంపలతో వంటలు చేస్తూ రోజూ రూ. లక్షలు సంపాదిస్తోంది. పూర్తి వివాల్లోకి వెళ్తే.. ఆమె వయస్సు 27 ఏళ్లు. బ్రిటన్ కు చెందిన యువతి. ఓ ప్రముఖ సంస్థలో రెసిపీలు ఎలా వండాలో నేర్చుకుంది. తర్వాత మరో కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. నెలకు దాదాపు 280 గంటలు కష్టపడుతూ వంటలు చేసింది. కానీ ఏం లాభం.. వచ్చే జీతం మాత్రం సరిపోయేది కాదు.
తర్వాత కరోనా వచ్చి ఉద్యోగం పోయింది. అదే సమయంలో ఆమె తల్లిదండ్రుల సాయంతో టిక్ టాక్‌లో పర్సనల్ వీడియోలు పోస్ట్ చెయ్యడం ప్రారంభించింది. దానిలో భాగంగానే బంగాళదుంపతో రెసిపి వండి టిక్ టాక్ లో పోస్ట్ చేసింది. అంతే ఇక ఆ వీడియోని విపరీతంగా చూశారు. లక్షల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఇదేదో బాగుందనుకొని ఆలూతో చేసిన వంటలు అన్నీ చేసి.. వీడియో తీసి టిక్ టాక్ లో పోస్ట్ చేసింది. ఇక ఆమె వీడియోలు అన్నీ వైరల్ అయ్యాయి.
అమెరికా వాళ్లు ఆమె వీడియోలను తెగ చూసేశారు. ఏకంగా 2 కోట్లు వ్యూస్ వచ్చాయి. దీంతో ఆమెను ఫాలో అయ్యారు. దీంతో ఆమె వంటలకు సంబంధించిన బుక్ ను కూడా రిలీజ్ చేసింది పప్పీ. దానిపేరు రెసిప్ బుక్ సెప్టెంబర్ 2021. ఇలా ఆమె పాలపులారిటీ తెచ్చుకొని వ్యూస్ తెచ్చుకుంటూ.. ఫాలోవర్స్ పెంచుకుంటూ రెండు చేతులా సంపాదిస్తోంది.కరోనా కొందరికి దురదృష్టం అయితే మరికొందరికి అదృష్టం అని చెప్పడానికి ఇదే నిదర్శనం అని చెప్పవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…